ఆర్థికవేత్త అనుభవసారం


Mon,May 6, 2019 01:10 AM

Naaprayanam
తెలంగాణలోని మూడుతరాల యువకుల జీవితాలను పరిశీలించండి. వారి ఆలోచన, కార్యాచరణ గమనించండి. వారిలో ప్రగాఢమైన సామాజిక నిబద్ధత ఉంటుంది. ప్రపంచ పోకడల ప్రభావం ఉంటుంది. సమాజాన్ని మార్చాలనే ఉద్వేగం ఉంటుంది. వామపక్ష ఉద్యమాలతో మమేకం అవుతారు. క్రమంగా ప్రపంచ పరిణా మాలు, దేశ రాజకీయ- సామాజికార్థిక పరిస్థితుల నేపథ్యంలో తనదైన ఆలోచనా విధానాన్ని ఏర్పరచుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా కరడుగట్టిన కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన యువతరం ఆ తరువాత కాలంలో భారతీయ పరిస్థితు లకు అనుగుణంగా నెహ్రూవియన్ సోషలిజంవైపు మళ్ళడం ఒక సహజ పరిణామంగా కనిపిస్తుంది. అటువంటి ఆదర్శాలు, ఆచరణలతో కూడిన తరానికి చెందినవారు చెన్నమనేని హనుమంతరావు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వామపక్ష విద్యార్థి ఉద్యమకారుడు. ఆ తరువాత 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగ స్వామి. ఆర్థికశాస్త్ర పరిశోధకుడిగా మారి సమ్మిళిత అభివృద్ధిని కోరుకున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ హయాంలలో ప్రణాళికా సంఘం సభ్యునిగా ఉన్నారు. ఏ హోదాలో ఉన్నా, దేశ గమనాన్ని నిర్దేశించిన విధాన నిర్ణయాలలో ఆయన ఆలోచనల ప్రభావం ఉన్నది. చెన్నమనేని తన సుదీర్ఘ జీవితంలోని అభిప్రాయాలను, అనుభవా లను వివరిస్తూ రాసినవ్యాసాల సంపుటి నా ప్రయాణం-మార్క్సిజం లెనినిజం నెహ్రూ వాద సోషలిజం- సమ్మిళిత అభివృద్ధి.

హనుమంతరావు మాత్రమే కాదు, ఆయన తరువాతతరాల వారు కూడా కమ్యూ నిస్టు పోరాటాల పట్ల తమ వైఖరిని మార్చుకోవడానికి సోవియెట్, చైనాలలోని పరి ణామాలు, ఇక్కడి ఉద్యమ తీరు తెన్నులు కారణం. కమ్యూనిజం ఒక ఆదర్శ భావన గా ముందుకు వచ్చినప్పటికీ, ఆచరణలో కేంద్రీకృత వ్యవస్థను నెలకొల్పి ప్రజా స్వామిక హక్కులను హరించాయి. దీంతో చాలామందికి ప్రజాస్వామిక సోష లిస్టు విధానాలే మేలనిపించాయి. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించి ఇరువై సూత్రాల ఆర్థిక పథకాన్ని అమలు చేసిన సందర్భంలో కూడా చెన్నమనేని ఆర్థికాభి వృద్ధి కోసం పౌరహక్కులను పణంగా పెట్టకూడదని భావించారు. ఆ తరువాత ఆర్థిక సంస్కరణలు కూడా పేదల అభివృద్ధితో ముడిపడి ఉండాలన్నారు.

చెన్నమనేని హనుమంతరావు స్వయంగా 1969 ఉద్యమంలో పాల్గొన్నారు. మలి దశ ఉద్యమ సందర్భంలోని రచనలు కూడా ఇందులో ఉన్నారు. తెలంగాణవాదం సెంటిమెంట్ కాదని అంటూ, ఈ డిమాండ్ వెనుకున్న సహేతుకతను వివరించారు. ప్రజలు తమ స్వీయ అనుభవంతో అభివృద్ధిని జలవనరులు, వ్యాపార అవకాశాలు, వృత్తి పురోగతిలో సమాన వాటా, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో తగిన ప్రాధా న్యం రూపంలో చూస్తారు. సమైక్యరాష్ట్రంలో ఇది సాధ్యం కాదని, ప్రత్యేక హోదా (రాష్ట్రం)తో మాత్రమే తమకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారు అని సరళంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర హోదాను కేవలం ప్రాంతీయ సమస్య గా చూడటానికి వీలులేదు.

ఇది ఒక జాతీయ సమస్య. ఎందుకంటే, మన ప్రజాస్వా మ్య వ్యవస్థ పనితీరు మరింత విస్తృతంగా కింది స్థాయికి చొచ్చుకొని వెళ్ళేలా చేస్తూ పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలను సాధికారికులను చేసేందుకు దేశం లో చోటు చేసుకుంటున్న సామాజిక మార్పును ఇది సూచిస్తుంది అంటూ విశ్లేషించా రాయన. ఎస్‌ఆర్‌సీ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇక్కడి ప్రజల ఏకాభిప్రా యం ఉండాలె కానీ, ఇతర ప్రాంతాల ఏకాభిప్రా యం ఏమిటనే ప్రజాస్వామిక ప్రశ్న లేవనెత్తా రు. తెలంగాణ ఏర్పడిన వెంటనే అనుసరించిన అభివృద్ధి వ్యూహంపై కూడా ఆయన మాట్లా డారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధు ల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన సూచనలు గమనించదగినవి. తెలంగాణ ఎక్కువ ఆదాయం గల రాష్ట్రమనేది అను కూలాంశంగా గుర్తిస్తూనే, రాష్ర్టానికి నిజమై న శక్తి డబ్బు కాదు, ప్రజల శక్తి అన్నారు. గొప్ప అవగాహన, ప్రజల మధ్య ఐక్యత, ఉమ్మడి కార్యాచరణ-ఈశక్తి అని నిర్వ చించారు. తెలంగాణ ప్రజలు గుర్తించవల సిన అంశమిది.

బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్‌రావు వంటి యోధులకు కొంచెం తరువాత- 1920- 30 దశకాలలో కరీంనగర్ జిల్లా గౌతమ్ రావు వంటి సాహిత్యవేత్త, ప్రొఫెసర్ రామ్‌రెడ్డి వంటి విద్యావేత్తలతో పాటు సంస్కారవంతులైన రాజకీయ నాయకుల తరాన్ని అందించింది. ఆ తరంలోని దేశం గర్వించదగిన ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు. పరాయిపాలనలో మన చరిత్రను కాపాడుకోలేక పోయాం. వర్తమానంలో కూడా మనలను మనం విస్మరించు కునే దుస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో చెన్నమనేని వంటి మేధావుల అనుభవాలు ఎంతో విలువైనవి.
-పీవీజీఎస్

159
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles