దిగంబర దేవత


Mon,April 16, 2018 12:43 AM

అవును
నేను వివస్త్రనయ్యాను
కానీ...
ఈ రోజు కాదే?
ఆది నుండి
బలవంతగానో.. బలహీనంగానో
వివస్త్రనౌతూనే ఉన్నా...!!
కండకావరమెక్కి
నన్ను జూదంలో పెట్టినప్పుడు...
ఒకే గర్భం నుండి మొలిచిన
ఐదు కొమ్ములు
నన్ను పంచుకున్నప్పుడు
వివస్త్రనయ్యాను...!!
నాటికి... నేటికి
ఏమైనా మారిందా అంటే ?
అవును...
అప్పుడు బలవంతంగా వివస్త్రనయ్యా
ఆ దైవనాగుల వీర్యపు చుక్కలు
నా అంగాగలను కాటేస్తుంటే
బలహీనంగా రాలిపోయాను...!!
మరి నేడు ?
ముసిలోడి కొవ్వు పట్టిన
కండను చుంబించినప్పుడు
వాడి కొడుకు మదమెక్కి
అదే గదిలో
నా దేహాన్ని తూట్లు పొడిచినప్పుడు
బలహీనంగానే రాలిపోతాననుకున్నారు...!!
ఇప్పుడు...
మరో కురుక్షేత్రం మొదలవ్వాలి
కామ ప్రేతాలకు చితి పేర్చి
కాలపు మంటలో
కాల్చి బూడిద చేయడానికి...!!
మా దేహాలను
సమాజపు అంగట్లో పెట్టి
సొమ్ముచేసుకొని వదిలేస్తూ
కొవెక్కిన కండను తెగనరకడానికి
మరో కురుక్షేత్రం జరగాలి ..!!
ఔను నేను వివస్త్రనయ్యాను
ఆ రోజు...
నాలుగు గోడల మధ్య
నేడు...
నాలుగు దిక్కులనే గోడల మధ్య
న్యాయం కోసం.. నీతి కోసం
ధర్మం కోసం.. నగ్న దేవతనయ్యాను..!!
- నిజాగ్ని, 9700747280

498
Tags

More News

VIRAL NEWS

Featured Articles