ఒంకర టింకర తొవ్వల్లో..


Mon,January 21, 2019 02:06 AM

కవిత్వ నిర్వహణ, అత్యాధునిక కవిత్వ నిర్వహణ కత్తిమీద సామే. ఎందుకంటే దానికి ఛందస్సు లేదు, అలంకారం ఆప్షనల్, కథ లేదు, పునాది కూడా లేదు. ఆధునిక వచన కవిత్వమంటే కనిపించని పునాదుల మీద కట్టవలసిన రంగుల హర్మ్యం. కవి తనకుతానుగా కనిపించని సొంత ఛందస్సొకటి ఏర్పరుచుకొని రాసుకుంటాడు. అతనికి ఒక తాత్విక పునాది, శైలీ పునాది ఉంటాయి. అతడు ఒక్కడే కానీ, ఒంటరి కాదనడంలో చమత్కారమే కవిత్వం, సీతారాం కవిత్వం.

లేఖిని బెట్టి వృత్తం గీయొచ్చు. పట్రీ బెట్టి సరళరేఖ గీయొచ్చు. డిగ్రీలు కొలిచి కోణం గీయొచ్చు. ఛందస్సులో పద్యం దించొచ్చు. ఆధారం లేని రాతలు కష్టం, ఒంకర టింకర గీతలు మరీ కష్టం. ఎందుకంటే అవి గీసి చూడమంటే ఎవరై నా ఎందుకు చూస్తారు. మన కంటి నుంచి జారిన కన్నీ టి గీత ఇక్కడికెలా వచ్చిందని చూస్తారు. మనం సిద్ధం చేసుకున్న శవపేటికను ఇతడెలా దొంగిలించాడని చూస్తారు. భోరున వర్షం కురుస్తుంటే ఏటొడ్డున నిలబ డి ఎకసెక్కాలాడే ధైర్యం వీడికెలా దొరికిందని పరికిస్తా రు. ఒంకర గీతలు బాగా గీస్తే వంగివంగి చూస్తారు, నిటారుగా చూస్తారు, దాపెట్టుకొని వల్లె వేస్తారు, పక్క లో వేసుకొని పరవశిస్తారు. అప్పుడెప్పుడో చదివి వదిలేసిన వాక్యం సందర్భం రాగానే నేనున్నానని ఎదురొస్తే మాణిక్యం కొడుకు మామూలోడు కాడని సాపిస్తాం. ఎవడు తనను చదివితే వాణ్ణి ఆవహించే సన్ ఆఫ్ మాణిక్యంను ఏదన్నా ఒక ఫ్రేంలో బంధిద్దామనుకుంటామా! చతురాలు, దీర్ఘ చతురాలు, కోన్‌లు, కొలమానాలు బద్ధలైపోతాయి. వ్యాఖ్యానానికి అందడు, సిద్ధాంతానికి పొందడు. సూరి పూని బాల వ్యాకరణం చెబుతున్నాడని మనం భ్రమపడకపోతే..

మధ్య తరగతి తలలెత్తని విశ్వగ్రామమున ఇల్లు కొనెను మిగిలిన ధనముతో షేర్లూ కొనెను ఇంకా మిగులుతో ఆ ఇంటికి స్టారు టీవీలు తొడిగెను తిరిగి దైవము బ్రతికెను ద్వేషమునే నగరములు శ్వాసించెను కుగ్రామములు ఫ్లాట్లయ్యెను..

అని ప్రపంచీకరణను ఎట్లా తిక్కగా సిద్ధాంతీకరిస్త డు! విమర్శకులకు అంత్యక్రియలు చేసినా బతికి వచ్చి సీతారాంది గ్లోబలైజేషన్ కవిత్వమనిరి. కవి పంతం వేరే. డిసెంబర్ 6ను మాత్రమే చూడలే, పి.వి.నరసింహారావు మీద దుమ్ము వోయలే, ఎవ్వని పేరూ దీయలే. మూలాల సూత్రాలు పట్టి లాగిండు..!

ఏమీ తోచనప్పుడు కెలికే మందిరాలు
ఏదైనా తోచినప్పుడు కూలే మజీదులు
2.77 ఎకరాల మేరకు విస్తరించిన కులమతాలు..
వాటిలో లోగుట్టూ తెలుసు. మజీదులో ఒకప్పటి గుడి కనబడింది కూడా ఒక లక్ష్యంతోనే. మజీదు కూలింది మాత్రం గుడి కట్టడానికి కాదు, రక్తం పారించడానికి. ఆ రక్తపు పాయ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఛానలైజ్ చేయడానికి. అటువైపు నుంచి కూడా గొప్ప వాదాన్నే అల్లారు. చరిత్రను తేదీలతో సహా ఏకరువు పెట్టారు. దానికి కవి దగ్గరేం జవాబుంటుంది? సీతా రాం మనుషులను వెతుకుదామంటే కర సేవకులు మతాల్ని వెతుకుదామంటున్నారని..

చరిత్ర కోసం మనం కొందరం హిందువులమయ్యాం ముస్లింలమూ అయ్యాం
కానీ, మనుషులం కాలేకపోయాం.. అని బిత్తర పోతా డు. అది పెట్టిన అనేక దాష్టీకాల్లో కర్ఫ్యూ అనేది ఒకటి. సీతారాం లాంటి కవులు సామాజిక సమస్య లను విస్మరించి తమ సమస్యల్నే సమాజానికి అంటగడుతు న్నారన్న అంజనీబాల అభిప్రాయాన్ని పూర్వపక్షం చేయడానికి ఈ కొన్ని కవితలు సరిపోతాయని చెప్పలేం కానీ మచ్చుకు ఒక్క దళిత కవిత కూడా లేకుండానే ఈ సంపు టి వేయడం దళిత ద్రోహమవుతుందా? అని తనకుతా నే సందేహించుకోవడం కూడా వ్యంగ్యం లేకుండా కవి త్వం రాయలేని తనంలో భాగమే. వందల కొద్దీ ఎలిజీలు కూడా మొనాటనీ వల్ల కదిలించలేకపోతున్న సందర్భం అన్ని వాదాల్లోనూ, మానవతా వాదంలోనూ చూస్తూ ఉన్నాం. మార్పును కలలుగన్న ఉద్యమకారుడి మరణా న్ని అద్భుతమైన ఎలిజీగా మలువడం వెనుక సీతారాం పరిశీలన, బాధ్యత ఎవరు కాదనగలరు? తూటాలకు పడిపోయిన వీరుడిని సంబోధిస్తూ ఆకాశం వాడి వేలిము ద్ర రాశాడు. ఇంత నిద్ర నువ్వెన్నడూ పోలేదును శాశ్వత నిద్రకు అలవోకగా సింబల్ చేస్తాడు. అక్కలిద్దరూ వీలు దొరికినప్పుడల్లా కళ్లను తడి చేసుకుంటున్నారు అని దుఃఖ సంకేతాలు కొత్తగా ప్రయోగిస్తాడు. ఆధునిక కవిత్వం ఒక అనుభవం, ఒక స్వీకరించగలిగే ఫీలింగ్ తిలక్‌లోలానే సీతారాంను కూడా వెన్నంటింది. ఉదా పడవను మొదలుపెడు తూ..

ఎంతకీ తీరం తగలదు అసలీ నదికి వొడ్డుందో లేదో.. అంటూ ప్రయాణా న్ని జీవితంతో పోలుస్తూ నడుపుతాడు కవితను.కొండకింద ఇల్లు శీర్షికన వేశ్య మీద రాసిన కవిత, యాక్సిడెంట్, అబ్బాయి మరణం మీద రాసిన ఏడుపు పుట్టినప్పుడు, పెనువెత కవితలు, ప్రియురాలి పాత లేఖ తదితర కవితల్లో సీతారాం సృజన లోతులు గుర్తించవచ్చు. ఒకచోట వస్తువు లేకుండా కవిత్వమెలా అల్లాలో అల్లి చూపించాడు. కవితలకు శీర్షికలు పెట్టడం లో ప్రత్యేకమైన శ్రద్ధ సీతారాంకు. ఆయన శీర్షికలు, భాష, ఆలోచనలు, అభివ్యక్తి ధోరణులు అన్నీ కొత్తగా ఉండేందుకు నిరంతరం పుటం పెట్టుకొని చూసే కవి సీతారాం. ఆయన కవిత్వం వ్యాఖ్యానానికి ఒదిగేది తక్కువ. అనుభవానికి అందుతుంది. వైయక్తిక అనుభవాన్ని కవిత్వం చేసి పాఠకులను కట్టి పడేయగల శక్తిమంతుడు.

కవిత్వ నిర్వహణ, అత్యాధునిక కవిత్వ నిర్వహణ కత్తిమీద సామే. ఎందుకంటే దానికి ఛందస్సు లేదు, అలంకారం ఆప్షనల్, కథ లేదు, పునాది కూడా లేదు. ఆధునిక వచన కవిత్వమంటే కనిపించని పునాదుల మీద కట్టవలసిన రంగుల హర్మ్యం. కవి తనకుతానుగా కనిపించని సొంత ఛందస్సొకటి ఏర్పరుచుకొని రాసుకుంటాడు. అతనికి ఒక తాత్విక పునాది, శైలీ పునాది ఉంటాయి. అతడు ఒక్కడే కానీ, ఒంటరి కాదనడంలో చమత్కారమే కవి త్వం, సీతారాం కవిత్వం. అంటాంగానీ వేలల్లో ఒక్కరే రాయగలరు కొత్తగా, ఒక్కరు కూడా ఒక్కసారే. వ్యంగ్య మే, తాత్విక వ్యంగ్యమే సీతారాం కవిత్వ ప్రాణం.
- ఏనుగు నర్సింహారెడ్డి 89788 69183

517
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles