తెలంగాణ జీవితాల కథాఘాటు


Sun,January 13, 2019 10:56 PM

మద్యం మీద ఎవరెంత రాసిన పెగ్గు గ్లాస్‌తో సముద్రాన్ని తోడినట్టే.. మా స్కైబాబ ఊరి మీద ఉరితాడు కథతో.. రూప్‌కుమార్ లచ్చుబాయ్ కథతో ఆ మద్యధరా సముద్రాన్ని తోడే ప్రయత్నం చేశారు.
dawath
ఈ కథకులు పరాయోన్ని నిందించలేదు, ఇడ్లీ సాంబర్‌ను గో బ్యాక్ అనలేదు. వీళ్ల ఇల్లు వీళ్లే అలుక్కున్నారు. వీళ్ల ఇంట్లో వీళ్లే దీపం పెట్టుకున్నారు. వీళ్ల బువ్వ వీళ్లే వండుకున్నారు. అందుకే దావత్ ఇచ్చిండ్రు.
తెలంగాణ దావత్ అంటే గొడ్డు కారంలాంటి పచ్చి నిజాలు.. చింతకాయ తొక్కులాంటి సంస్కృతి సంప్రదాయాలు, మక్కగట్క లాంటి మాన వ సంబంధాలు, ఎన్నెన్నో కథరుచు లు మనకు దొరుకుతాయి.
ఈ దావత్ అరేంజ్ చేసిన సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ వెల్దండి శ్రీధర్‌ను అభినందించక ఉండలేం. ఈ దావత్‌కు సరుకులు అందించిన డాక్టర్ ముదిగంటి సుజాతరెడ్డి, రామా చంద్రమౌళిని మరువలేం.
ఈ సంచికలో అంతా కొత్తవాళ్లే.. పాతతరం తెలంగాణ కథా రచయిత లు ఎక్కడైతే ఆగిపోయారో... వీల్లు అక్కడ్నుంచే ప్రారంభం కావటం శుభసూచకం. అదే ఈ కథల్లో కన్పిం చే గొప్ప స్పార్క్. రేపటి సాహిత్య వారసత్వ సరుకు ఈ కథలే నిదర్శనం.
అవయవ దానంలో వున్న గొప్ప మానవ సంబంధాల్ని, మానవత్వాన్ని చూపిన మన్‌ప్రీతమ్ కథ దానంతో మొదలై.. స్త్రీల జీవితాల్ని భిన్నమైన కోణంలో చూపిన నస్రిన్‌ఖాన్ పంఛీ ఔర్ పింజ్రా కథతో ముగిసే ఈ సంకలనంలో 13 కథలున్నాయి. ఎలక్షన్లో గెలిచాక కూడా స్త్రీని మగాడు ఎలా చూస్తున్నాడో తెలిపే వాస్తవిక కథ సమ్మెట ఉమాదేవి ద్వాలి. ఈ కథ చదివాక ముగ్గురు పిల్లలుంటే పదవికి అనర్హులు అని ప్రభుత్వం ప్రకటించినప్పుడు మండలాధ్యక్షురాలైన భార్యకు బలవంతంగా గర్భం తీసేయించిన అప్పటి ఆదిలాబాద్ జిల్లా నెన్నల మండలాధ్యక్షురాలి వార్త నాకు గుర్తొచ్చింది. స్త్రీ సింహాసనం మీద కూర్చున్నప్పటికీ.. ఆకాశంలో సగం అంటూనే పురుష హయాంలో కవేలం సంతకంగానే మిగులుతున్నారు అనడానికి ఈ కథే నిదర్శనం.
2016 భారత ఆర్థిక చరిత్రలో చీకటి సంవత్సరం.. పెద్దనోటు ప్రభావంతో ఇంకా సామాన్య జనాలు తన్లాడమన్లాడమవుతున్నారు. దీన్ని కొత్త కోణంలో చెప్పిన గొప్ప కథ మేరెడ్డి యాదగిరిరెడ్డి రాసిన పెద్దనోటు ఈ కథపై చాలా చర్చ జరుగాల్సి ఉన్నది. ఆంధ్ర రచయితలు ఇలాంటి కథ రాస్తే.. దానికి ఎంత ప్రాచుర్యం కల్పించేవాళ్లో..
రియల్ ఎస్టేట్‌లపై పాతి ఎర్రచీర.. హుమాయిన్ సం ఘీర్ రాసిన పచ్చశీర కథ చాలా మంచి కథ. రంగుల బ్రోచర్లతో మన కళ్లను కుమ్మేస్తున్న బచ్చాగాల్లపై తెల్లబట్ట కప్పాలని తెలియజెప్పే కథ.

మరో సున్నితమైన కథ చందు తులసి తల్లి గారిల్లు తల్లిదండ్రి లేని ఆడపిల్లను బతుకమ్మ పండుగ ఎంత బాధ పెడుతుందో ఆ సంఘర్షణ చెప్తూనే.. మంచి ముగింపునిచ్చారు. రచయిత. కానీ పూలమ్మ లాంటి అందరి జీవితాల్లోను అలాంటి ముగింపులాంటివుంటాయా అన్నదే ప్రశ్న.
మద్యం మీద ఎవరెంత రాసిన పెగ్గు గ్లాస్‌తో సముద్రాన్ని తోడినట్టే.. మా స్కైబాబ ఊరి మీద ఉరితాడు కథతో.. రూప్‌కుమార్ లచ్చుబాయ్ కథతో ఆ మద్యధరా సముద్రాన్ని తోడే ప్రయత్నం చేశారు. సంప్రదాయ కళాకారుల్ని జీవితాలు నిలబడాలంటే ఏం చేయాలో చెప్పిన కథ వజ్జీర్ ప్రదీప్ రంగుల గూడు తన రచనల్లో తెలంగాణ మధ్య తరగతి భాషా సౌందర్యాన్ని చాటిచెప్పే పూడూరి రాజిరెడ్డి బోర్లించిన చెప్పు ఒక హైలెట్. ఈ సంపుటికి పైలెట్ కూడా. కిరణ్ చర్ల సముద్రం నిద్ర పోదు, ధీరజ్ కశ్యప్ నాలుగేండ్ల చదువు, లాంటి మంచి కథలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి. పి.యస్.చారి గీసిన కవర్ బొమ్మ అద్భుతంగా ఉన్నది.
ఏదైనా తెలంగాణ దావత్‌ను ఆస్వాదిస్తే... నశం నసాలనికంటినట్లే...
- కె.వి.నరేందర్, 98492 20321

582
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles