మఖ్దూమే మన సాహితీ ప్రదాత


Mon,February 4, 2019 01:49 AM

రెండు ప్రపంచయుద్ధాల మధ్య అంతర్జాతీయంగా తలెత్తిన డాడా, సర్రిలియలిస్టు ధోరణుల ప్రభావం కూడా తెలంగాణ నుంచి వెలువడిన కవిత్యోద్యమంపై పడింది. సారాంశంలో చూస్తే రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో స్పానిష్‌సివిల్ వార్, ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటాలకు రచయితలకు, కవులకు ప్రేరణగా నిలిచాయి. దాని తర్వాత తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ రాజ్యం ఆ తర్వాత వెలువడిన సాహి త్యం వాటి స్థాయికి ఏ మాత్రం తీసిపోదు.

తెలంగాణ సాహిత్యరంగాన్ని ప్రత్యేక శ్రద్ధతో అధ్యయనం చేసినప్పుడు ఏదో ఒక కొత్త సంగతి బయ టపడటం ఖాయం. హైదరాబాద్ వంటి ఆధునిక నగరం తెలంగాణ నడిమధ్యలో నాలుగు వందల ఏండ్ల నుంచి ఉన్నది. నగరమేదైనా నాగరికతకు, జీవనరీతికి కేంద్రబిందువు. నాలుగు శతాబ్దాల తరబడి హైదరాబాద్ కూడా అంతే. నాలు గు సాహిత్య సంప్రదాయాలున్న నగరమిది. అనేక కళా, కవితా ఉద్యమాలకు కూడలి. కానీ 1940ల నుంచి 1956 వరకు తెలంగాణ కేంద్రంగా తలెత్తిన ప్రజా సాహిత్య ఉద్యమాలపై ఒక చీకటి తెర కమ్ముకున్నది. 1956 తర్వాత ఆంధ్ర అభ్యుదయసాహిత్యోద్యమం, సంస్థగా అరసం, కవిగా శ్రీశ్రీ దిగుమతి కావడంతో మరింత మరుగున పడిపోయింది. మహాకవి దాశరథిని మినహాయిస్తే అభ్యుదయ సాహిత్యమన్నా, ఆధునిక సాహిత్యమన్నా ఆంధ్రదే అన్న భావం తెలంగాణలో ఏర్పడింది. అయితే తెలంగాణలో కూడా ఆనాటికి భారతదేశం, అంతర్జాతీయంగా తలెత్తిన అన్ని ఉద్యమాలను చవిచూసింది. దానికి కారణం ప్రగతిశీల లేఖక్ సంఘ్, దానికి నాయకుడు మహాకవి మఖ్దూం.
makhdoom
ఆ తర్వాత తెలంగాణ రచయితల సంఘం. దీనికి నాయకుడు కాళోజీ. 1940ల నుంచి రావి నారాయణరెడ్డితో పాటు మఖ్దూం కూడా ఆంధ్ర మహాసభలో అగ్ర నాయకుడయ్యాడు. ఆ సభలో మఖ్దూం కవితా పఠనం గురించి ప్రగతిశీల లేఖక్ సంఘ్ గురించి దాశరథి, వెల్దుర్తి మాణిక్‌రావు, సీహెచ్ హనుమంతరావు రాసి ఉన్నారు. నాటి హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ వల్ల బాధ్యతాయుత ప్రభుత్వం, రాచరిక, జాగీర్దారీ వ్యవస్థ రద్దుకు పోరాటాలు తలెత్తడంతో రచయితలకు ప్రేరణగా నిలిచింది. మరోరకంగా చూస్తే 1939లో స్పానిష్ తిరుగుబాటు తర్వాత అత్యధికంగా రచయితలు కలాన్ని, కత్తిని చేతబట్టి పోరాడి జైలుకెళ్లింది తెలంగాణ పోరాటాల్లోనే. 1943 నుంచి ఎంతో చురుకుగా పనిచేసిన సంస్థగా ఇంగ్లీషులో వెలువరించిన అది ఆ సంస్థ జాతీయ నివేదికలు తెలుపుతున్నాయి. ఈ సంస్థ ఆంధ్ర అరసం అది సృష్టించిన ప్రమాణాలకు భిన్నమైంది. అయితే బాపిరాజు వల్ల ఇక్కడా అరసం ఏర్పడ్డది. కానీ పేరుకే.

నాటి హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ రచయితలు షాద్, కాళోజీ, దాశరథి, సినారె సహా యువ రచయితలకు ప్రేరణ ప్రగతిశీల లేఖక్ సంఘ్, మఖ్దూం కవితా రచనే. తెలంగాణను గొప్పగా కీర్తిస్తూ రాసిన తొలికవి ఆయనే. ఇందుకు దాఖలా వారి ఉర్దూ, ఇంగ్లీషు అనువాదాలే. కాళోజీ, సినారె, దాశరథి ఉర్దూలో కవిత్వం కూడా రాశారు. లక్నో కేంద్రంగా 1936లో ప్రేవ్‌ుచంద్ అధ్యక్షతన ప్రగతిశీల్ లేఖక్ సంఘ్ ఏర్పడింది. హైదరాబాద్ రాజ్యం నుంచి ఈ సభకు ఉర్దూ భాషోద్యమకారుడు, అబ్దుల్ హక్, ఆంగ్ల కవయిత్రి సరోజినీ నాయుడు ప్రాతినిధ్యం వహించారు. ఈ సంస్థపై కమ్యూనిస్టు పార్టీపై అటు బ్రిటిష్ ఇలాఖాలో, ఇటు హైదారాబాద్ రాజ్యంలో నిషేధం ఉండేది. దానితో నామమాత్రమైంది. దీంతో ఈ సంస్థలు 19 40ల నుంచి ఆంధ్ర మహాసభలో లోపాయిగా పనిచేశాయి. వీటిలో మఖ్దూం రాసిన పాటలను, ఈ సభల్లో విస్తృతంగా పాడేవారు. లేఖక్‌సంఘ్, ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఆర్ట్స్ 1943)లపై. నిషేధం తొలిగిపోవడంతో ప్రగతిశీల్ లేఖక్ సంఘ్ చురుకుగా మారింది. మహాకవి మఖ్దూం నేతృత్వంలో పనిచే సింది. తెలంగాణ తెలుగు రచయితపై మఖ్దూం ప్రభావమే అధి కం. ఇందుకు దాఖలా ఆయన మరణించినప్పుడు తెలంగాణ రచయితల స్పందనే.

ఈ కారణం వల్లనే ఆయన కాలం చేసినప్పుడు సినారె ప్యారే మఖ్దూం పేరుతో గొప్ప స్మృతి కవిత రాస్తే, హీరాలాల్ మోరియా ఆయన జీవితచరిత్రపై పుస్తకం రాశారు. దాశరథి తన యాత్రా చరిత్రలో మఖ్దూం జ్ఞాపకాలను కొంతమేరకు పదిలపరిచారు. కౌముది స్మృతి కవిత రాశారు. ఇంతే కాకుండా సినారె 1950ల తొలినాళ్లలోనే మఖ్దూం కవితను అనువాదం చేశా రు. తెలంగాణను ఎంతగానో ప్రేమించిన మహాకవి మఖ్దూం. ప్రపంచానికే ప్రవక్తగా సంభావించి న ఆ కవి 1969 ఉద్యమానికి కూడా మద్దతు తెలిపాడు.
పోలీసు చర్య పేరుతో జరిగిన ఇం టిగ్రేషన్, హత్యాకాండ, ఆజాద్ హైదారాబాద్ పేరుతో రజాకార్ల, విశాలాంధ్ర పేరుతో జరిగిన హింసాకాండ నేపథ్యంలో హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ ఆధ్యర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ ప్రతిఘటనతో కవిత్వం రూపంలో వచ్చిన నిరసన కూడా చాలా విశిష్టమైంది. తెలంగాణ కేంద్రంగా స్థానికంగా, జాతీయ, అంతరాతీయ స్థాయిలో వచ్చిన కవిత్వమిది తెలుగు, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లీషుతో సహా పోలీష్, రష్యన్ భాష ల్లో ఉద్యమస్థాయిలో వచ్చిన కవిత్వమిది.

తెలంగాణనే తీసుకుందాం. ఇంటిగ్రేషన్‌కు ప్రత్యక్ష సాక్షులైన సురవరం, సరోజినీ నాయుడు, మఖ్దూం, అంజద్ హైదరాబాదీ, గార్లపాటి వంటి సాహితీవేత్తల అంతే వాసులుగా కాళోజీ, దాశరథి, పొట్లపల్లి రామారావు, వానమామలై వరదాచార్యులు, నాటి యువకవు లు దాశరథి, బూర్గుల రంగనాథరావు, కవి రాజమూర్తి, ఊటుకూరు రంగారావు, రాజారాం, రావెల, సినారె, యశోదారెడ్డి, సామల సదాశివ, సుప్రసన్న, పేర్వారం, రాయప్రోల్ రాజశేఖ ర్, ఉర్దూ కవులు హీరాలాల్ మోరియా, ఇంగ్లీషు కవులు హరిన్ చట్టో, శ్రీనివాస్ రాయప్రోల్, బాపురెడ్డి, ఇందిరా దన్‌రాజ్‌గిర్ ల కవిత్వ సంపుటాలు మచ్చుకు కొన్నిమాత్రమే. ఫాసిజాన్ని, నాజీజాన్ని నిరసిస్తూ వచ్చిన అంతర్జాతీయ ప్రగతిశీల సాహిత్యోద్యమం శాంతిపేరుతో బలహీన పడిన కాలాన హైదరాబా ద్, తెలంగాణ కేంద్రంగా వచ్చిన కవిత్యమిది. పూర్తిగా స్థానిక పరిస్థితుల నుంచి రూపుదిద్దుకున్నది. మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో కాళోజీ నా గొడవ, పొట్లపల్లి రామారావు ఆత్మ నివేదన, దాశరథి కవిత చర్చలోకి వచ్చాయి.

అదికూడా నామ మాత్రమే. నాటి ఈ కవులకు స్వతంత్ర ప్రచురణ సం స్థలు, స్రవంతి, శోభ (ఓయు), సారస్వత జ్యోతి వంటి తెలంగాణ పత్రికలు వేదికయ్యాయి. 1946 నుంచి 1954ల మధ్య వరదలా ఉరకలేసిన ఈ కవితోద్యమానికి అటు విశాలాంధ్ర కోసం ప్రచారంలో పెట్టిన అభ్యుదయ సాహిత్యోద్యమానికి అస లు సంబంధం లేదు. భారత జాతీయుడు నిజాం పాలిత ప్రాం తమైన హైదరాబాద్ రాజ్యం సామాజిక, రాజకీయ పరిస్థితు లు, భాషలు, జీవనరీతి మద్రాసులో భాగమైన ఆంధ్ర సామాజిక పరిస్థితులు భాష పూర్తిగా వేర్వేరు. రెండూ పూర్తిగా భిన్న ప్రపంచాలు. రెండు దేశా ల మధ్య ఉండే తేడా వంటిది. అందుకే ఆ తేడా నాటి తెలంగాణ, ఆంధ్ర సాహిత్య రంగాల్లో కూడా ప్రతిఫలించింది. కారణం దాని ప్రమాణాల కంటే భిన్నమైంది. ఆం ధ్ర అభ్యుదయ సాహిత్యం పేరుతో ప్రచారంలో పెట్టిన ముస్లిం వ్యతిరేకత, హింసాకాండను తెలంగాణపై ప్రతికూలత, తెలుగు సెంటిమెంట్ వంటివి తెలంగాణ కవులు ఏనాడు ఖాతరు చేయలేదు. ఈ కవులనే తీసుకుందాం. వీరు ప్రచారంలో పెట్టిన కవి తా విలువలు, ప్రమాణాలు, ప్రాధామ్యాలు పూర్తిగా భిన్నమైనవి.

సార్వజనీనత, వర్గ పోరాటం, జన సామాన్యం పక్షం, సెక్యులరిజం, సహా స్థానికత, ఉర్దూ ప్రభావం వల్ల కావచ్చు విషాద ప్రణయం, ప్రగతిశీల లేఖక్ సంఘ్ వల్ల కావచ్చు అం తర్జాతీయ ప్రభావం కూడా కనిపిస్తుంది. దీనివల్లే తమ చుట్టుముట్టు ఆవరించిన రాజకీయ, సామాజిక పరిస్థితులపై తిరుగుబాటు నిరసన, ఆందోళన ప్రధాన లక్షణాలుగా ఈ కవితోద్య మం నడిచింది. నాటి కవితా సంపుటాల పేర్లు కూడా దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. మచ్చుకు కాళోజీ నా గొడవ, పొట్లపల్లి రామారావు ఆత్మనివేదన, సినారె జలపాతం (కన్నీటి) కవిరాజమూర్తి మహైక కవితా ప్రమాణాలే కాదు ఈ పేర్లు కూడా ఆయా కవుల నిరసనను తెలియజెప్పేవి. నాటి పరిస్థితులపై గొప్ప నిరసన కావ్యాలివి. నాటి హైదరాబాద్ రాజ్యం అందు లో భాగమైన తెలంగాణ దుర్భల స్థితిని బాగా ప్రతిబింబించా యి. హైదరాబాద్ రాజ్యం విలీనం, దాని దరిమిలా ఏర్పడిన యుద్ధ వాతావరణం, సంఘర్షణను చాలా గొప్పగా ప్రతిబింబించిన మహా కావ్యాలు దాశరథి, అగ్నిధార, రుద్రవీణ, కవిరాజమూర్తి మహైక మానవ సంగీతం, సినారె జలపాతం, విశ్వగీతి. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రబలిన బీభత్సకర పరిస్థితులను, సామాన్యుల విషాదాన్ని, క్షీణ విలువలను చిత్రించి న ఆంగ్లకవి టి.ఎస్.ఇలియట్ రాసిన వేస్ట్‌లాండ్ మహైక ముందుమాట కర్తలు పోల్చారు. చాలా అర్థవంతమైన పోలిక అది.

నాటి హైదరాబాద్ రాజ్యం అందులో భాగమైన తెలంగాణలో పూర్తి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితులను పరోక్ష ప్రతిఫలనాలను ఊటుకూరు రంగారావు శరధార, అష్టకాల రామ్మోహనశర్మ శిథిల విపంచి కావ్యాలు కూడా చిత్రించాయి. హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనమైనా మారని పరిస్థితులపై దుఃఖపూరిత విషాదం, ఆవేదన నిరసన వ్యక్తం చేసిన మహా కావ్యాలివి. మరొక సంగతి చెప్పుకోవాలి. కాళోజీ కవిత పార్థీవ వ్యయం బొంబాయి నావికా తిరుగుబాటును చిత్రించింది. రెండు ప్రపంచయుద్ధాల మధ్య అంతర్జాతీయం గా తలెత్తిన డాడా, సర్రిలియలిస్టు ధోరణుల ప్రభావం కూడా తెలంగాణ నుంచి వెలువడిన కవిత్యోద్యమంపై పడింది. సారాంశంలో చూస్తే రెండు ప్రపంచయుద్ధాల మధ్యకాలంలో స్పానిష్‌సివిల్ వార్, ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటాలకు రచయితలకు, కవులకు ప్రేరణగా నిలిచాయి. దాని తర్వాత తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ రాజ్యం ఆ తర్వాత వెలువడిన సాహి త్యం వాటి స్థాయికి ఏ మాత్రం తీసిపోదు. ఇంతటి చరిత్రకు కారణమైన భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రశేణి నాయకుడు, దక్షిణాది నుంచి మొదటి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావి నారాయణరెడ్డి ఆయన ప్రియమిత్రుడు మఖ్దూంకు తెలంగాణ ప్రజ ల పక్షాన నా జోహార్లు.
- సామిడి జగన్‌రెడ్డి, 85006 32551

1751
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles