మెట్రో సిటీ లైట్స్


Sun,April 29, 2018 11:15 PM

Metro-city-lights
నిద్రలేని శ్వేతరాత్రుల
మహానగర వీధుల నిండా
పాల సముద్రం లాంటి
ఫ్లోరెసెంట్ విద్యుత్ వెలుగుల్లో
ఉనికిని కోల్పోయిన రాత్రి!
కొమ్మల నీడల కింద
ఆరాటంగా కుక్కల మొరుగుడు,
అతుకుల్లా మిగిలిన చీకటిలో
తలదాచుకునే చోటు కోసం
వలస జీవుల పోరాటం!
మెట్రో సిటీ లైట్స్-
నాగరిక వైభోగంలో
సొర చేపల ఫ్యాషన్ షోలో
పేజ్‌త్రీ నిండా పిక్కల ప్రదర్శన,
తెల్లారగానే
నగరం నడి బొడ్డున
అడ్డా కూలీల పడిగాపుల మీద
ఎంతకూ తెల్లారని మరో రాత్రి!!
- నిఖిలేశ్వర్, 91778 81201

369
Tags

More News

VIRAL NEWS