ఇదేదో కవిత్వ నీడలా ఉంది!


Mon,December 17, 2018 01:35 AM

ఒక నేపథ్యాన్ని చెప్పినా, ఒక తడిగీతం ఆలపించినా, మరొక ఇప్పుడుని ఆవిష్కరించిన ఆయనకు ఆయనే సాటి.. మరోసారి ఇదేదో నెమలినీడలా ఉంది చూడమంటున్నారు ఆ వెలుతురుని.. ఆశారాజు(రాజాహైదరాబాదీ).
పరిచయం అక్కర్లేని కవి ఈయన. కవులకు ఈయన కవిత్వం బహుమానం. కలలతో ప్రయాణించడం ప్రతి కవికి అవసరమైన అభివ్యక్తి. ఈకవికి అదే గండబెండేరం. ఇదేదో కవిత్వ నీడలా ఉంది.. ఇక ఆశరాజుగారి పుస్తకం ఇదేదో నెమలి నీడలా ఉంది రచనలు సామాజిక సాంఘిక మానసిక పరిస్థితులకు అద్దం పడుతుంది. స్వానుభవాలు,సహానుభూతి అలంకారాలు ఈయన కవితల్లో ప్రత్యేకం.
idedo
చిన్నప్పుడు ఆడుకోడానికెల్తుంటే అమ్మ నా జేబులో బెల్లంముక్క పడేసేది ఓడినా గెలిచినా ఆడినంత సేపు తియ్యగా నవ్వాలని చెప్పేది.. (ఇంకా యాదికుంది కవితలో ) వారెవ్వా అమ్మ చెప్పిన సుద్దులు ఇంకా యాదికున్నాయ్ అంటారిక్కడ. ఆటలో కానీ జీవితంలో కానీ గెలు పోటములు సహజం. ఓడినా ఎవరిపై కక్ష పెంచుకోవద్దని తియ్యగా నవ్వమని అమ్మ బెల్లంముక్క జేబులో ఉంచేదని చెప్తారు. అదే తియ్యదనాన్ని పెద్దై పాటి స్తున్నా అంటూ అమ్మ చెప్పే ధైర్యాన్ని యాది చేసుకుంటారు. విరోధి అయినా తియ్యగ పలకరించాలంటది అమ్మ అంటూ అమ్మతనం గొప్పతనాన్ని చెబు తారీ కవితలో.. జేబులోని బెల్లం ముక్క గుండెకు అంటుకుంటుందేమో మనిషి కనిపిస్తే చాలు మనసు రుచి పెరుగుతుంది.. ఎంత తియ్యనైన ఊహ ఎంత తియ్యనైన మనసు. ఎంత తీపి రచన ఎప్పటికి యాదికుంటది.
కవిత్వం లేదు, కవిత్వం కాదు, కవిత్వం రాదు.. ఇలా చెప్పడంలోనే కవిత్వ ముంది. కనిపించని కోపంలో శిరసావహించే బాధ్యతుంది అర్ధం చేసుకుంటే ఎంతో బరువైంది.. (పచ్చల పిడిబాకు). నువ్వొక పచ్చని చెట్టయి తే పక్షులు వాటంతటవే వచ్చివాలతాయ్. కవిత్వమైనా అంతే అంటున్నారు ఇక్కడ కవి. వచనానికి భిన్నం గా ఉండేదే కవిత్వమంటూ.. అద్భుతంగా ఉందంటే మోసపోవద్దని బాలే దంటే కోపం వద్దం టూ పూసిన పువ్వుకు పరి మళమెంత ముఖ్యమో కవిత్వానికి ప్రేముండాలి ప్రాణ ముండాలి అని చెబుతూ కవిత్వం ఎంత గొప్పదో,ఆ కవిత్వాన్ని రాసేందుకు కవి సంగ మాన్ని సృష్టించిన కవి యాకుబ్ గారికి కృతజ్ఞతలు చెబుతారు కవి. నిజమే పచ్చలహారాన్ని మోయా లంటే గొంతుక ఉంటే సరిపోదు, దాన్నిమోసే మెడ కూడా ఉండాలి. పొదగబడిన రాళ్ళ విలువ తెలుసుండాలి.. అంటారు కవి .

నిజం చెప్పాలంటే రాసినవాడు మనిషై ఉండాలి, రాసిందంతా ప్రేమై బ్రతకాలి! మంచి నినాదం. ప్రతి కవి ఆచరించాల్సిన మాటలు. ఇప్పుడే కదా వచ్చింది అప్పుడే వేళతానంటా వేంది! ఇది నీకు తెలిసిన పాతఇల్లే పేపర్లు పుస్తకాలు పడి ఉంటాయి.. కవి ఉన్న చోట కాలుష్య ముండదులే కమ్మగా గాలి పీల్చుకో.. (చాయ్ తాగిపో) వదిలి వచ్చిన కాలాన్ని గుర్తు చేసు కుంటు స్నేహితురాలు ఇంటికొస్తే అదే భోళాతనం.. చిన్నప్పటి జ్ఞాపకాల్ని నెమరిద్దామను కున్నప్పుడు అవతల మనిషిలో కంగారు ఎదో వెలితిని గమనిస్తూ సహచరుడు అంటున్న మాటలు ఎంత బావుంటాయో. పదినిమిషాలు కూడా కాలేదు ముళ్ల మీద కూర్చున్నట్టు లేచి లేచి కూర్చుంటున్నావు కుర్చీ సదుపాయంగా లేదా.. ఒక వైపు మాట్లాడుతూ ఇంకోవైపు మనిషి పరిస్థితులను అంచనా వేయడం సరికొత్త అభివ్యక్తి. మనం మళ్లీ కలవడం ఎప్పుడో ఏమో మాకోసమైనా ఈ ఘడియను గుర్తుంచుకునేలా గడుపు.. చాయ్ వేడిగా ఉందంటూ కబుర్లను కూడా వేడిపరిచేందుకు కవి భావసంభాషణలు అత్యద్భుతం.
నా గురించి నాకు బాగా తెలుసు సీతా కోకచిలుకను కాకముందు నేను గొంగళి పురుగు నే.. (రంగులేయకముందు). అందరి కవిత్వాన్ని శ్రద్ధగా చదువుతాను అంటూ కవి మొద లు పెడతారు. రంగులేయకముందు అందరం వెలసిన గోడలమే అంటూ నేర్చుకునేందుకు చిన్న పెద్ద తేడా ఎందుకని ఆయన పెద్ద మనసుని ఆవిష్కరిస్తారిక్కడ. అరమరికలు లేకుండా అన్నింటినీ ఆదరించాలని సీతాకోకగా మారేందుకు కొంత సమయం పడుతుందని, గొంగళి పురుగు కానిదెవరని, చివరికి తను కూడా అక్కడినుండి వచ్చినవారేనని గొప్ప విలువల్ని ఈ కవిత్వంలో మనకు తెలుపుతారు. నాలుగు మాటలే ఎంత అర్థాన్ని స్ఫురించాయో, ఎంత అనుభవాన్ని విశదపరిచాయో!

నేను ఇక్కడికి వస్తానని తెలియదు తెలిస్తే, కొన్ని స్వప్నాలు తెచ్చేవాడిని రాత్రి చాలా స్వప్నాలు సీతాకోక చిలుకల్లా వెంటబడ్డాయి, తెల్లవారినంక వాటిని నిన్నటి చొక్కా జేబులో దాచాను.. ఇక్కడికి వస్తానో లేదో అప్పుడు పక్కాగా తెలియదు తెలిస్తే అదే చొక్కాను వేసుకోచ్చేవాడిని..(తెలిస్తే వచ్చే వాడిని కాదు). ప్రస్తుత సామాజిక పరిస్థితులు అద్దం పట్టే కవిత. పైసలతో కబ్జాలతో కాపురం చేసే జీవితాల్లో ఎటువంటి విలువలు లేకుండా ఉన్నారని, లాభాలతో తప్ప స్వప్నాలతో అవసరంలేని మనుషులు, కుళ్ళిపోయిన పూల వాసనే తప్ప ఏ పరిమళాన్ని వెంటతీసుకురారని, ప్రేమలేని మాటలు ఎందుకు పనికిరావని చెప్పకనే చెబుతారు. అందుకే అనవసరంగా వచ్చానని తెలిస్తే వచ్చేవాడిని కాదని వాపోతారు. కమర్షియల్ సమాజంలో ఎవ్వరూ ప్రకృతి ఆరాధనకు ప్రయ త్నించేదిలేదని, ఆర్భాటపు జీవితాలకు అలవాటుపడ్డారని.. ఇలా అని తెలిస్తే వచ్చేవాడిని కాదని చెబుతారు కవి ఇక్కడ. మత్తు కవితలో.. కవిత్వ అత్తరు సీసాలాంటిదని, ఒలికినా తెరిచినా సువాసనా కమ్మద నం విరుస్తూనే ఉంటుందని చెబుతారు. నాజూకు కవితలో పువ్వులన్నీ వాడిపోయాయి అమ్మాయిల్ని ఎడిపిస్తున్నారా అంటు కసుకాయల్ని కోసేవాల్లని చెట్టుకు కట్టేయకుండా నీడ కూర్చోబెట్టి నీతి పాటాలు చేబుతారేంటని ఘాటుగా విమర్శిస్తారు. మొద్దుబారిపోయాం కవితలో రాజ్యం గురించి సమాజం గురించి ఆలోచించనోడు కవిత్వం కథలు రాయడమెం దుకని ప్రశ్నిస్తారు. ప్రేమంటే నెహ్రూలా గుండెకు దగ్గరగా గులాబీలా ధరించడం అంటారు, మెరుస్తూ గుబాళిస్తూ జీవించడమే జీవితం అంటారు. మొత్తం 111కవితల్లో అన్నీ దేనికవి విభిన్నమైన భావనలను మనలో నింపుతాయి.
ఇదేదో నెమలినీడలా ఉంది కవిత్వ సంపుటిలో కుళ్ళిపోయిన పూలవాసన అంటూ నేటి సమాజంలో ఉన్న నకిలీలను ఎండగడతారు. ఎక్కడా కవిత్వాన్ని వదలని ఈ సంపుటి గొప్ప ది. స్పూర్తినిచ్చేది.
-సుభాషిణి తోట

1000
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles