ఖాళీ ఫ్లవర్


Mon,March 26, 2018 01:17 AM

kali-flower
మనిషే.. కాదు మట్టీ.. చెవిలో
పువ్వు పెడుతుందంటే నమ్మలేదు
ఇంట్లోని ఖాళీ కడుపుల్లో
కాసిన్ని మెతుకులు వేద్దామని
లోకులు కూడా పూలనే ఇష్టపడుతారని
కాలీ ఫ్లవర్లు నాటాను
అది ఒట్టి కాగితపు పువ్వై
దళారి ముందు బోర్లాపడింది
మల్లెలు వేసినా బావుండును
రమణుల జడ కుచ్చుల్లో
కాసేపు మురిసి పరిమళం పంచేవాడ్ని
రాజ్యపు గారడీలో పంటలన్నీ
ముఖం వేలాడేస్తున్నాయి
ఇక మిగిలింది
నన్ను నేను మట్టిలో నాటుకోవడమే
మరుజన్మలోనైనా
ఖడ్గమై మొలిస్తే బావుండు
పంటను పెంటగా చూసే వాడి
తలను తుత్తునియలు చేయడానికి...
- డాక్టర్ వెల్దండి శ్రీధర్, 98669 77741

478
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles