తెలంగాణ కథాన్వేషి ‘ముదిగంటి’


Mon,October 14, 2019 01:32 AM

సుజాతారెడ్డి తెలంగాణ తొలితరం కథలు కథాసంపుటం ద్వారా తెలంగాణలో మొదటితరం నుంచే సామాజిక అంశాలు కథావస్తువులు అయ్యాయనే విషయం తెలుస్తుంది. భాష విషయంలోనూ గ్రాంథికం నుంచి వ్యవహారిక భాష వరకు రచయితలు కథలు మలిచిన విధానం, పాత్రోచిత మాండలికాలను ఉపయోగించడం గమనించవచ్చు. వస్తు వు విషయంలో మాత్రం తెలంగాణ కథ సామాజిక అంశాలకే పెద్దపీట వేసింది. కథ నిర్మాణం శిల్పం విషయంలో కాలక్రమేణా పరిణతి కనిపిస్తుంది. తెలంగాణ తొలితరం కథల సంకలనం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక.
తెలంగాణ భాషాశైలికి సం స్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ.
తెలంగాణలో కవులు లేరని ఎవరో ఆంధ్ర అహంకారి చేసిన ఆరోపణలకు గోలకొండ కవుల సంచిక ద్వారా చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పారు ఆనాడు సురవరం ప్రతాపరెడ్డి. ఈ పట్టుదల నేటికీ తెలంగాణ పరిశోధకులలో ఉండటం హర్షణీయం. ఇక్కడ గొప్ప కథకులు ఉన్నారని తెలంగాణ తొలితరం కథలు ద్వారా నిరూపించారు డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి. హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయకమునుపే సుమారు 80కి పైగా కథకులను వెలుగులోకి తెచ్చా రు సుజాతారెడ్డి. వారి పరిశోధనకు రెండవ భాగం తొలినాటి కథలులో సహ సంపాదకులుగా సంగిశె ట్టి శ్రీనివాస్ సహకారం అందించారు.

సుజాతారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన అమూ ల్యగ్రంథం తెలంగాణ తొలితరం కథలు. తెలంగాణ కథపై పరిశోధన చేసేవారికి దీపం లాంటి గ్రంథమి ది. 35 మంది తొలితరం కథకుల కథలు ఇందులో చోటుచేసుకున్నాయి. మొదటి కథగా మాడపాటి హనుమంతరావు రాసిన మల్లికా గుచ్ఛము కథల సంపుటి నుంచి స్వీకరించిన హృదయశల్యము అనే కథ కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు వైభవాన్ని తెలియజేస్తున్నది. ఈ కథ 1912 జనవరి ఆంధ్రభారతి పత్రికలో ప్రచురితమైంది. 1927 సెప్టెంబర్లో సుజాతలో ప్రచురించబడిన కథ ఒద్దిరాజు రాఘవ రంగారావు రాసిన లండన్ విద్యార్థి. వరంగల్లు ప్రాంతానికి చెందిన వీరు తెనుగు పత్రిక వ్యవస్థాపకులుగా సుప్రసిద్ధులు. 1927 డిసెంబర్‌లో సుజాత పత్రికలోనే అచ్చయిన మరొక కథ పరమాణువులో మేజువాని. ఈ కథా రచయిత సిరుగూరి జయరా వు. అటు సైన్స్ ఇటు ప్రబంధ పాండిత్యం అటు గ్రాంథికము ఇటు తెలంగాణ మాండలికం మేళవించిన కథ ఇది. ఆ రోజుల్లోనే విజ్ఞానశాస్త్రం ఇతివృ త్తంగా కథ రావడం విశేషం. ఒద్దిరాజు సోదరులలో ఒకరు ఒద్దిరాజు సీతారామ చంద్రరావు రాసిన కథ రక్తమూల్య. 1928 మార్చి నెలలో సుజాత పత్రిక లో ప్రచురించబడింది. కర్తవ్య పాలన, సంఘ సం స్కరణ దృష్టి, దేశభక్తి, మానవతా దృక్పథం ఈ కథ లో అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. తెలంగాణ భీష్ముడిగా ప్రసిద్ధికెక్కిన ఆదిరాజు వీరభద్రరావు రాసిన ఆదిలక్ష్మి కథ ఇంకొకటి. 1928 జులై నెలలో సుజాత పత్రికలో ప్రచురించబడింది.

స్వాతంత్ర సమరయోధుడు నందగిరి వెంకటరా వు రచించిన కథ ప్రతిఫలం. 1934 మే నెలలో భారతి పత్రికలో ప్రచురితమైనది. గోల్కొండను ఔరంగజేబు జయించే చారిత్రక ఘట్టం ఇందులో చిత్రించబడింది. ఎల్లాప్రగడ సీతాకుమారి రాసిన ఈ రాధే నా అనే కథ పసి పిల్లలను ముసలివారికి ఇచ్చి వివాహం చేసే దుష్ట సంస్కృతిని చిత్రించింది. ఈ కథ 1938 జూలై నెలలో భారతిలో ప్రచురితమైనది. సామాజిక ఇతివృత్తం కలిగిన కథ సంఘాల పంతులు. సురవరం ప్రతాపరెడ్డి రాశారు.

1940లో ఆంధ్రకేసరిలో వచ్చిన కథ తిరుగుబా టు. కథారచయిత వెంకట రాజన్న అవధాని. స్త్రీ విద్య ఆవశ్యకతను తెలియజేస్తూ స్త్రీ స్వేచ్ఛను కాం క్షించిన కథ ఇది. నల్లగొండ జిల్లా చిత్తలూరు గ్రామానికి చెందిన బోయినపల్లి రంగారావు రచించిన కథ వారం రోజుల అవస్థ. ఒక కథ రాయడానికి కథకు డు పడే అవస్థను ఈ కథలో చిత్రిక పట్టారు. 1940 లో ఆంధ్రకేసరి పత్రికలో ఈ కథ ప్రచురితమైనది. గోపాలరెడ్డి రాసిన కథ గప్ చుప్. పేద రైతుల దీనస్థితిని ఈ కథలో వర్ణించారు. 1940 ఆంధ్రకేసరిలో ఈ కథ ప్రచురించబడింది. నందగిరి ఇందిరాదేవి రాసిన కథ పందెం. 1941 జనవరి నెలలో గృహల క్ష్మి పత్రికలో ప్రచురించబడింది. 10 సంవత్సరాలపాటు గృహనిర్బంధం చేయబడిన వ్యక్తి ఈ ప్రపం చం పట్ల వైరాగ్యభావన ప్రకటించడం ఈ కథలో కనిపిస్తుంది. తెలియక ప్రేమ తెలిసి ద్వేషము కథారచయిత కాళోజీ నారాయణరావు. ఈ కథలో హాస్యం వ్యంగ్యం అద్భుతంగా పండించారు కాళో జీ నారాయణరావు.

1945లో వచ్చిన జైలుకథల సంపుటిలో ఒక చక్కని కథ సమాధి స్థలం. పొట్లపల్లి రామారావు రాశారు. భూమి ఆక్రమణ, పేదల బతుకులు చిత్ర ణ ఈ కథలో ఇతివృత్తం. బూర్గుల రామకృష్ణారావు కుమారుడు బూరుగుల రంగనాథరావు రాసిన కథ ప్రమాదం. 1942లో భారతి పత్రికలో అచ్చయిం ది. ప్రేమ ఇతివృత్తంగా చమత్కారమైన కల్పనలతో సాగిన కథ ఇది. నల్లగొండ జిల్లా చండూరు ప్రాం తానికి చెందిన ధరణి కోట శ్రీనివాస్‌రావు రచించిన కథ చల్ల పులుసు. నీలగిరి సాహిత్య సమితి వ్యవస్థాపకులు. అన్నంలోకి అనే పేరుతో కథాసంపుటి వేశారు. ఇవి అలభ్యము. సంఘ సంస్కరణ భావాలను చిత్రించే కథ ఆత్మఘోష. ఇది జి.రాములు రాశారు. 1945లో ముద్రితమైంది. నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని రావిపాడు గ్రామానికి చెందిన కాంచనపల్లి చిన వెంకటరామారావు రాసిన కథ చెరువు ఒడ్డున. తెలంగాణలో దొరలు దేశ్‌ముఖ్‌లపై సాధారణ ప్రజల తిరుగుబాటు ఈ కథలో ఇతివృత్తం ఇది 1946లో రాశారు. పీవీ నరసింహారావు రాసిన సుప్రసిద్ధ కథ గొల్ల రామవ్వ 1949లో కాకతీయ పత్రికలో విజయ కలం పేరు తో అచ్చయింది.

జి.సురమౌళి రాసిన అంగుడు పొద్దు కథ నాటి తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించింది. భాస్కరభట్ల కృష్ణారావు రాసిన ఇజ్జత్ కథలో తెలంగాణ రైతు జీవితం తెలంగాణ గ్రామీణ వాతావరణం కనిపిస్తాయి. వెల్దుర్తి మాణిక్యరావు రాసిన ఎయిర్ మేల్ కథ భార్యాభర్తల అనురాగాన్ని చిత్రించింది. పి.వెంకటరామారావు రాసిన కథ కొత్త నాగలి. మృగశిర కార్తిలో రైతుల ఏరువాక సంబురాలను చిత్రించింది. నవ దంపతుల మధ్య ప్రేమానురాగాలను వ్యక్తీకరించిన మరొక కథ పెండ్యాల చిన్న రాఘవరావు రచించిన తిరిగిరాను.
సుజాతారెడ్డి తెలంగాణ తొలితరం కథలు కథాసంపుటం ద్వారా తెలంగాణలో మొదటితరం నుం చే సామాజిక అంశాలు కథావస్తువులు అయ్యాయ నే విషయం తెలుస్తుంది. భాష విషయంలోనూ గ్రాంథికం నుంచి వ్యవహారిక భాష వరకు రచయితలు కథలు మలిచిన విధానం, పాత్రోచిత మాండలికాలను ఉపయోగించడం గమనించవచ్చు. వస్తు వు విషయంలో మాత్రం తెలంగాణ కథ సామాజిక అంశాలకే పెద్దపీట వేసింది. కథ నిర్మాణం శిల్పం విషయంలో కాలక్రమేణా పరిణతి కనిపిస్తుంది. తెలంగాణ తొలితరం కథల సంకలనం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ భాషాశైలికి సం స్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ. ఈ సంకలనం వెలువరించడంలో డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి కృషి అభినందనీయం. తెలంగాణ సాహితీ జగత్తుకు గర్వకారణం.
- ఉప్పల పద్మ, 8340933244

120
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles