శతవసంతాల నల్లగొండ


Mon,April 8, 2019 12:00 AM

మహాకవి పోతన, గౌరన, పిల్లలమర్రి పినవీరభద్రు డు, రాచకొండ సర్వజ్ఞసింగ భూపాలుడు లాంటి ఉద్ధండులకు జన్మనిచ్చిన జిల్లా ఇది. మొదటి కథ రాసిన బం డారు అచ్చమాంబ, మొదటి నవల రాసిన వట్టికోట అళ్వారుస్వామి, తొలి దళితకవి దున్న ఇద్దాసు, బండెనుక బండి కట్టి పాట కట్టిన బండి యాదగిరి, పసులగాసే పిల్లగాడ పాటరాసిన సుద్దాల హనుమంతు ఈ జిల్లా వారే. తొలితరం, మలితరం, ఇప్పటితరం మూడు తరాల కవులు జిల్లా సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు, చేస్తున్నారు.

పోరాటాల గడ్డ నల్లగొండ జిల్లా సాహిత్యం లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. నాటి సంప్రదాయ పద్యకవుల నుంచి నేటి ఆధునిక కవిత్వం వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకున్న జిల్లా నల్లగొండ. సంప్రదాయ పద్యకవిత్వం భావ కవిత్వం, ప్రబంధకవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం ఇలా అన్ని ప్రక్రియల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముందున్నది. రాజాశ్రయం నుంచి పోరాటాల దశకు చేరిన నల్లగొండ కవిత్వం ఎన్నోమలుపులు తిరిగింది. మహాకవి పోతన, గౌరన, పిల్లలమర్రి పినవీరభద్రు డు, రాచకొండ సర్వజ్ఞసింగ భూపాలుడు లాంటి ఉద్ధండులకు జన్మనిచ్చిన జిల్లా ఇది. మొదటి కథ రాసిన బం డారు అచ్చమాంబ, మొదటి నవల రాసిన వట్టికోట అళ్వారుస్వామి, తొలి దళితకవి దున్న ఇద్దాసు, బండెనుక బండి కట్టి పాట కట్టిన బండి యాదగిరి, పసులగాసే పిల్లగాడ పాటరాసిన సుద్దాల హనుమంతు ఈ జిల్లా వారే. తొలితరం, మలితరం, ఇప్పటితరం మూడు తరాల కవులు జిల్లా సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశా రు, చేస్తున్నారు. నాటి మరింగంటి కవులనుండి నేటి వరకు కవిత్వంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నా యి. 1994లో శ్రీరంగాచార్య వెలువరించిన నల్లగొండ కవుల సంచిక ప్రకారం దాదాపు 400 మంది కవులు న్నారు. ఇప్పుడా సంఖ్య ద్విగుణీకృతం కావచ్చు. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచిక1934లో వచ్చింది. అందులో నల్లగొండ కవులు ఎంతో మంది వున్నారు. 1921లో నల్లగొండ నుండి షబ్నవీసు నర్సింహరావునీలగిరిపత్రిక స్థాపించారు. 1926లో గోల్కొం డ పత్రిక వచ్చింది. వీటి ద్వారా ఎంతోమంది యువ కవులు వెలుగులోకి వచ్చారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి మత్తడి, ముంగిలి పుస్తకాలు తెలంగాణ కవులను, అందులో నల్లగొండ కవులను మనముందుంచాయి.

1945లో నల్లగొండలో నైజమాంద్రసారస్వత పరిషత్తు ఏర్పడింది. 1946లో ఉషస్సు అనే కవితా సంకలనం నల్లగొండ కవుల ద్వారా వచ్చింది. ఇందులో ధవళాశ్రీనివాసరావు, ధరణికోట శ్రీనివాసులు, పైడిమర్రి సుబ్బారావు, కాంచనపల్లి చినవెంకటరామారావు, ధరణికోట శ్రీనివాసులు, మూటువూరు వెంకటేశ్వర రా వు, బూర్గుల రంగనాథరావు కవితలున్నాయి. వీరు పద్యంతో పాటు వచన కవిత్వం రాశారు. ఈ పుస్తకానికి దేవులపల్లి రామానుజరావు ముందుమాట రాశారు. అదేసమయంలో ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన అంబడిపూడి వెంకటరత్నం చండూరుప్రాంతంలో సాహితీ మేఖల సంస్థను ఏర్పాటు చేసి సాహిత్యసేవ చేశారు. వీరి శిష్యులు సిరిప్రగడ భార్గవరావు, ధవళా శ్రీనివాసరావు, మద్దోజు సత్యనారాయణ, పులిజాల హనుమంతరావు, తాటి శెట్టి నర్సింహ గుప్త, పాశం నారాయణరె డ్డి కవిత్వం రాశారు. భార్గవరావు మరణం తర్వాత అం బడిపూడి భార్గవానంద లహరి పుస్తకం తీసుకొచ్చారు. దాశరథి అగ్నిధార పుస్తకం ఆవిష్కరణ సాహితీ మేఖ ల చండూరులో జరిగింది. నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధపోరాటం మొద లు మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నల్లగొండ జిల్లా ఉద్యమ సాహిత్యానికి, ప్రజా చైతన్యా నికీ ప్రతీకగా నిలిచింది. తెలంగాణ సాయుధ పోరాట పిలుపు, మలిదశ తెలంగాణ పోరాటం ప్రారంభం కావ టం కూడా నల్లగొండ జిల్లా భువనగిరి నుంచే కావటం గమనార్హం. శ్రీశ్రీ మహాప్రస్థానం వచన కవితలో పెనుమార్పులు తీసుకవచ్చింది. చందోబద్ధ పద్యరచననుంచి ఎంతో మంది యువకులు అభ్యుదయ కవి త్వం వైపు వచ్చారు. అభ్యుదయ కవిత్వం, దిగంబరకవిత్వం, విప్లవ కవిత్వం, దళిత, స్త్రీ, మైనార్టీ, బహుజన వాద క విత్వం జిల్లా సాహిత్యంలో పెను మార్పులు తీసుక వచ్చింది.

కొంత స్థబ్దత తర్వాత 1965 ప్రాంతంలో స్వాతంత్య్ర సమరయోధుడు, అభ్యుదయ రచయిత కాంచనపల్లి చినవెంకటరామారావు సారథ్యంలో నల్లగొండలో యువరచయితల సమితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో భువనగిరిలో సాహితీ మిత్రమండలి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, సూర్యాపేటలో సాహితీ సంస్థలు ఏర్పడి ఎంతోమంది యువ కవులకు స్ఫూర్తినిచ్చాయి. 1970లో సంఘర్షణ కవితా సంకలనం యువరచయితల సమితి నుంచి వచ్చింది. దర్పణం సాహితీ త్రైమాసిక పత్రిక కాంచనపల్లి సంపాదకత్వంలో వచ్చిం ది. అదేసమయంలో కె. శివారెడ్డి వేకువ, వరవరరావు సృజన రా.రా. సంవేదన సాహితి పత్రికలు యువకవులకు స్ఫూర్తినిచ్చాయి.దిగంబర కవులలో నిఖిలేశ్వర్, చెరబండరాజు నల్లగొండ జిల్లా వారు కావడం విశేషం. 1970లో విశాఖపట్టణంలో జరిగిన విప్లవ కవుల సభలకు జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం ఉన్నది. తెలంగా ణ సాయుధ పోరాటం మొదలు, నిన్నమొన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా ఎంతో మంది కవులకు ఉద్య మాల్లోంచి ఎదిగి వచ్చారు. ఆ తర్వాత సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నీలగిరి సాహితీ సంస్థ వచ్చింది. దళితవాదం, మైనా ర్టీ, స్త్రీ వాద, బహుజనవాద కవిత్వం ద్వారా ఎంతో మం ది యువకులు తమదైన శైలిలో కవిత్వంరాశారు. జయ మిత్ర సాహిత్య సంస్థ ద్వారా వేణుసంకోజు, నోముల సత్యనారాయణ ఎంతో మంది కవులకు మార్గదర్శకు లుగా నిలిచారు.

ప్రస్తుతం నల్లగొండ జిల్లా నుంచి యన్.గోపి, కూరెళ్ల విఠలాచారి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వేణుసంకోజు, తిరునగరి, బైరెడ్డి కృష్ణారెడ్డి, కృష్ణకౌండిన్య, సరికొండ నర్సింహ్మరాజు, బెల్లి యాదయ్య, గింజల నర్సింహరెడ్డి, స్కైబాబ, ఏనుగు నరసింహారెడ్డి, మునాస వెంకట్, అంబటి వెంకన్న, వేముల యల్లయ్య, భూతం ముత్యా లు, రఘు, తిరునగరి, కట్టా భగవంతరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, పగడాల నాగేందర్, పెద్దిరెడ్డి గణేష్, దొడ్డి రామ్మూర్తి, కందుకూరి దుర్గాప్రసాద్, దేవరాజు మహారాజు, ఏనుగు లింగారెడ్డి, బోదనం నర్సిరెడ్డి, తిరునగరి శ్రీనివాస్, దున్న యాదగిరి, జూలూరు గౌరీశంకర్, చింతల యాదగిరి ముందు వరుసలో వుంటారు. పద్యకవిత్వంలో మరింగంటి వారి నుంచి నేటి వరకు ఎంతో మంది కవులు చక్కటి పద్యరచన చేసి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తెచ్చారు.కొంత మంది శతక కవులు గూడ వున్నారు. నానీల సృష్టికర్త యన్. గోపి నల్లగొండ జిల్లా వారు. వారి స్ఫూర్తితో జిల్లా నుంచి ఎన్నో నానీ ల సంపుటాలు వచ్చాయి. యన్.గోపి (నానీలు), రఘు (జీవనలిపి), మేరెడ్డి యాదగిరిరెడ్డి (రైతునానీలు), పోరెడ్డి రంగయ్య (బడినానీలు), పున్న అంజయ్య (నల్లగొండ నానీలు) పలస వెంకటేశ్వర్లు (రేలపూలు), పొనుగోటి నర్సింరావు (అక్షరాలు), సూర్య ధనుంజయ (బంజారా నానీలు).. ఇలా ఎంతో మంది చక్కటి నానీలు రాశారు. సాహితీ మేఖల పున్న అంజయ్య, అక్షర భారతి కూరెళ్ల విఠలాచారి ఎంతో మంది యువ కవులుకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. వందేండ్ల నల్లగొం డ జిల్లా కవిత్వం తెలంగాణ సాహిత్య చరిత్రలో అగ్రభాగాన నిలుస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు.
- మేరెడ్డి యాదగిరిరెడ్డి
99494 15796

172
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles