భద్రాద్రి రామయ్య


Mon,March 26, 2018 01:15 AM

సీ.
భూలోక మెల్లను పాలించు చుంటివి
భద్రాద్రి నుండియు భద్రముగను
ముత్యాల తలబ్రాలు పుడమికూతురుపైన
కోట్లభక్తుల మ్రోల కూర్మి బోసి
సోదర ప్రేమను చూపించు చుంటివి
అవనిలో మిన్నగ ననుగు మీర
కీర్తనల్ సేయనా కృష్టముగ్ధుడవైతి
గోపన్న పాటకు గోము మీరు
ఆ.వె.
రామ రామ యనుచు రామజపము సేయ
నిష్ఠతోడ నరులు నియమ మెుప్ప
తెలుగు నేలపైన వెలసితి రామయ్య
సీత గూడి భువిని సిరులు గురియ
ఆ.వె
ధనము లిచ్చి నీవు తానీష ప్రభువుకు
రామదాసు బ్రోవ ప్రథితి కలిగె
రాజ్యపాలనంబు రంజిల్లగను సేయ
రామరాజ్యమన్న రంతు గలిగె .
- డాక్టర్ గుడేలి శీను, 9959954848

448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles