అదేం మనికి?


Sun,April 22, 2018 11:40 PM

Adem-maniki
చూపులకందేంతదాకా ఎదిగి
సారించినంత దూరాలకూ సాగే
కాలాల మేర అనంతం...
పిడచగట్టుకుంటే ఎక్కడిది?
విప్పారితే (నే)కదా-జీవితం!
కన్ను కన్నా-మిన్నుకన్నా మహోన్నతమైన
అసలు-సిసలైన కన్ను-హృదయం..
ముడుచుకుని పోయే కొద్దీ-
చోటుచేసుకునేది వింత విలయం!!
పాతబడి-పాతబడి వస్త్రం-
విశీర్ణం కావచ్చునేమోగాని...
వయస్సు మీదపడినా
శస్త్రం-శాస్త్రమూ-
శాస్త్రం-శస్త్రమవడమే సమ్మతం..
నూటికి నూరుపాళ్ళూ అదే సమున్నతం!
అంధులు కూడా కలగంటారని
నమ్మలేని వారిది
చూపుండే అంతుచిక్కని
అధోరకపు అంధత్వం-
లో చూపునకు నోచని
నికృష్టమైన మూర్ఖత్వం!
భ్రమింపజేసే సైగలకన్న
పుట్టు మూగతనం ఎంతో పటుతరమైనది...
నటించే పరధ్యానం కన్న
బధిరత్వం బంధుప్రాయమైనది..
చలన సూత్రాలకందని ఉనికి అదేం ఉనికి?
సృజన దిశగా మరలని మనికి అదేం మనికి?!
- వేణు సంకోజు, 99484 19881

400
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles