కొత్త కలాలు నేర్చుకోవాల్సిన పాఠాలు


Mon,May 13, 2019 12:51 AM

ఈ పుస్తకంలో చాలా విషయాలు కొత్తగా కవిత్వం రాస్తున్న కవులకు పాఠాలు. కవిత్వాన్ని ఎలా రాయాలి, ఎలా రాస్తే బాగుంటుంది అన్న విషయాన్ని ఉదాహరణలతో వివరించారు. అంతేకాకుండా కవిత్వానికి, అకవిత్వానికి గల భేదాన్ని కూడా చూపించారు. ఎన్నో సంపుటాలను అధ్యయనం చేసి కవిత్వంలో గల నిర్మాణ పద్ధతులు, కవిత్వం ఎలా ఉండాలి
అన్నది వ్యాసాల్లో తెలియజేశారు.

diction
కవిత్వం ఎలా రాయాలి? కవిత్వం అసలు ఎలా పుడుతుం ది, కవిత రాయడానికి ప్రత్యేకమైన సిలబస్ ఉందా? ఒకవేళ ఉంటె దానికి పాఠ్యంశం ఏమైనా ఉన్నదా? అన్ని కళలను నేర్చు కున్నట్టే కవిత్వం నేర్చుకొని తద్వారా మంచి కవిత్వం తీసుకువచ్చి ఆ రంగంలో రాణించడానికి ఏమైనా పుస్తకాలు ఉన్నా యా? ఇత్యాది సందేహాలు చాలామందికి ఉన్నాయి. కొత్తగా కవిత్వం రాసేవారికి ఇలాంటి సందేహాలు ఎక్కువగా వస్తుంటా యి. స్పందించి రాసే నాలుగు భావస్ఫోరక మాటలే కవిత్వం అనుకుంటే అలాంటి కవిత్వానికి మెరుగులుదిద్దుకొని ఒక క్రమబద్ధమైన లయ సాధించాలంటే కొంత సాధన అవసరం. అలాంటి కవిత్వ సాధన చేయడానికి ఉపయోగపడే పుస్త కాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి పుస్తకమే ఈ కవిత్వం -డిక్షన్, ఆధునిక వచన కవిత-నిర్మాణ పద్ధతులు. దీన్ని ప్రము ఖ కవి,విమర్శకుడు బిక్కి కృష్ణ రచించిన పుస్తకం ఇది. కవిత్వం లో తొలి అడుగులు వేసేవారికి దిక్సూచి లాంటిది ఈ పుస్తకం.

అనేకమంది పూర్వకవుల కవిత్వాన్ని, రచనా విధానాలను, శైలిని పరిచయం చేశారు. యువకవులకు ఏది కవిత్వం, ఏది అకవిత్వం అనే విషయంలో సోదాహరణంగా వివరించారు. వచన కవిత్వం అంటే.. వరుసగా పేర్చే కట్టే పుల్లలు కాదని, ముక్కలు ముక్కలుగా పేర్చే గొలుసు కొట్టు కానేకాదని వచనా న్ని కవిత్వంగా ఎలా మలచాలో యువకవులకు నిర్దేశం చేశారు. వచన కవితకు పద్య కవితకు గల భేదాన్ని, అలాగే వచన కవితకు గేయ కవితకు గల భేదాల్ని కూలంకుషంగా చర్చించారు. కవితలో వస్తు ఎంపిక, ఆ వస్తువును బలమైన అభివ్యక్తితో ఎలా కవిత్వంగా మలచవచ్చునో వివరించాడు.

పాశ్చాత్త కవుల పుస్తకాల్ని, వారి శైలిని అధ్యనయం చేయ డం ద్వారా కవితా నిర్మాణ రహస్యాలు, ప్రతీకలు, అభివ్యక్తి, అద్భుతమైన భావుకతను తెలుసుకోవచ్చు అని సూచించాడు.
కవిత్వం ఇలాగే ఉండాలని ఎవరు నిర్వచించలేదు. ఎవరికీ నచ్చిన మార్గాన్ని వారు అనుసరిస్తారు. ఈ కోవలో శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రముఖంగా చెప్పవచ్చు. పాత పదబంధాలను, అరిగిపోయిన మెటాఫర్లను కాదని కొత్త డిక్షన్‌ను రాశాడు. ఈ క్రమా న్ని బాగా పట్టుకున్నారు కృష్ణ. కవిత్వం ఆత్మ కళనే కాదు రూప కళ కూడా అంటూ శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలో గల సిమిలి, మెటాఫర్ లను ఎలా వాడుకున్నా రో తెలియజేస్తాడు. కవిత్వంలో వ్యాకర ణం, వ్యాకరణ దోషాలు, ఇతర భాషా పదాలు, కవితలో వాక్యాలు సంక్లిష్టత, మాండలిక భాష వంటి వాటిలో జాగ్రత్త వహిస్తే మంచి కవిత్వం రూపుదిదుకొంటుంది.

