సాహిత్య కర్తవ్యం గుర్తించిన కవి


Mon,December 10, 2018 12:53 AM

కాంచనపల్లి కథల్లో తెలంగాణ గ్రామీణ జీవితం ఉంది. తెలంగాణ భాషలో, తెలంగాణ నుడికారంతో కొన్ని కథలు కూడా కలుపుకున్న తెలంగాణ అస్తిత్వ చైతన్యంతో కూడుకున్న కథలివి. తెలంగాణలో విస్తరిస్తున్న సామాజిక చైతన్యానికి, సాంస్కృతిక చైతన్యానికి కథా సాహిత్యంలో నిక్షిప్తమవుతున్న తీరుకు ఈ కథలు నిదర్శనం. చక్కని కథలు రాసిన కాంచనపల్లికి హృదయపూర్వక అభినందనలు.

కాంచనపల్లి ప్రసిద్ధ కవి, కథకుడు. కవిత్వంలో ఏ వస్తువునైనా, ఏ శిల్పాన్నైనా ఎంత తక్కు వ నిడివిలోనైనా చెప్పడం సాధ్యం. అందువల్ల కవిత్వం విరివిగా వస్తున్నది. కథలకు, నవలలకు ఈ సౌలభ్యం లేదు. సూక్తులకు, నుడికారాలకు, పలుకుబడులకు కవిత్వం కన్నా నవలకు ఎక్కువ సౌలభ్యం ఉన్నది. అందువల్లే ఇవి కవిత్వం కన్నా విస్తృతంగా ప్రజల నాలుకలపై నర్తిస్తాయి. కవిత్వంలో ఆ స్థాయికి చేరినవాళ్లు అరుదుగా ఉంటారు. వేమన, గుఱజాడ, శ్రీశ్రీ, కాళోజీ, సినా రె, చెరబండ రాజు, అలిశెట్టి ప్రభాకర్ ఈ కోవకు చెందిన కవులు. వీరంతా ప్రాతఃస్మరణీయులు. ఆ కోవలో ముం దుకు నడుస్తున్న కవుల్లో కాంచనపల్లి ఒకరు.

కాంచనపల్లి అనేక కవితా సంపుటాలు ప్రచురించారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా కాంచనపల్లి కథల పుస్తకం వెలువడుతున్నది. కథా సంపుటిలో పన్నెండు కథలున్నాయి. సహృదయత గల మనిషి చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నిద్దుర పట్టదు. 120 ఏండ్ల క్రితం సుప్రసిద్ధ, విశ్వవిఖ్యాత రచయిత చెకో వ్ గుమస్తా మరణం అనే కథ రాశారు. సర్కస్‌లో ఒక అధికారి ముందు తుమ్మినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతోపాటు పరితపించి, చివరికి చనిపోతాడు. పశ్చాత్తాపంలో గుమస్తాలోని బానిస మనసు ఎలా ఉం టుందో చిత్రించాడు. అలాగే ఒక పొరపాటు కథలో ఒక అనుకోని పొరపాటు ఎదుటివారి జీవితంలో ఊహించని పరిణామాలు, విపత్తులు ఎలా సంభవిస్తాయో చిత్రించా రు. తన పొరపాటు గ్రహించిన మనిషి పశ్చాత్తాపంతోపాటు ప్రాయశ్చిత్తం, కర్తవ్యం, పరిష్కారం కోసం పడే తప న అద్భుతంగా చిత్రించిన కథ. సంస్కారాన్ని పెంచేదిగా సాహిత్యం ఉండాలి అనడానికి ఒక పొరపాటు కథ ఒక చక్కని నిదర్శనం. టిట్ ఫర్ థాట్ కథ కూడా సంస్కారాన్ని పెంచే, గుర్తింపజేసే కథ.

టిట్ ఫర్ థాట్ కథలో మగవారికి వర్తించేది, ఆడవారికి ఎందుకు వర్తించకూడదనే ప్రశ్న వేసుకొని జీవితంలో అలాంటి సన్నివేశాలు, సంఘటనలు ఎలా ఉంటాయో చిత్రించిన కథ. కుప్పిలి పద్మ కథలో భార్య చనిపోయి ఒక రు, భర్త చనిపోయి ఒకరు కలిసి కొత్త పెళ్లి చేసుకుంటారు. భర్త తన భార్యను నిరంతరం గుర్తుచేసుకోవడం, ఆరాధించడం కొత్త భార్యకు కష్టంగా ఉంటుంది. చూసీచూసీ ఆమె కూడా తన చనిపోయిన భర్త పట్ల గల ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తంచేస్తూ ఆరాధన పద్ధతిలో ముందు కుతెస్తుంది. దాంతో భర్త, అత్త ఆశ్చర్యపోతారు. అప్పుడు విషయం అర్థమవుతుంది. సరిగ్గా అలాగే కొత్త స్కూటర్‌పై భర్త ఎవరెవరో కొలీగ్ ఆడపిల్లలను వెనుక సీటుపై కూర్చొ ని తిరిగితే అది చూసిన భార్యకు ఎలా ఉంటుందో, ఏం చేస్తే బాగుండుననిపిస్తుందో చమత్కారంగా చెంపపెట్టులా చేసి చూపించిన కథ టిట్ ఫర్ థాట్.

జారిన స్వప్నం అనే కథ జీవితంలో చాలామంది తమకు కూడా అలా జరిగితే బాగుండునని ఊహించి ఉవ్విళ్ళు ఊరించే కథ. వీటినే నేను అందమైన కష్టాలు అం టుంటాను. అందమైన కష్టాలు ఎలా ఉంటాయో, ఎలా ఉంటే బాగుంటుందో అవి జీవితంలో మర్చిపోలేని మధు ర ఘట్టాలుగా ఎలా గిలిగింతలు పెడుతాయో జారిన స్వప్నం కథ చదివితే తెలుస్తుంది. ఒక వర్షం రాత్రి కథ లో నాన్న ప్రేమ ఎంత గొప్పదో పిల్లల కోసం నాన్న, ఇంటి వెలుపల ఎంత కష్టపడుతాడో పిల్లల్ని చూడాలని ఎంత వర్షంలోనైనా బస్సుల్లేని తమ ఊరికి వర్షంలో తడుస్తూ, నెత్తిమీద మూటతో ఎలా ఇల్లు చేరుకుంటాడో చిత్రించిన కథ. బలి బతుకు కథలో బతుకమ్మ పండుగ వస్తోంది. ఊరంతా పూలవనం తీరుగ మారిపోతున్నది. మహిళలకే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. దేశంలో బతుకమ్మ పం డుగ తెలంగాణకే ప్రత్యేకం. బలి బతుకు ఎందుకవుతుం దో, బతుకు బలవుతుందో చిన్నచిన్న కారణాలే కావచ్చు. అవెలా బతుకును బలి తీసుకుంటాయో ఒక పొరపాటు కు, బలి బతుకు, గౌరి మొదలైన కథలు తెలుపు తా యి. క్రూరమైన మనిషి ఏం చేస్తాడో, జీవితాన్ని ఎలా బలి తీసుకుంటాడో, తన స్వార్థం కోసం ఎలా బలి తీసుకుంటాడో బలి బతుకులో చిత్రించిన తీరు హృదయాన్ని కలిచివేస్తుంది.

సంధ్య కథ ఉత్తమ పురుషలో, ఫస్ట్ పర్సన్‌లో సాగుతుంది. ఒక పొరపాటు కథ కూడా ఒక పొరపాటుకు, ఒక వర్షం రాత్రి కథలు కూడా నేనుతో నడుస్తాయి. నేనుతో కథ రాయడంలో అనేక సౌలభ్యాలున్నాయి. అనేక విషయాలను విస్తారంగా చెప్పవచ్చు. నల్లాల లక్ష్మీరాజం దొర కూతురు చదువుకున్న దళిత విద్యావంతుడి పట్ల అంకురించే ప్రేమను, అలా అంకురిస్తే బాగుండుననుకునే ఆశను చిత్రిస్తుంది. ఇలా కొన్ని జీవితాల్లో ఎలా ఉం దో చెప్పడమే కాకుండా ఆ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో అనే సోషలిస్ట్ వాస్తవిక కథను ఆదర్శంగా చిత్రించారు.ఇందులోని చాలా కథలు జీవితం ఎలా ఉందో చిత్రించడంతో పాటు, ఎలా ఉంటే బాగుంటుందో అనే ఆదర్శా న్ని, సంస్కారాన్ని, మార్గదర్శకాన్ని చిత్రించి మంచి మానవులుగా ఎదుగడానికి స్ఫూర్తినిస్తాయి. సాహిత్యం సంస్కారాన్ని పెంచుతుంది. మనిషిని మనిషిగా తీర్చిదిద్దాలి. ఈ ఉదాత్త లక్షణంతో చిత్రించిన కథలే ఈ కథా సంపుటిలోని కథలు.

పాటకోసం కథలో తెలంగాణ గ్రామీణ జీవితంతోపా టు నగర జీవితం పరిణామాలను చిత్రించారు. కాంచనపల్లి పలు కథల్లో తెలంగాణ గ్రామీణ జీవితం, సంస్కృతి ఒక చైతన్యంతో ప్రత్యేక దృష్టిపెట్టి చిత్రించిన తీరు ప్రశంసనీయం.
దయ్యాలకో ఒక రాత్రి, ఆడమనసు, గౌరి కథలు ప్రత్యేకమైనవి. గౌరీ కథ ఒక రజక మహిళ గురించిన కథ. గ్రామీణ జీవితంలో కులాల వ్యవస్థ, కులాలవారీ వృత్తు లు, కులాలవారీగా మానవ సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయో చిత్రిస్తుంది. పురుగులు కథలో శాడిస్ట్ టీచర్లు ఎలా ఉంటారో చిత్రించారు. కాంచనపల్లి కథల్లో తెలంగాణ గ్రామీణ జీవితం ఉంది. తెలంగాణ భాషలో, తెలంగాణ నుడికారంతో కొన్ని కథలు కూడా కలుపుకున్న తెలంగాణ అస్తిత్వ చైతన్యంతో కూడుకున్న కథలివి. తెలంగాణలో విస్తరిస్తున్న సామాజిక చైతన్యానికి, సాంస్కృతిక చైతన్యానికి కథా సాహిత్యంలో నిక్షిప్తమవుతున్న తీరుకు ఈ కథలు నిదర్శనం. చక్కని కథలు రాసిన కాంచనపల్లికి హృదయపూర్వక అభినందనలు.
- బి.ఎస్.రాములు, 83319 66987

933
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles