యుతనేసియా


Mon,March 19, 2018 12:57 AM

నా చుట్టూ నేను పెంచుకున్న
బంధాలు గట్టివి
ప్రేమదారాలతో నేనే
అల్లుకుంటూ పోయిన ఆశలూ అనురాగాలూ
దేహం చుట్టూ పెనవేసుకున్నాయి!
వాటిని తెంపుకోవాలంటే
అచేతన దేహమేమో కానీ
హృదయం విలవిలలాడుతున్నది! కానీ..
నిశ్చయంగా కనిపిస్తూనే వుంది
కొడిగట్టిన దీపపు చివరి మెరుపు..!
మృత్యువు కదలికనేమో
మందులూ మాకులూ శ్వాశోపకరణాలూ
ద్వారం వద్దే నిలిపేశాయి..!
రాత్రులూ పగల్లూ.. ఎన్నని
దీపపు చివరి నుసి రాలాల్సిందే
హాజీర్ హొ అన్న చివరి ఘంట మోగాల్సిందే!
ముగింపే..తలెత్తుకున్నంత గౌరవంగా..
సముద్రపు అలలంత గంభీరంగా..
గాలి వీచినంత స్వేచ్ఛగా..
పిలవంగానే పక్కమీంచి లేచినంత
సహజంగానూ జరగాలి!
కారుణ్యంతో కైర్టెస్ దిగిపోవాలి..!!
- వారాల ఆనంద్, 94405 01281

429
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles