ఉరుకులాట!


Mon,March 26, 2018 01:16 AM

CITY-LIFE
ఉదయం లేచింది మొదలు
రాత్రి నిద్రపోయేదాక
ఉరుకులాట-ఒకటే ఉరుకులాట!
పెందలకడనే పశుపక్ష్యాదులకూ
మేత కోసం వెతుకులాట!
అందరికీ బ్రతుకుతెరువు తండ్లాట!
ఉదయం పూట ఉరుకులాట
పక్కవాడు పడిపోయినా
జనారణ్య నగరంలో
కారుణ్య రహితంగా
కాలం వెంట పరుగులు
ధన సంపాదనకై
దానవతంగా దండిబాట!
పనుల తొందర్లో
మమతల చిందర వందర్లో
పట్నం బాట!
ప్రతిరోజూ ఉరుకులాట
బతుకే ఒక వెతుకులాట..!!
- డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, 92465 41699

471
Tags

More News

VIRAL NEWS