కలల షహనాయీ...


Mon,March 26, 2018 01:14 AM

దున్నిన నల్లరేగడి నేలలా నిండారా కప్పుకొన్న బురఖా
ముత్యం పొదిగిన ఉంగరం
బంధించడంలోనూ మహానైపుణ్యం
నేను ఏమీ పట్టని చెక్కుడు పువ్వులా....
చిత్రంగా అందించిన అతని ఫొటో జిరాక్స్ కాపీ గుండె పొరపై వేసుకొంటూ...
గల్లాలో నాణెంలా పదిల పరచుకొంటూ...
కొబ్బరి ఈనెల సితార్ వాదం మ్రోగుతూంటుంది...
చురుకు కలలు షెహనాయీల కూనిరాగాలు తీస్తాయి.
ఆదుర్దాగా అలమారులో దొరికిన నారొక్కా(శుభలేఖ)
ఏడు సముద్రాల కావల రాకుమారుడిని నిర్ణయిస్తూ
అపరిచయమైన పేరుతో నన్ను జతపరిచి
చిన్నప్పటి కాల్పనిక కథలా మలుపు తిరుగుతూ నాది కాని నా జీవితం
జలీల నీడ మొఖం మీద కదులుతున్నట్లుగా నేను.
బ్రహ్మజెముడు మీద కప్పిన చున్నీలా పీలికలుగా చీలికలు హృదయం
కాటుక చారికతో ఫొటో తాలూకు జ్ఞాపకం జార్చుకొంటూ..
ఎన్నిమైలు రాళ్ళు దాటితే అంత అదృష్టం అట
చేతికి పెడుతున్న మెహెందీ మెలికలుగా ఆలోచనలు ఎటూ తేలనీయవు
మారే మీ నిర్ణయానికి కళ్ళు విడువని నాపసితనానికీ
సౌదా కదరకపోయినా..
ఆమూసలోనే అలవాటుగా బురఖా సరిచేసుకొంటూ...
-సిహెచ్.ఉషారాణి, 9441228142

436
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles