Oxygenated కవిత్వం


Mon,February 25, 2019 01:14 AM

Poets come art from somewhere across the sea, But from the midst of their own people they are lights Emanating from their people and are the most advanced heralds of its power
- Nikolai Gogol
రవీందర్ కవిత్వం మొత్తంలో ఒక Central Debate ఉంది. ఒక గొప్ప Political Action దిశని దాచుకున్న Manifesto ఉంది. కొత్త తరాలకు జీవించగలిగే గెలుపునీ పోరాడే బలాన్ని ఇవ్వగలిగే Energy ఉంది. Power ఉంది. వర్తమాన రాజకీయ హింసోన్మాద వికటత్వానికి, వికృతానికి నిప్పంటించ గల, జీవ ప్రస్తారాన్ని ఇవ్వగల సత్తా వుందనిపిస్తోంది.

onttari
కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. వెలివాడల్ని అనే కవిధాలుగా అనేక సామాజిక పార్శ్వాలతో పెంచి పోషిస్తున్న అగ్రవర్ణ/ అగ్రకుల వ్యవస్థ తాలూకు Mass Graves బయటపడుతున్నాయి. పుటమెక్కుతున్న నల్ల కలువల నడుమ నేల నీలంగా చందమామ కూడా కోపంగా కండ్లు నెత్తురును చేదుకుంటున్న సందర్భం. అక్షరాలు మరింత అప్రమత్తం అవుతున్నకాలం. ఈ దేశంలో ప్రతీ పౌరునికి.. దేశభక్తికి.. కూడా లైసెన్సులు జారీ చేస్తున్న అమానవీయమైన రాజకీయ సందర్భంలో వున్నాం. ఇటువంటి కాలంలో పసునూరి రవీందర్ తన కవిత్వ సంపుటి ద్వారా ఒంటరి యుద్ధభూమిని ప్రకటిస్తున్నాడు. ఈ కవిత్వం ఇప్పటి మన వర్తమాన సామాజిక, రాజకీయ, వ్యక్తిగత స్థితికి వొక హెచ్చరికగా నాకు వినిపిస్తు న్నది.ఆ Alarm Louderగానే శబ్దిస్తూ వేస్తున్న కవిత్వం ఇది.
రాబోయే కాలంలో సంభవించబోయే పెను తుఫానులు సామాజిక సునామీలను సూచిస్తూ వస్తున్న కవిత్వం ఇది. ఉపేక్షకు గురవుతున్న అణగారిన ప్రజలు రాజకీయంగా తమను తాము ఆయుధ పరుచుకోవడానికి తన కవిత్వాన్ని కవి రక్షణ కవచంగా ప్రకటిస్తుంటాడు. పసునూరి రవీందర్ కవిత్వంతో మనకు రక్షణకవచంగా నిలబడటానికి వస్తున్నాడు ఈ కవిత్వంలో. అణిచివేయబడుతున్న శ్రేణుల గుండె మండితే పట్టపగలే చీకటి అలుముకుంటుంది. జెర పైలం, జెర జాగ్రత్త, జెర భద్రం అని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాడు.

స్ట్రక్చర్‌ను నిరాకరిస్తుంది ఈ కవిత్వం. ఆగ్రహానికి మంటపుట్టి మసిగా రాలి తిరిగి మంటగా రూపుదిద్దుకోవాల్సిందే. తప్పదు. మొహమాటం లేని ఆవేదన, ఆక్రోశం, ఉద్వేగం లాంటి మానవీయ పొరలే ఈ కవిత్వానికి రూపము, సారము కూడా. ఇందులోని కవితలు మన గాయాలకు లేపనాలు పూసి మన ఆత్మను నిద్ర మేల్కొలుపుతాయి. గాయాలు ఇప్పటికీ స్మృతిలో ఉంటాయిగాని విస్తృతం కావు. కానీ, ఈ కవి మన గాయాలకు స్వస్థత పరుస్తుంటాడు తన తెగింపు ప్రకటనలతో. యుద్ధం అనివార్యం అయినపుడు నా మీదైనా సరే నేను కలబడతానిచ్చెన మెట్ల లోకం ముందు దోషిగా నిలబెడటం నాకైతేసిగ్గు చేటు ! అంటూ ఈ లోకంలో ఎవరి బుక్క వారికి దక్కే వరకూ జాంబవంతుడి డీఎన్‌ఏనై కొట్లాడుత అంటూ నిచ్చెన మెట్ల వ్యవస్థ మీద యుద్ధ ప్రకటన చేస్తున్నాడు.ఓటమిని కూడా భయపెట్టగలిగే నిర్భయత్వాన్ని సంతరించుకున్న వాక్యాలు ఉన్నాయి చాలా కవితల్లో. ఎన్నో పూలై వికసిస్తున్నాయి. కాని తన నిర్భయత్వానికి వెన్నెముకలాగా నిలిచిన తన తల్లిని మనసారా స్మరించుకునే తోవలో Keyఉంది. ఒంటరి యుద్ధ భూమిలో..

పసి కడుపుకు పాలు మాత్రమే తాప లేదు అవ్వ పాటను కూడా తాపించింది లోకాన్ని గెలవడానికి అక్షరాల తొవ్వను జూపించింది.. అని అక్షరాలతో లోకాన్ని గెలవమంటాడు. కవిత్వానికిపుడు పాఠకుల సంఖ్య పెరుగుతోంది. కవిత్వం అంతర్జాలమయమై పోయిన తర్వాత విస్తృతి ఇంకా పెరుగుతుంది. మీడియా మాయని తమ చుట్టూ చుట్టుకుపోతూ కథలు చెప్పుతున్న రచయితలు వారు అల్లుకుంటున్న అయోమయం ఈ వాస్తవాన్ని గుర్తించదు. తెలంగాణ ఉద్యమ హోరులో జోరు జోరుగా రక్తధారణ కాసారమయ్యింది..కవిత్వమేనన్న విషయం ఎవరైనా మరిచిపోగలరా. ఉద్యమమూ..కవిత్వమూ.. రెంటిని సమాంతరంగా కలాన్ని కమ్ముకుని వొక మహాస్వప్నాన్ని సాకారం చేసుకున్నాయి.
ఇందులోని కవితలు చాలా వరకు Foreground లోనే చాలా పెద్దగా Loud ఉంటూ పాఠకుడిని తక్షణ కర్తవ్యం దిశగా నడిపిస్తాయి. లేదా అప్పటికప్పుడే ఆలోచింపజేస్తాయి. ఎప్పుడయితే కవి తనకు తాను పూర్తిగా Erase చేసుకుని బహిరంగ పరుచుకుంటాడో తన ప్రజల వైపు చూస్తూ.. తన ఆలోచనలని అనుభవాలని పంచుకుంటూ తన స్పృహ మీద దాడి చెయ్యమని Outer Self ని ఆహ్వానిస్తాడో పూర్తిగా ఖాళీ అయ్యి అనుభవాలను ఆకర్షిస్తాడో అతడి కవిత్వంలోని నిజాయితీ తక్షణమే పాఠకులకు తెలిసి వస్తుంది. ఇక అతని కవిత్వంలోని విద్యుత్తు పాఠకుల లోపలికి ప్రవహించడం మొదలవుతుంది.

ప్రపంచ కవిత్వంలోనే మానవ ఉద్వేగాన్ని సజలంగా చూపిన గొప్ప కవి పాబ్లో నెరుడా కవిత్వం విషయంలో జరిగిందంతా ఇలాంటి Organic Mechanismమే అని మనం అనుకోవాలి. రవీందర్ కవిత్వంలో అటువంటి Organic Mechanism వుందని పాఠకునిగా నాకనిపించింది. తన చుట్టూ వున్నా జీవితంలోని Organic స్పర్శ తెలిసిన కవి మాత్రమే ఇటువంటి Expressionని ఇవ్వగలడు.
ఈ శతాబ్దపు విషాదాన్నే కాదు, వేల ఏండ్ల అణిచివేతను శబ్దిస్తున్న కవిత్వం ఇది. మహ విధ్వంసకులతో చర్చలు వాదోపవాదాలు దొర్లుతూ ఉంటే అంతరంగంలోని సంకుల సమరాన్ని తేదీలు తేదీలుగా, ఆత్మహత్యలుగా, దాడులుగా, హత్యలుగా, శబ్దరూప సంకేతంగా మన కండ్ల ముందు జల్లెడ పడుతుందీ కవిత్వం. ఈ కవిత్వంలోని తెరాటకం/గోస ఈ దునియాలో ఇంకెవ్వరికీ అర్థం కాదు. వెలివాడల అవమానపు Untouchab -ility ని రుచి చూసిన జాంబవంతుడి డీఎన్‌ఏకి తప్ప ఎవ్వనీకి అంతుబట్టదు. ఇది నిజం. ఈ నిజాన్ని ఇలా కొనసాగిస్తూనే ప్రకటిస్తూనే.. కొనసాగిస్తూనే ఉన్న Inglorious Bastardsని కూడా తిడుతూ హెచ్చరిస్తున్న కవిత్వ కథనమిది.

రవీందర్ కవితలు Private Audience కోసం గొంతెత్తిన కవిత్వం కాదు. తన శ్రోత/ ప్రేమక్షకుడు జన/సృజన సభల్లోని వ్యక్తి. మన చుట్టూ కేంద్రంగా వలయించి వున్న రాజకీయ సామాజిక సాంస్కృతిక జీవితాన్ని ప్రశ్నించే కవిత్వమిది. లోప ల నుంచి హఠాత్తుగా తన్నుకు వచ్చే ఉద్యమ ప్రకటన ఇతని కవిత్వం. తెలంగాణ విజయవంతంగా రూపుదిద్దుకొని కొనసాగుతున్న తర్వాత కూడా కొనసాగింపు ఉన్న కవిత్వం రవీందర్ ది. దళిత బహుజనులు నిరంతరం సవరించుకునే స్వప్నాలను స్పర్శించే కవిత్వమే.. ఇది.
మనలోని నిష్క్రియా పరత్వాన్ని, దెబ్బలు తినీ తినీ సొమ్మొ చ్చి పడిపోతున్న కాయ కష్ట జీవితాన్ని సాధికార పరచుకోవడానికి వాక్యాలను కరెంటులో ముంచి మన మెదళ్లను మేల్కొల్పడానికి ముందుకు వస్తున్నాడు. ఈ కవిత్వం మనల్ని ప్రాణాపా య స్థితి నుంచి కాపాడుతుంది. ఎందుకంటే..నేనింకా నిషిద్ధ మానవుణ్ణేలో దూకితే మంటలంటుకొని కొత్త దేహాన్ని పొం ది,కొత్త ఆత్మతో పుట్టుకు వస్తాం.బోధి సత్వులమవుతాం. సూఫీ మానవులమవుతాం. జైన తీర్థంకురలమవుతాం. ద్రవిడ ఆళ్వారులమవుతాం. మనం వుంటున్న ప్రపంచాన్ని Deconstruct చేస్తాం. తప్పదు. రవీందర్ కవిత్వం మొత్తంలో ఒక Central Debate ఉంది. ఒక గొప్ప Political Action దిశని దాచుకున్న Manife -sto ఉంది. కొత్త తరాలకు జీవించగలిగే గెలుపునీ పోరాడే బలాన్ని ఇవ్వగలిగే Energy ఉంది. Power ఉంది. వర్తమాన రాజకీయ హింసోన్మాద వికటత్వానికి, వికృతానికి నిప్పంటించ గల, జీవ ప్రస్తారాన్ని ఇవ్వగల సత్తా వుందనిపిస్తోంది. చివరికి కవితలో ప్రతీ వాక్యానికి ఎలీజీ రాస్తూ యుద్ధ పతాకల్ని ఎగరేస్తూ ముందుకు వెళ్లొచ్చు. అట్లా వొక్కొ క్క ఎలిజీ రాసుకుంటూ పోతే వేల ఏండ్ల ఈ దేశ చరిత్రకు పుటలంటూ ఉంటాయి. అందుకే మనం చాలా చాలా రాయవలసి న అవసరం ఉంది. ఎందుకంటే కవిత్వం మనల్ని ప్రాణాపాయ స్థితి నుంచి ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది. మన రాబోయే తరాలను సజీవ పరుస్తుంటుంది.

A poet has no age. A true poet is the contem -porary of all generations, his own and that of his grand children.
- Aleksandr Tvardovsky
- కవి సిద్ధార్థ, 73306 21563
(మార్చి 10న ఒంటరి యుద్ధభూమి ఆవిష్కరణ సందర్భం గా.. ఈ పుస్త కానికి కవి సిద్ధార్థ రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు..)

567
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles