మనసుకు ఏడ్పు నేర్పాలె..


Mon,January 28, 2019 12:04 AM

ప్రతి జంటలో ఒకరు తప్పక బందీలవుతున్న మాట వాస్తవం. కలిసి ఉన్న ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎవరి భావాలను కించపరచకుండా వారి వారి భావాల్లో బతుకనిస్తే అందమైన జీవితమవుతుందని చెప్పడమే కవి ఉద్దేశం.

ఈ కవిత్వమొక తీరని దాహం.. ఈ వాక్యం పోలిక సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే సరిపోతుంది. ఎందుకంటే ఈ కవి చేను గట్టును పియానో చేసి పంట కాల్వ లాం టి పదాలను గలగల పారించగలడు. పూలండోయ్ పూలు అంటూ తన కవిత్వ వాక్యసుమాలను పరిచ యం చేయగలడు. అమ్మను వాస్తు శిల్పిని చేసి నాన్నను చెట్టుతో పోలుస్తాడు. స్నేహాన్ని అపురూపంగా రాస్తూ మిత్రుడొచ్చిన వేళ అంటాడు. ఇదిగో ఇప్పుడేమో ఇలా.. దేశం లేని ప్రజలు అంటూ నిరసన గంప తలకెత్తుకున్నాడు. ఈయనే ప్రసాదమూర్తి.

ఈయన కవిత్వం ఏడు రంగుల భావాల కలనేత. ఈయన ప్రతి వస్తువుతోను మాట్లాడతారు, ఇప్పుడు తన తాజా కవిత్వం లో అలలకు కలలకు శిరసు వంచి వినమ్రంగా ఆయన కవిత్వాన్ని అం కితమిచ్చారు.
Things dont go away
They become you
There is no end..T.S.Eliot
డాక్టర్ బి.ప్రసాదమూర్తి పంచే అక్షరాలన్నీ కళ్ళకద్దుకోవలసినవే. భక్తితో కాదు ప్రేమతో..ఇదిగో ఇందాక గుడికాడ కలిసి ఆయన ప్రసాదం పెట్టిన నా పిడికిలి పొట్లం విప్పుతున్నాను.. ఈ కవితా సంపుటి దేశం లేని ప్రజలులో ఎవరెవరు ఎలా ఎందుకు నిరాశ్రయులయ్యారో వారికి ఈయన హృదయ దేశంలో ఎలా ఆశ్ర యం కల్పించారో చూద్దాం రండి..
ముందుగా టైటిల్ కవిత.. ఈ ఒక్క కవిత చాలు ఈయనకు ఒక గొప్ప అవార్డు దక్కటానికి. కొన్ని కులా లు జాతులకు జాతీయంగా అంతర్జాతీయంగా ఎదురవుతున్న అభద్రతా భావం గురించి నిఘా చూపులు నింద మాటలు దిగబడి అల్లాడుతున్న ఆ బాధితుల పక్షాన ఈ కవి తన గొంతుక వినిపించారు..అక్కర్లేని మిగులు జనం.. గుండెల్ని చీల్చి దేశ పటాన్ని చూపించినా.. మొలకెత్తిన చోటు నాదే అని మొక్క మొరాయిస్తే కుదరదు.. ఈ వాక్యాల్లో అభాగ్యుల దుస్థితిని ఎలా ఎరుక చేశారో కదా! చదువుతున్నంత సేపు రొహింగ్యా లు , సిరియాలు సముద్రాలను ఈదుతూ కనిపించారు.
కళ్ళారా ఏడిస్తే ఎంత బావుంటుందో.. మనసారా స్నానం చేసినట్టు.. వహ్ ఇంతకన్నా గొప్ప రిలీఫ్ వాక్యమేముంటుంది. పిల్లలకు చేయిపట్టి నడవటం నేర్పినట్టు మనసుకు ఏడుపు నేర్పాలి.. ఇక ఒక్క సారన్నా ఈ వాక్యం కోసం ఏడవకుండా ఉంటారా చదివిన వారెవరైనా. కొండంత బాధను గుండెల్లో ఒంపుకొని సముద్రమంత దుఖాన్ని కళ్ళలో నింపుకొని ఉంటే ఆ బరువు కుంగదీస్తుంది మనిషిని. కానీ ఆ కష్టాన్ని తలుచుకొని ఒక్కసారి ఏడిస్తే మనసు వాన వెలిసిన ఆకాశంలా మారుతుంది. ఎందుకంటే అప్పటి వరకూ ఆవరించిన వేదనపేరు దిగులు మబ్బు కనుక.
Shubhashini
కొంచెం స్వేచ్ఛ అనే కవితలో..
కొంచెం స్వేచ్ఛ చాలు ప్రాణాలదేముంది.. నేను నడవకూడదంటే కాళ్లు, రాయ కూడదంటే చేతులు నరుక్కోండి.. నేను చూడ కూడదా! నా కళ్ళు పీకండి.. మాట్లాడకూడదా నా నాలుక చీల్చండి.. పిడికెడు స్వేచ్ఛ మిగిలిన చాలు..
స్వేచ్ఛ కోసం ఈ కవి ఎక్కడ దాకా అయినా వెళ్లేందుకు సిద్ధపడుతారు. ప్రాణంపోతే ఏ తల్లి కడుపులోన మళ్లీ ఊపిరి పోసుకుంటానంటూ ప్రాణా లదేముంది అంటారు. స్వేచ్ఛ కోసం చిట్టి చివరి నిద్ర బొట్టు దాకా శ్రమిస్తాం అంటారు. నిజమే కదా స్వేచ్ఛ లేని జీవితం కటకటాల చీకటి గుహ. ఆ గుహలో ఎవరైనా ఉండడానికి ఇష్టపడరు. ఉన్నవాళ్లంతా బానిస బతుకు బతుకుతున్నవారే అలాంటి బానిస బతుకు తనకొద్దు అంటారు కవి ఇక్కడ.
చెరువు కేరింత చూపుతూ..
నన్ను చూస్తే మా ఊరి చెరువు నిక్కరు విప్పి గంతులేసేది.. నాకు తెలుసు తనతో పాటు తనలో ఆటలు ఆడుకుందాం రమ్మని ఆ కవ్వింపు..
చెరువు గురించి మాట్లాడేందుకు ప్రతి కవి ఇష్టపడతారు. కానీ ఈ కవి ఏకంగా చెరువు నిక్కర్ విప్పి గం తులేస్తుంది అంటారు. కానీ చెరువు చూస్తే మొత్తం మారిపోయినట్టు అనిపిస్తుంది అంటూ నాస్టాల్జియా చేస్తారు. ఒకప్పుడు పెద్ద పెద్ద తామరాకుల మీద సూర్యు డు నడిచేవాడనీ పదిలపరుచుకున్న జ్ఞాపకం అలా లేదని వాపోతారు.
నేనే దారి తప్పానో మా ఊరే దారి తప్పిందో కొంచెం తికమక.. ఈ మాటల్లో ఎంత బాధ కల్లాకపటం లేని చెరువు చెల్లాచెదురైందన్న దిగులు.
షేరింగ్ ఆటోకవితలో..
వచ్చిన ప్రతి ఆటో ఎక్కను, ఏదో రా బాబు ఆటోలో ఆమె ఉండాలి ఆమె ఉంటే బతుకు వాసన వేస్తుంది.. గొప్ప కవిత.
హ్యాండ్ బ్యాగ్‌లో సంసారం సర్దుకుని అంటూ తాగుబోతు భర్త బెదిరింపు మాటల తో సెల్‌ఫోన్‌కు చెమటలు పడతాయి అంటూ పనికి వెళ్లే ప్రతి సామాన్య స్త్రీ మూర్తిని ప్రస్ఫుటిస్తారక్కడ. మౌనం చెప్పే కథలు గొప్పవంటారు.
చీకటి తలుపులు తోసుకొని ఇంట్లో అడుగు పెడుతుంది పిల్లలు భర్త ఆమెను వాటేసుకుంటారు ఎవరి ఆకలి వారిది.. అంటారు ఇంకో కవితలో.
చాలు ఈ మాటలు చాలు ఆమెను ఆమెగా చూసే మనుషులెందరో తెలియదు కానీ ఆమెను చూసిన కవి మాత్రం ప్రసాదమూర్తి గారే. ఎవరాకలి వారిదే అం టూ గొప్ప సత్యాన్ని మరొకసారి మనందరికీ గుర్తు చేస్తారు.
ఒప్పందం కవితలో..
నీతో నడక నాకిష్టమే నువ్వు చెప్పినట్టు అంటే నడుచుకో లేను నీతో పంచుకున్న క్షణాలు మధురమే..నా గుండెల్లో భద్రంగా దాచుకున్న క్షణాలన్నీ నీవి కావు..
కండిషన్స్ ఐప్లె ఇప్పటి తరం స్వేచ్ఛగా చెప్పగల్గుతు న్న,కొంతమంది చెప్పలేక మనసులోనే దాచుకున్న మాటల్ని ఎంతో రియలిస్టిక్‌గా చెప్పారు ఇక్కడ కవి.
నీతో బంధం ముద్దే అదే బంధనమైతే వద్దు..
ప్రతి జంటలో ఒకరు తప్పక బందీలవుతున్న మాట వాస్తవం. కలిసి ఉన్న ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎవరి భావాలను కించపరచకుండా వారి వారి భావాల్లో బతుకనిస్తే అందమైన జీవితమవుతుందని చెప్పడమే కవి ఉద్దేశం. జరుగుతున్న విషయాలను సందర్భానుసారంగా అసంబద్ధ ప్రక్రియల జోలికి పోకుండా మనల్ని ఆ కవిత్వంలోకి తీసుకెళుతారీ కవి.
- సుభాషిణి తోట

978
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles