‘కొత్త నీరొచ్చింది’ కథలు


Mon,April 1, 2019 01:03 AM

పాత్రలు ఎటు నుంచి ఎటు ఆలోచిస్తూ వెళ్లినా కూడా, వాటిని తిరిగి ప్రారంభమైన చోటుకే రప్పించి మెప్పించడం పాఠకుడిని కాటగలసి పోకుండా చూడటం నవీన్ గారి ప్రత్యేకత. అందులోనూ సమకాలీన అంశాలను ఇతివృత్తా లుగా చేసుకొని కథా సృజన చేయటం ఓ సామాజిక బాధ్య తగా భావించాలి. ఇదే రీతిన అన్నిరకాల సామాజికాంశా లను ప్రయత్న పూర్వకంగా ఎంచుకొని సాహితీ సృజన చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని సాహితీ కారులందరూ బాధ్యతగా తీసుకోవాలి.
Kotha-Neerochindi
వర్తమాన జీవితాంశాల సాహిత్యీకరణ కష్టమైన పని. మానవ మనస్తత్వ చిత్రణ ఇంకా కష్టం. ఈ రెండింటిని మేళవించి రాయడం ఎంతో క్లిష్టమైన పని. అలాంటి కష్టమైన పనిని సునాయాసంగా చేయగలిగిన అతికొద్ది మంది తెలుగు రచయితల్లో అంపశయ్య నవీన్ అగ్రగణ్యులు. సామాజిక సమస్యలైనా లేక వైయక్తిక విషయాన్నైనా ఆయన ఇదే ఒరవడిలో చిత్రించగలరు. కొత్తనీరొచ్చింది పేరిట ఆయన ఇటీవల వెలువరించిన కథా సంకలనం మన కు ఈ విషయాన్నే చెబుతుంది. పదిహేను కథలున్న ఈ కథాసంకలనంలో నవీన్ గారి ముద్ర కనిపిస్తుంది. ఒక రచన ఎలా వుంది? అది ఎందుకు అలానే వుంటుందన్న విషయం ఆయా రచయితల ప్రాపంచిక దృక్పథం మీద ఆధారపడివుంటుంది. అలా చూసినప్పుడు నవీన్ గారి కార్యక్షేత్రం మధ్యతరగతి. ఆ వర్గపు జీవుల ఆశలనూ, ఆకాంక్షలనూ.., వారి అవకాశవాదాన్ని, స్వార్థపూరిత చర్యలను ఎండగడుతూనే, ఆ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వారి పక్షాన నిలబడి అంతే ఆర్తితో చిత్రించగలగడం ఆయన ప్రత్యేకత. ఇతివృత్తం ఏదైనా, పాత్రలు ఏవైనా వాటిలోకి పరకాయ ప్రవేశం చేసి వాటిని సహజంగా తీర్చిదిద్దడంలో ఆయనది అందెవేసిన చేయి. అది పెద్దనోట్ల రద్దులాంటి పెద్దవిషయమైనా, ఎదుటివ్యక్తి తనను అపార్థం చేసుకుంటాడేమోనని అనుమానపడి అనవసరంగా ఆందోళన చెందే సగటు మనిషి అంతరంగ చిత్రణనైనా అంతే అలవోకగా రాయగలరు. ఎమర్జెన్సీ తరువాత ప్రజలను ఎక్కువ అవస్థలపాలు చేసిన సమస్య పెద్దనోట్ల రద్దు మాత్రమే. సమాజాన్ని ఇంతగా అతలాకుతలం చేసిన సమస్యపై, దాని దుష్ఫలితాలపై తెలుగు సాహిత్యకారులు స్పందించాల్సినంతగా స్పం దించలేదేమోననిపిస్తుంది. ఏవో కొద్దిపాటి కవితలు, మెట్టు మురళీధర్‌రావు రాసిన ఆ యాభై రోజులు నవల మాత్ర మే ఈ అంశాన్ని ప్రస్తావించాయి.

ఇక కథల విషయానికి వస్తే సమస్యను తేలికచేసి చెప్పే ప్రయత్నంలో భాగంగా హాస్యం/వ్యంగ్యం పేరిట ఒకటి రెండు కథలు మాత్రమే వచ్చాయి తప్ప సీరియస్‌గా చర్చించిన కథలు చాలా తక్కు వ. ఆ కోవలో నవీన్ రాసిన కొత్తనీరొచ్చింది కథ చర్చించ దగినది. సమస్యలేనిచోట ఒక కొత్త సమస్యను సృష్టించి దానిని పరిష్కరించుకోవడానికే తమ శక్తియుక్తులన్నీ ధారపోయడం విజ్ఞుల క్షణం కాదంటారు. మన కేంద్రపాలకులు పెద్దనోట్లను రద్దుచేసి అలాంటి పనినే చేశారు. కొత్తనీరు వచ్చిందంటే పాతనీరు పక్కకు పోతుందన్నది సామెత! కానీ ఇక్కడ ఈ కథలో కొత్త (నోటు) నీరొచ్చినా.. పాత కష్టాలు తొలగిపోవు. పైగా కొత్త కష్టాలు పుట్టుకువస్తాయి. పుట్టిన ఆ కొత్తకష్టాల వల్ల తమ పుట్టి ఎక్కడ మునుగుతుందోనని పాలకులు నానా తంటాలు పడుతుంటారే తప్ప, వాటి మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థల పరిష్కారానికి కనీస ప్రయత్నం కూడా చేయరు. నల్గొండ నుండి సూర్యాపేటకు బస్సులో వెళ్తున్న కథానాయకుడితో పెద్దనోట్ల రద్దు లాభనష్టాలు చర్చిస్తుంటాడు పక్కన కూర్చున్న మరో ప్రయాణీకుడు. కథ ఉత్తమ పురుషలో నడుస్తూంటుంది. ఈలోగా బస్సు తరువాత స్టేజీలో ఆగుతుంది. అక్కడ కొందరు ప్రయాణీకులు బస్సెక్కుతా రు. అందులో ఒక మహిళ రెండువేల నోటిచ్చి టికెట్ ఇమ్మంటుంది. కండక్టర్ ఆ నోటు తీసుకోడు. టికెట్ ఇవ్వ డు. తన దగ్గర అంత నోటుకు చిల్లర లేదు, చిల్లర ఇచ్చి టికె ట్ తీసుకోమంటాడు. తన కొడుకు అనారోగ్యానికి గురైతే అతన్ని ఆస్పత్రిలో చూపించడానికి తాను వెళ్తున్నానని, తన గోడు వెళ్లబోసుకుంటుంది. కండక్టర్ అవేమీ వినిపించుకోకుండా ఇస్తే చిల్లరివ్వు లేకుంటే దిగి వేరే బస్సెక్కు అంటాడు. చిల్లర లేదంటే నేనేం చెయ్యాలె అని ప్రశ్నిస్తుందామె.

దానికి అతడు ఆగ్రహంతో వెళ్లి గంగలో కలువు అంటా డు.బస్సును అర్థంతరంగా ఆపి ఆమెను బలవంతంగా ఒక నిర్జన ప్రదేశంలో (దింపి) వదిలేసి వెళ్లిపోతారు. అచ్చం మన కేంద్రపాలకులు ఈ దేశ ప్రజలను వాళ్ల మానాన వాళ్ల ను వదిలేసినట్లుగా! నోట్ల రద్దువల్ల సామాన్యులకు ఎలాం టి ఇబ్బందులు ఉండవని అన్న ప్రధాని మాటలు ఎంతవరకు నిజం అన్నట్టు పక్కన కూర్చున్న ప్రయాణీకుడు నాకేసి చూశాడు.. అనడంతో కథ ముగుస్తుంది. బహుశా దేశప్రజలందరూ పాలకులవేపు అట్లానే చూసిన తన అనుభవంలోని విషయాన్ని పాఠకుడు కూడా అప్రయత్నంగానే గుర్తు కు తెచ్చుకుంటాడు. ఒక్క రెండువేల నోటును తీసుకొని నోట్ల రద్దు చర్య వెనుక ఉన్న పాలకుల ఆలోచనాలేమిని, ప్రజాసంక్షేమం పట్ల వారి బాధ్యతారాహిత్యాన్ని సామాన్యులు అనుభవించిన కష్టాలను, పాలకులు ఇచ్చిన హామీలపై కొన్ని వర్గాల ప్రజలు పెట్టుకున్న భ్రమలను ఈ కథ ద్వారా నవీన్‌గారు పటాపంచలు చేశారు. మధ్యతరగతి జీవుల మనస్తత్వం చాలా చిత్రమైనది. వీళ్లకు తమ పైనున్న వర్గంతో కలవాలనే ఉబలాటం - కింది తరగతిని తమతో కలవనీయని అహం ఉంటుంది. అందుకే సాహితీవిమర్శకులు మధ్యతరగతిని మిథ్యతరగతి అని సంబోధిస్తారు. ఆ దృష్టితో చూసినప్పు డు ఈ సంకలనంలోని చాలా కథలు పైవిషయాన్ని బలపరిచేవే. పాత్రలు ఎటు నుంచి ఎటు ఆలోచిస్తూ వెళ్లినా కూడా, వాటిని తిరిగి ప్రారంభమైన చోటుకే రప్పించి మెప్పించడం పాఠకుడిని కాటగలసి పోకుండా చూడటం నవీన్ గారి ప్రత్యేకత.

అందులోనూ సమకాలీన అంశాలను ఇతివృత్తా లుగా చేసుకొని కథా సృజన చేయటం ఓ సామాజిక బాధ్య తగా భావించాలి. ఇదే రీతిన అన్ని రకాల సామాజికాంశా లను ప్రయత్న పూర్వకంగా ఎంచుకొని సాహితీ సృజన చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని సాహితీ కారులందరూ బాధ్యతగా తీసుకోవాలి. నవీన్ గారి కథనంలో ఎక్కడా కాఠిన్యత ఉండదు. కథలను ఏ ఇబ్బందీ లేకుండా చదువుకునేంత సరళంగా రాయడం ఆయన పద్ధతి. బహుశా ఆ శైలియే ఆయనను అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతూవస్తున్నది. దానికి దృష్టాంతమే ఈ కొత్తనీరొచ్చింది కథా సంకలనంలోని కథలు!
- గుండెబోయిన శ్రీనివాస్, 99851 94697

253
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles