సినారె కవిత్వంలో వృత్తి చిత్రణ


Mon,March 25, 2019 01:39 AM

విశ్వంభరుడిగా కవిత్వంలో తన విశ్వరూపాన్ని చూపిన సినారె గజల్‌లు పాడినా, సినిమాల్లో గీతాలు రాసినా సరళమైన పల్లె పదాలతో అద్భుతమైన పాటలను రాసి పల్లె జీవన సౌందర్యానికి పట్టాభిషేకం చేశారు.
c-n-r
ఏపల్లెలో పుట్టి పట్నం నుంచి విశ్వం వరకు ఎదిగిన తెలంగాణ మట్టి పరిమళం, విశ్వంభరుడు సి.నారాయణరెడ్డి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం అతని మంచితనానికి నిదర్శనమై నిలిచింది. పుట్టిన నేల మట్టి వాసనలను మరిచిపోలేని మహోన్నత వ్యక్తిత్వం అతనిది. అందుకే హన్మాజీపేట అతనికి పూతోటగా మారిం ది. ఆ ఊరి చుట్టూ నక్కవాగు, మూలవాగు ప్రవహిస్తుంది. ఆ రెంటి కలయిక ఐకమత్యానికి గుర్తుగా చెప్తుండేవారు సినా రె. పచ్చని పొలాలు, మక్కచెట్లు, చింతచెట్లు, తుమ్మచెట్లు వీటి నీడలో ఆడుకున్న చెదిరిపోని జ్ఞాపకాలను చివరివరకు పదిలపర్చుకున్నాడు. ఊరంటే సబ్బండ కులాల కలయిక. వృత్తికులాలు, కులాలను అడుక్కునే ఉపకులాలు (ఆశ్రితకులాలు) వారి కళా ప్రదర్శనలు, ఎండాకాలంలో సాయంత్రాలు వినోదభరితమై ఎంతో హృదయాహ్లాదాన్ని కలిగిస్తాయి. హరికథా కాలక్షేపా లు, వివిధ ఆశ్రిత కులాల కళాప్రదర్శనలు గానవంతమై అవి ఎంతో మనస్సును గిలిగింతలు పెట్టగా, సినారె ఆ గాన మాధుర్యాలను అందుకొని గేయ సాహిత్యానికి పెన్నిధియై నిలి చారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలు అడుగంటిపోతున్నవి. పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, ఆచారాలు, సంప్రదాయాలను రక్షించుకోవాలి. శ్రమలో నుంచే సాహిత్యం సృష్టించబడుతుంది. ఈ నేపథ్యంలోంచే డాక్టర్ సినారె గ్రామంలోని సమస్త కుల జీవితాలను తన కవిత్వంలో చిత్రించారు. సామా జికంగా వస్తున్న మార్పులు, ఆధునిక జీవనంతో వస్తున్న మార్పులతో, అభివృద్ధితో గ్రామజీవనం ధ్వంసం కావటంతో పాటు, వారి సాంస్కృతిక జీవనం కూడా ధ్వంసమవుతున్న తీరు పాట్ల సినారె చాలా తీవ్రంగా కలత చెందారు. ఆ క్రమం లోనే సమస్త గ్రామజీవన వృత్తి జీవితాలను కవితా వస్తువులు గా స్వీకరించి కవిత్వాన్ని రాశారు. ఆ క్రమంలో ఏ వృత్తి జీవి తాన్ని వదులలేదు. చిన్నచూపు చూడలేదు. ప్రతి జీవితంలోని సౌందర్యాన్నీ, సారాన్నీ తన కవితల్లోకి వంపి తెలుగు సాహి త్యాన్ని సారవంతం చేశారు.

ఒక దేహం మట్టిలోకి / ఒక జీవం మట్టిపైకి / ఇదీ క్రమం ప్రకృతికి.. ఈ జీవిత సత్యాలను తెలుసుకోవాలి. ఎదుటివారిని గౌరవించాలి.
రైతేరా లోకానికి ఆధారం / ఆ చేతిదే మనం తినే ఆహారం
రైతులేనిదే ఏ రాజ్యం లేదు / అన్నదాతలేనిదే సౌభాగ్యం లేదు. అంటూ రైతు ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు సినారె.
సినారె సిరిసిల్ల ప్రాంతవాసి. అక్కడ పద్మశాలీలు ఎక్కువ గా ఉంటారు. వారి వృత్తి బట్టలు నేయడం. సంప్రదాయికంగా సాంచెలపై పాతకాలపు బట్టలనే వారు నేస్తున్నారు. వారి జీవ నస్థితిని చెబుతూ..
కాల్జెతుల సల్లగుంటె/కదరూ మొగ్గం వుంటే
బతక వచ్చు బిడ్డా అని/బతిమాలిన యినకపాయె
ఏమీ కొడుకు ఏమి కొడుకు/ఇగురుమున్న చేతివొడుపు
వాని నేత ముందు గిర్ని /బట్టలైన దిగదుడుపు..
ఆత్మీయంగా తల్లి ఆవేదన దుఃఖాన్ని సహజసిద్ధంగా చిత్రించారు. పల్లెలో రైతులు నాగలి దున్నుతుంటే, ఆ వెనుకే విత్తనాలు చల్లుతూ వచ్చే సతీమణి. ఈ రైతు దంపతుల దృశ్యాన్ని కమణీయంగా వరా సుందరి గేయం లో చిత్రించారు.
ముందుగ కోడెరైతు/హలమునె నడిపించగ:
వెన్క వెన్క నిందిందిరవేణివాని రమణీమణి/విత్తుల జార్చునట్టి ఆ సుందర దృశ్యసంపదకు/జాడగ పల్లెల నుండగావలెన్/ఎందుకు పట్టణాల నివసించెడు/కృత్రిమమైన కామనల్.. పల్లెటూరి కాపు స్త్రీలను కన్నులకు కట్టినట్లుగా చూపించారు
దుత్తల నెత్తి నెత్తుకొని/దూరపు చేలకు గాలితోడ పర్వెత్తు డు కాపు భామలకు/ వేగముగా పయనించు మేఘ సంపత్తికి నెంత సామ్య/మిసుమంత విభేద మదేది యుండినన్/మొత్తముపై పయోచర/సమున్నిషితాంగులుగాదె యిర్వురున్..
కాపు స్త్రీలు పొలాలలో పనులకు వేగంగా వెళ్లే దృశ్యాన్ని మేఘాలతో పయనంగా చిత్రించడం కవి ఊహా శక్తి అనంతమైనది.
చేపలు పట్టే జీవిక ఉన్న జాలర్ల (మత్స్యకారుల) కథ. శ్రామికులున్న చోట పాలకులుంటారు. కష్టజీవుల చెమట చెట్ల ను కాసులుగా మార్చుకునే దోపిడీదారులుంటారు. సముద్రం లో చేపలు పట్టే జాలర్లను పీడిస్తున్న పెత్తందార్ల ఒత్తిళ్లకు భరించలేక ఆ శ్రమజీవులు పాడుకునే పాట..
బతుకు బతకనివ్వరురా ఉన్నోళ్లు/పడవసాగనివ్వరురా పెద్దోళ్లు.. పెద్దోళ్లు పెద్ద పెద్దోళ్ళు
ఎముకలే కొయ్యలుగా/నరాలే తాళ్లుగా
కట్టుకున్న పడవలనె/తగలబెట్టి నారురా..
సముద్రంలో ఫలానా పరిధి వరకు ఆ పడవలు నడుపడానికి వీల్లేదని ఆ దుష్టవంతుల దుశ్శానం. భూమి ఎలాగూ వాళ్ల సొమ్మే. నీటిమీద కూడా వాళ్ల యాజమాన్యమేనా అం టూ? ప్రశ్నిస్తున్నారు. అహింసకు సమర్థిస్తూ తను మూసపోసిన సంప్రదాయిక వాదిని కాదని చాటిచెప్పాడు.
శ్రమీజీవి చమదు బిందువులో/ఆణిముత్యమూ ఉంది అగ్నిగోళము ఉంది..
కాలం మారుతుందని, ఈనాడు తిరగబడే కాలమంటున్నాడు సినారె.
పల్లెటూళ్లో చాకలి వాళ్లుంటారు. వీరి భార్యభర్తల తీరును జానపద బాణీలు చెప్పాడు.
గురికుదిరెనా ఎంత/మురికి బొంతల నైన
మల్లెపువ్వుల వతుగ/ తెల్లంగ ఉతుకుతాడు
పీటేసి కూసుంటే/పెద్ద బుంగెడు కల్లు
దమ్ముతిప్పక తాగి/తైతక్కలాడుతడు
రాతిరేమో బండ/బూతులను యిప్పుతడు
పొద్దుపొడువంగనె/సుద్దులను జెప్పుతడు
కడుపులో ఒక బింకి/కల్లు ఉరికిందంటె
దేవునసువంటాడు/దయ్యమైతూలుతడు..
ఇది సహజ సిద్ధంగా చెప్పినది మరొకరు కనిపించరు. పేద రైతు స్థితి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అతని సహజ కవితా ధారకు నిదర్శనం.

పాపిస్టి వరదలకు ! పాకకొట్టుకపొయె/నిలువనీడలేని ! అలపిరీ బతుకాయె
కన్నీళ్ళు తాగైన ! కడుపు నింపుదమంటే/సడలిపోయిన కంట ! తడిగూడు కరువాయె
అప్పో పప్పో చేసి ! ముప్పుతిప్పలు పడీ,/ఎట్లనో మన యెవుస! మీడ్చు కొస్తామంటె
కొత్త పంటమ్మితే సెల్లెలా ! సౌకారు/మిత్తికే సరిపోదు సెల్లెలా ! ఈ విధంగా పల్లెటూరి వృత్తి రైతుల కన్నీటిని కన్నులకు కట్టినారు.
మానవత్వం మంచితనం నిండిన ఆయన కుల, మత భేదాలను వ్యతిరేకించారు. పల్లెలను ఆత్మీయంగా కండ్లకు హత్తుకున్నారు. అంతరిస్తున్న వృత్తుల పట్ల ఆవేదన పడ్డారు. దిగంతాలకు ఎదిగినా పల్లె అతనికి పట్టుగొమ్మ అతడి హృద యం అక్కడే ఉంది. పల్లెలు వల్లకాడు కావడాన్ని చూసి బాధపడ్డారు.
చేలకు చేలు, పొలాలకు పొలాలు/బహుళజాసి సంస్థల భారీ అరచేతుల్లో
ఉక్కు కట్టడాల కంకాళాలై శివతాండవం/చేస్తుంటే ఏం చేస్తాం మనం ? ఈ ఘోరాన్ని ఆపలేమా..? అనే ఆవేదన అతనిలో కన్పిస్తుంది.

ప్రకృతి విధ్వంసం జరుగుతున్నది. వృత్తికులాలల్లో వృత్తు లు అంతరించిపోతున్నవి. వారు బతుకలేక వలసలు పోతున్నారు. ఈ దుస్థితిని చూసిన సినారె తనదైన స్పందన, ఆవే దనతో కవితలు అల్లారు. విశ్వంభరుడిగా కవిత్వంలో తన విశ్వరూపాన్ని చూపిన సినారె గజల్‌లు పాడినా, సినిమాల్లో గీతాలు రాసినా సరళమైన పల్లె పదాలతో అద్భుతమైన పాట లను రాసి పల్లె జీవన సౌందర్యానికి పట్టాభిషేకం చేశారు. సినారెలో ఉండే బాధ, పల్లెలు బతుకాలనే ఆశ. నాగరికతకు మూలవాసి అయిన పల్లెవాడు అన్యాయానికి గురవుతున్నా డనే ఆందోళనతోనే ఆయన వెళ్లిపోయాడు. ఆ సౌందర్యా త్మక మైన, సారవంతమైన పల్లెజీవన సంస్కృతులను బతికించు కోవాల్సిన బాధ్యత మనందరిది.
- డాక్టర్ సందినేని రవీందర్, 9491078515

236
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles