ముఝే మాఫ్ కరో


Sun,April 22, 2018 11:42 PM

image
ఈ రాతిరి కలత నిద్దురకు
కారణం నేనే అయ్యుండొచ్చు
నేను అసిఫాను కాకుండా
అయోనిజనైతే బావున్ను
మై సఛ్ భోల్ రహా హు !
మేరీ ప్యారీ భాయియోం...
ఈ నేరం నాదైతే కాదు కదా !!
అమ్మా...
నన్ను క్షమించు
ఈ పారి ఈ నింద నీ మీదే వేసుకో
సుకుమారమైన ఈ మాంసపు ముద్దను
కన్నది నువ్వే కదా
నాన్నా...
నన్ను క్షమించు
నన్ను కడుపులోనే చిదిమేయనందుకు
నీకీ రంపపుకోత తప్పదు
కాలిపోతున్న ఆ పూలతోట కలలు నియ్యే కదా
మనుషులారా....
నన్ను మన్నించున్రి
మీ కాలక్షేపానికై
పత్రికల్లో ఒక్కదినమే పతాక శీర్షికై
వెలిగి మలిగిపోతున్నందుకు
ఒక్క మాట...
ఇయ్యాల ఇంకొంచెం శెక్కెర ఎక్కువేసుకుని
రోజంతా ఛాయ్‌ని సప్పరించున్రి
రేపటికి మళ్లీ తాజా వార్తనై
మీ ముంగిట్లో కొత్త ముగ్గయి ఇరగబూస్తాను
ఇక సెలవ్ !!
- బండారి రాజ్‌కుమార్, 99599 14956

434
Tags

More News

VIRAL NEWS