నిత్యహాసములు


Mon,March 19, 2018 12:59 AM

Ugadhie
వర్షమ్ము మనకెంతో హర్షమ్ము నింపగా
సరియైన సమయాన కురియుగాక!
నెలరాజులను బోలు నిత్యహాసమ్ములు
మా రైతు ముఖముల నమరుగాక!
పక్షపాతములేని పరిపాలనము మాకు
అధినాయకుల నుండి అందుగాక!
వారను, వీరను తారతమ్యములేక
స్త్రీలను గౌరవించెదము గాక!
అమ్మరో జుగుప్సను వీడి అన్ని మాధ్య
మములు శాంతి గంటల శబ్ద మయము గాగ
అనిమిషవరులు సతము మమ్మరయుచుండి
రక్షణము నిచ్చుత విళంబి సాక్షముగను!!
-దోరవేటి 9866251679

468
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles