లే..!


Mon,April 2, 2018 01:26 AM

నిత్యకృత్యాల నిరంతర జీవనయానం
ఒకానొక భయానక సంఘటనయ్యె
గగుర్పాటునొక క్షణం వదిలి
ఊహాగానం చేసే మనసు-వదిలి
పాల కొక్కేనికి వేళాడె
యాపిల్ పండు కిందికే పడినట్లు..!
కొండలు, మైదానాలు దాటి
గుహల నుండి గృహాలకు ఎదిగిన మెదడొక్కటే గాదు
మెసపొటోమియా వర్ణచిత్రాన్ని-గత-అనుగతాన్ని
గుండె గోడకూ వేళ్ళాడేసె..!
నిర్మాణాల-నిర్ణయాల-నియంతల-
కఠిన చిత్తుల కాన్వాస్ రంగులు జారి జారి
దుఃఖ సంద్రానికి దిగె
నీరు కదా పల్లమెరిగేది
అక్కడ భీభత్సమాపారు.
చిన్నారుల కన్నీళ్లను కలుపుకొని,
శవాల గుట్టలు తడుపుతూ
దహనజాడల చితిమంటల నల్లనిపొగలు
అలవాటుగా చూసే అగ్రరాజ్యాలు
అవకాశవాదులు కొత్తగా చేయనిదేంది,
మౌన రోదనలు వీడి రుధిరజ్వాలలు రేప
భగభగ మంటలు సూర్యుళ్ళై ఇవ్వాలి చేతావని!
కాలం కళ్ళు మూసిన ప్రతిసారి
కళ్ళు ప్రపంచం నిద్రించె
ఇక భళ్ళున తెల్లారే భయద స్వప్నం
శత్రుగుండెల్లో నిలవాలి
యాప్రటిస్, టైగ్రిస్ నదుల నాగరికతకెదురీదే సిరియా కావాలి!
- కొండపల్లి నీహారిణి
98663 60082

439
Tags

More News

VIRAL NEWS