బిక్కి కృష్ణ దృష్టిలో కవిత్వం అంటే కాలక్షేపం కాదు, ఒక సీరియస్ ఆక్టివిటీ. కవిత్వాభివ్యక్తికి సంబంధించిన విషయాల్ని సరళంగా వివరిస్తూనే ఎలా కవిత్వంలో పట్టు సాధించవచ్చో ఎన్నో ఉదాహరణలతో చెప్తారు. కవిత్వ సాధనలో ముఖ్యమైన టెక్నిక్కులను అలవోకగా నేర్చుకోవచ్చంటూ కొన్నిటికి అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఈ టెక్నీక్‌లో ముఖ్యమైన సిమిలి, మెటాఫర్, అల్లిగేరి, మెటానమి, పార్లల్లిజం, పెర్సొనోఫికేషన్, అనపోరా, ప్రతీకలు, ఇమాజినరీ, సింబాలిజం వంటి పాశ్యాత్య భావనల్ని లోతుగా చర్చించారు.

కవిత్వంలో శబ్ద చిత్రణ గురించి చెప్తూ అంత్యప్రాసలతో కవితలు రాయడం, పద్యాలలో, వచన కవితలో యతి ప్రాసల అవసరం ఉందా, అసలు రెండు కలిపి రాయొచ్చా అనేక సందేహాలు కొత్తగా రాస్తున్నవాళ్ళకు కలుగొచ్చు. వీటికి చక్కని సమాధానాలు (కవిత్వంలో శబ్ద చిత్రణ అంతరించిందిలో) వివరించారు. కవిత్వం కొత్తగా రాసేవాళ్ళు సాధారణంగా అనుకరణ చేస్తుంటారు. పూర్వ ప్రముఖ కవుల కవిత్వంతో ప్రభావానికి లోను కావొచ్చు. ఆ తర్వాత సాధన చేస్తూ సొంత గొంతుకతో ముందుకు వస్తారు. వచన కవితకు గేయ కవితకి గల భేదాలను సూత్రాలను ఒక క్రమంలో వివరించడం బాగుంది.

కవిత్వం రాయడానికి ఎలాంటి సూత్రాలు, జాగ్రత్తలు పాటించాలి? రూపనిర్మాణం ఎలా ఉండాలి ? వస్తువు, శిల్పం ఎలా ఉండాలో తెలిపారు. కవిత్వం సృష్టించడానికి భాష ప్రధానమైనది.అదే కవిత్వాన్ని పరిపుష్టం చేస్తుంది. కవిత్వం డిక్షన్ లో రూపం-శిల్పం ప్రధాన పాత్ర వహిస్తుంది. వస్తువుని ఎలా వ్యక్తీకరిస్తామో దీన్నే రూపం అంటారు. కవిత్వం అంటే అక్షర హింస కాదు అక్షరతాండవం. ఏది చెప్పినా బలంగా ఉండాలి.
ఇక కవిత్వంలో అభివ్యక్తి వాటిలో నవ్యత కవిత్వంలో ప్రాధాన్యం ఏమిటో కవిత్వంలో అభివ్యక్తి నవ్యతలో వివరించారు. ఆధునిక కవిత్వంలో అభివ్యక్తి నవ్యత కవిత్వంలో కొత్త డిక్షన్‌కి దారితీస్తుంది. కాలాన్ని బట్టి మనుషుల జీవిన విధానా లు మారినట్టే కవిత్వంలో అభివ్యక్తి మారుతుంది. అలా కాకుం డా ప్రముఖ కవులు వాడిన పాత శైలినే అనుకరించడం వల్ల కొత్త కవులు తమదైన అభివ్యక్తి ని స ష్టించలేరని వారి స్టైల్‌లో రాయడం వల్ల అనుకరణ కవిత్వం అవుతుంది తప్ప తమదైన కవిత్వం కాబోదని ఇలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ప్రముఖుల కవిత్వాన్ని అభివ్యక్తి శైలిని గమనిస్తూనే తమ పంధాలో సాగిపోవాలని చెప్పారు. అనుసరిస్తే అనుకరణ అవుతుంది తప్ప సొంత గొంతుక గల కవులు ఎప్పటికీ కాలేరు.

ఈ పుస్తకంలో చాలా విషయాలు కొత్తగా కవిత్వం రాస్తున్న కవులకు పాఠాలు. కవిత్వాన్ని ఎలా రాయాలి, ఎలా రాస్తే బాగుంటుంది అన్న విషయాన్ని ఉదాహరణలతో వివరించా రు. అంతేకాకుండా కవిత్వానికి, అకవిత్వానికి గల భేదాన్ని కూడా చూపించారు. ఎన్నో సంపుటాలను అధ్యయనం చేసి కవిత్వంలో గల నిర్మాణ పద్ధతులు, కవిత్వం ఎలా ఉండాలి అన్నది వ్యాసాల్లో తెలియజేశారు. కొత్తగా కవిత్వం రాస్తున్న వాళ్ళకే కాకుండా ఇప్పటికే కవిత్వం రాస్తూ ప్రముఖులుగా పేరు పొందినవారు కూడా చదవాల్సిన మంచి పుస్తకం.
-పుష్యమీ సాగర్, 9010350317

272
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles