వెన్నెల నది


Sun,April 8, 2018 11:37 PM

వెన్నెల మధువు తాగి
అలలు నిద్దురలోకి జారుకున్నాయ్!
మంచు దుప్పటి కప్పుకుని
ఏ గాలీ అల్లరి చేయక
RIVER
ఒడ్డున పడవలు కలల్లో తేలుతున్నాయ్!
దూరపు గమ్యం చేరువైనట్టు..
పక్షులు రెక్కలు విప్పార్చి
జ్యోత్స్నిక మాధుర్యపు
కమ్మదనాన్ని తాగుతున్నాయి!
ధారలుగా కురుస్తున్న శ్వేత చంద్రిక
తెరలు తెరలుగా.. పవన వీచికల్లా...
తుంపరలా కురుస్తోంది.. నదుల్లా ప్రవహిస్తోంది..!
సిరల్లోకి, ధమనుల్లోకి, మెదడు నాడుల్లోకి
తెల్లని మబ్బుల గుంపులు..!
వెన్నెల గౌనులు తొడుక్కున్న
పెళ్లి కూతుళ్లలా.. సిగ్గుల్లో తేలుతున్నాయ్
ఎన్ని పౌర్ణమి రాత్రుల ఎడబాటు!
ఆమె ఆ ఒడ్డున.., నేనీ దూర తీరాన..
పువ్వుల్లా రాలుతున్న శిశిరం..
మల్లెల మేనాలో తీసుకొస్తుందో..?
తెరచాప నావై తనను మోసుకొస్తుందో..!?
- బి.టి.గోవిందరెడ్డి, 9052472424

976
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles