శబ్దంగానో నిశబ్దంగానో గాథలోకి


Mon,February 11, 2019 01:00 AM

నువ్వు విద్వంసం అనుకుంటే నేను నిర్మాణం అం టాను. మొత్తంమీద మనిషి సమూహాలు సమూహాలు కాకుండా పాయలు పాయలుగా ప్రవహించాలి. దేన్నీ విడదీయకు, ఎప్పుడైనా సరే రెండును ఒక్కటిగా చెయ్యి. రాకపోతే అలాంటి విద్య నేర్చుకో.
Gadhaabook
ఒక బండరాయి దొర్లుతూ దొర్లుతూ నీటికుంటలో పడగానే నీరు వలయాలు వలయాలుగా మారి ఆ రాయి చుట్టూ చేరి వాటి గాథను ప్రవచిస్తాయి. ఒక పచ్చని చెట్టు నుంచి ఆకులు గాలిలో పాకుతూ భూమి పెదాల ను ముద్దాడుతూ వాటి గాథను మట్టితో చెప్పుకోవడానికి చెట్టు నుంచి వేరుపడి ఆత్మహత్య చేసుకున్నాయి అందామా? అయినా గాథ కేవలం జీవం ఉన్నవారికే నా లేక దేనికైనా ఉంటుందా? శివారెడ్డి గారు చెప్పినట్టు గాథ వంటింట్లోనో, నట్టింట్లోనో, వీధిలాంటి కొంపలోనో ఉంటుంది. మనం అనుకుం టూ ఉంటాం జాగ్రత్తగా ఉన్నామని. గాథ అమాంతం ఎగిరొచ్చి నీ గుండె ల్లో పేలినప్పుడే కదా దాని ఉనికి నీ చలనత్వం తెలిసేది.

ప్రపంచంలోకి నీ రక్తం విసిరావో లేక ప్రపంచమే నీ రక్తంలో ఇంకిందో నీడ మాత్రం దొర్లుతూనే ఉంది. ఒక్క క్షణాన్ని నీవేప్పుడైన చూశావా? అయి నా క్షణమంటే అరవై గడియలనుకున్నావా? ఒకసారి ఆలోచించు. అదొక జననం అయ్యుండచ్చు లేదా మర ణం అయ్యుండచ్చు. లేదా జననానికి మరణానికి వేలాడే సన్నని, వెచ్చని గాలి అయ్యుండచ్చు. చెమట చిందించి ఆరుబయట కూర్చుంటే పిల్లాగాలి ఆ కార్మికుడికి తాకినప్పుడు ఉండే ఆ చల్లదనం మాట లో నేడు లేదు. అమ్మ పోత్తిల్లల్లో నిద్రపోయినప్పుడు కలిగే వెచ్చదనం, భద్రతా నేటి మాటలలో కరువైంది. మాటల్లో వేట కనపడుతుంది. మాటలతో వేటాడి మేం వేటాగాడి వారసులం అంటారు. కొన్నిమాటలకి కోరలుంటాయి. ఆ కోరలకి దాహం వేస్తుంది. అప్పుడు ఆ మాటలు త్రాచులా జొరబడి సందర్భాన్ని, సన్నివేశాన్ని మింగేస్తాయి. అలాంటి మాటలు కాకుండా నేడు వెన్నెలవాగులో మునిగి తేలే అందమైనా మాటల కోసమే ఈ కవి అన్వేషిస్తున్నారు.

మనం అనుకుంటాం సమాజాన్ని మనమే నిర్మించామాని. కానే కాదు సమాజమే తన పురోగమనానికి మన ల్ని సృజించుకుంటుంది..ఎంత గొప్ప వాఖ్యమిది.
మనిషి మొదటి నుంచీ చీకటిని విశ్రాంతినిచ్చే వస్తువుగానే చూస్తాడెందుకో? రాత్రిని కప్పుకొని పడుకున్నప్పుడు మనసు మరో ప్రపంచంలో విహరించి మరింత అలసిపోతుంది. మరి అది విశ్రాంతి ఎలా అవుతుంది? చీకటిని ఎలాంటి భయం లేకుండా చుట్టుకోండి అప్పుడే మనసుకు గాఢమైన విరామం దొరుకుతుంది.
మనుషులు చనిపోకూడదు
బతికుండే మనషులు చనిపోగూడదు
మనుషులు విరిగిపోకూడదు
నిటారుగా నిలబడ్డ మనషులు
విరిగి, ముక్కలు ముక్కలై పడిపోకూడదు
బతుకంతా శ్రమించింది
నాలుగు మెతుకులు తినడానికే కాదు
తలెత్తుకొని తిరగడానికి భూమిలో కాళ్ళు పాతి
ఆకాశంతో సంభాషించటానికే..
కవికి మనుషులంటే ఎంత ప్రేమో చూడండి. మనుషులు ముక్కలు ముక్కలుగా, సమూహాలు సమూహాలుగా తెగిపోతుంటే కవి హృదయం ఒంటరిగా రోదిస్తు న్నది. బతుకంతా శ్రమించింది అన్నం కోసమే అనుకుంటే ఎంత పొరపాటు. మనిషి మనిషి కోసమే కదా జీవిస్తున్నది. తోటి మనిషే లేకుంటే మన ఉనికేది? అం దుకే మనుషులుగా బతకాలి బతికి ఆకాశాన్ని కౌగలించుకొని స్వేచ్ఛగా విహరించాలి. కనీసం నీ మొర వినడానికైనా మనుషుండాలి. ఎలాంటి వలయాలు లేని మనిషి,లోలోపలికి వెళ్ళని మనిషి, బహిర్గతంగా భావా లూ ప్రకటించే మనిషి కావాల్సిందే.

మనిషి ఉంటే గది బతికిన నది అవుతుంది లేకుంటే చనిపోయిన కాఫీ కప్పు అవుతుంది..
ఇప్పుడు అనే కవితలో అప్పుడప్పుడు నేను పిల్లల ప్రపంచం ,పిట్టల ప్రపంచలోకి జారుతాను.. అంటారు కవి. ఎందుకంటే? ఈ దుర్మార్గపు ప్రపంచం, ముల్లులా చేతుల ప్రపంచం, రక్తమోడిన ప్రపంచంలో ఉండలేం. అందుకే ఎలాంటి స్వార్థాలు లేని పిల్లల ప్రపంచంలోకి వెళ్ళాలి. హత్యలు, ఆత్మహత్యలు లేని ప్రపంచంలోకి వెళ్లి గుండెకు, గుండె చప్పుడికి కూడా సేద తీర్చాలి. స్వార్ధాన్ని బద్దలు కొట్టాలి మళ్ళీ కొత్తగా ప్రపంచాన్ని సృష్టించాలి.
నువ్వు విధ్వంసం అనుకుంటే నేను నిర్మాణం అం టాను. మొత్తంమీద మనిషి సమూహాలు సమూహాలు కాకుండా పాయలు పాయలుగా ప్రవహించాలి. దేన్నీ విడదీయకు,ఎప్పుడైనా సరే రెండును ఒక్కటిగా చెయ్యి. రాకపోతే అలాంటి విద్య నేర్చుకో. శివారెడ్డి గారు రచించిన గాథ మనషులు మనుషులుగా ఎలా బతకాలో నేర్పిస్తుంది.
- లై, 94919 77190

509
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles