ప్రకృతికే నేస్తంలా..


Mon,March 19, 2018 12:58 AM

కోయిలా కూయవేల?
రాయిలా మౌనమేల?
ఉగాది రాలేదనా..? రాదేలనా..?
మామిడమ్మ చివురేయలేదనా
మల్లిచెల్లి పూయలేదనా
చింత కాయకుంటే ఎందుకంత చింత?
మన్మధుడు చెఱకును విల్లుకై
ఎత్తుకెళ్లాడనా !
మమకారాలు కరువయ్యాయనా..!
నీ పాట జనం మరిచేదయ్యిందనా..!
పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ
కరువయ్యిందనా!!
ఎందుకు నేస్తం? ఈ బేలతనం..?
నేనున్నాను నీకోసం
నా షడ్రుచుల జీవితమూ ఉంది
తలపు(తలుపు)తీయనిమనసుంది
కాసింత మానవతపై మమకారముంది
నచ్చక చిటపట లాడినా
తప్పని సరియగు స్నేహిత(ం)ము(ఉ)ప్పుంది
కారణమేదైనా మెచ్చేనేస్తాలను మరిచేదుంది
నొప్పించినా సవరించి ఉల్లాస తీరాలకు
పరుగులు తీసి వగర్చేదుంది(వగరు+చేదు)
జీవిత మలుపు మలుపులో గెలిపించే
వే(లు)పులు అందించే దీవెన ఉంది
పాడవే కోయిలా.. పాడుకోయిలా..
ప్రకృతికే నేస్తంలా.. పాటే సమస్తంలా...
- రాఖీ, 94910 42010

442
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles