తెలుగు సాహిత్య సర్వస్వం


Mon,September 10, 2018 01:07 AM

సాహిత్యంలోనే కాదు సాహిత్యాధ్యయన దృక్పథంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. అందువల్ల గత రచనల్లోని మౌలికాంశాలు కొన్ని అలాగే చెక్కుచెదరకున్నా సరిచూడవలసిన అంశాలు, సరిచేయవలసిన అంశాలు, మార్పులూ చేర్పులూ చాలా అవసరమనిపించాయి.ఆ అవసరాలన్నీ తీరేలా ప్రామా ణిక వ్యాస సంకలనాన్ని వెలువరించే కృషే ఇది. ఇది సాహిత్య చరిత్ర మాత్రమే కాదు. సాహిత్య ధోరణులు, ఉద్యమాలు, సంస్కరణలు మొదలైన ఎన్నో అంశాలతో కూడిన సమగ్రం.
sudha
సాహిత్యాధ్యయనం ఒక అందమైన ప్రయాణం. కొన్ని ప్రయాణాలు ఆనందాన్వేషణ కోసం జరిగితే, మరికొన్ని అవసరాన్ని తీర్చుకునేందుకు జరుగుతాయి. సాహిత్యాధ్యయనమూ అంతే. కొందరికి ఆనందమే ప్రయోజనం. మరికొందరికి ప్రయోజనమే ఆనందం. ఒక్కోసారి ఆనందమూ ప్రయోజనమూ కలిసి సిద్ధిస్తాయ్. బంగారానికి తావి అబ్బినట్టుగా! అలాంటి ఉభయ తారకమైన సాహితీ వ్యాస సంకలనమే ఇది.వివిధ కళాశాల, ఉద్యోగ పోటీ పరీక్షల కోసం చదివే వారికి వారి అవసరాలు తీరేలా, సాహిత్యాన్ని అభిమాన విషయంగా స్వీకరించి, తమ సాహితీసంస్కారాన్ని మరింత సుసంపన్నం చేసుకోవాలనుకునేవారికి సాహితీ కల్పవృక్షంలా చదువుకున్న వారికి చదువుకున్నంతగా తెలుగు సాహిత్యంలోని విశిష్టాంశాల్ని ఆమూలాగ్రంగా అం దించిందీ సంకలనం. తెలుగుల సాహిత్య చరిత్ర ఉందీ పుస్తకంలో..!

వేయి సంవత్సరాలకు పైబడిన భాషా సాహిత్య చరిత్ర తెలుగు వారి సొంతం. రాళ్లూ రప్పలపై నిద్రించిన శాసనస్థ తెలుగు భాష మొదలుకొని, ఆధునిక ఎలక్ట్రానిక్ సంచికలతో వెల్లివిరుస్తున్న ప్రాపంచిక భాష వరకు- భాషా పరిణామాన్ని, భాషా ప్రమాణాల ఎగుడు దిగుళ్లనూ చూస్తే విస్మయం కలుగకమానదు. నన్నయ, పాల్కురికి సోమన, శ్రీనాథుడు, పోతన, రామాయణ రచయితలతోబాటుగా అష్టదిగ్గజాలూ, దక్షిణాం ధ్ర, సంస్థాన పోషిత కవులు, కవిరాజులూ, రాజకవులూ అం దరూ ఉన్నారీ విభాగంలో. నన్నయ పూర్వపు శాసనాల కాలంనుంచి దక్షిణాంధ్ర వాజ్మయాలూ, సంస్థానాల సాహిత్య సేవ వరకు కూలంకష చర్చ ఉన్నది. ఒక్కో కాలంలో ఒక్కో ప్రక్రి య చివుళ్లు తొడిగి, మారాకులు వేసి, తీగలుగా సాగి, ఊడలు గా విస్తరించి సాహితీక్షేత్ర వైశాల్యాన్ని ఇనుమడింపజేస్తుంది.
తెలుగు భాషలో లేని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని ప్రక్రియలు ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్నవి. మరికొన్ని ప్రక్రియలు పరభాషా సాహితీ క్షేత్రాల్ని వైవిధ్య భరితం చేసేందుకు తరలి వెళ్లినవి. ఇంకొన్ని ఇతర భాషా సాహిత్యాల ప్రభావంతో తెలుగు సంప్రదాయాల్ని పుణికి పుచ్చుకున్నవి.

పురాణం, కావ్యం, ప్రబంధం, కథాకావ్యాల లాంటి ప్రాచీ న ప్రక్రియలు.., ద్విపద, శతకం, అవధానం లాంటి నిండైన తెలుగుదనపు ప్రక్రియలు.., విమర్శ, నవల, కథ, కథానిక, ఖండకావ్యం మొదలైన ఆంగ్ల భాషా ప్రభావిత ప్రక్రియలు లాంటి స్వపర సంప్రదాయాలనన్నిటినీ జీర్ణం చేసుకున్న నాట కం లాంటి ప్రక్రియలు ఉన్నాయి. ఇంకా సంకీర్తనం, వచనం, మినీకవిత్వం ఇలా ఒకటేమిటి.. సమస్త ప్రక్రియా వైవిధ్యం కొలువుదీరిందీ సంకలనంలో. సాహిత్యంలోని ప్రతి ప్రస్పుటమైన మార్పువెనుకా, ప్రగాఢమైన భావ విప్లవం చోదకశక్తిగా పనిచేస్తుంది. ఈ చోదక శక్తే సాహిత్యంలో ఉద్యమాలకూ ధోరణులకూ కారణభూతమౌతుంది.

మతావేశ స్ఫూర్తితో వెల్లువెత్తిన శివకవితోద్యమంనుండి మొదలుకొని మతాతీతంగా ఎదిగిన స్త్రీవాద, ప్రాంతీయవాద ఉద్యమాల వరకు ప్రతి ఉద్యమమూ, ప్రతి పాదమూ సరికొత్త సాహితీస్వరంగా భావ విస్తృతికి వరంగా తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపి కాలగర్భంలో కరిగిపోయిన ఉద్యమాలు మొదలుకొని కాలాన్ని దిక్కరించి వెక్కిరించిన ఉద్యమాలవరకు ఉద్యమాల బాగోగులన్నీ ఉన్నాయి పుస్తకంలో. ప్రయోగంగా పురుడు పోసుకున్న ప్రయత్నం నిలదొక్కుకొని ప్రక్రియ గా ఎదుగుతుంది. ఎదిగిన ప్రక్రియ కూడా ప్రయోగాలకు అతీ తం కాదు. ప్రయతాలు-ప్రయోగాలు-ప్రక్రియల అన్యోన్య సంబంధాలెన్నో ఈ సంకలనంలో చూడవచ్చు. ఆధునికులు విస్మరిస్తున్న జ్ఞానపథం జానపదం. జానపద జ్ఞాననిధుల్ని పట్టిచూపిన వ్యాసం, విమర్శను గురించి సంస్థానాల సాహితీ సేవలను గురించి ఉన్న వ్యాసాలు ఒక్కొక్కటి ఒక లఘు పుస్తకపు పరిమాణంలో విస్తరించాయి. వేటికవే సాటి!

తెలుగుదనాన్ని పరిమళిస్తూనే ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకోవడం తెలుగు సాహిత్యపు విశిష్టత. కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో జరిగిన సాహితీ వికాసాన్ని చర్చించిన వ్యాసాలు అమూల్యమైనవి. గతంలో కూడా సాహిత్యాభిమానులను, పరీక్షార్థులనూ దృష్టిలో ఉంచుకొని వెలువడిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఆచార్య జి.నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష లాంటివి వాటిలో ఎన్నదగినవి. సాహిత్యంలోనే కాదు సాహిత్యాధ్యయన దృక్పథంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. అందువల్ల గత రచనల్లోని మౌలికాంశాలు కొన్ని అలాగే చెక్కుచెదరకున్నా సరిచూడవలసిన అంశాలు, సరిచేయవలసిన అంశాలు, మార్పులూ చేర్పులూ చాలా అవసరమనిపించాయి.ఆ అవసరాలన్నీ తీరేలా ప్రామా ణిక వ్యాస సంకలనాన్ని వెలువరించే కృషే ఇది. ఇది సాహిత్య చరిత్ర మాత్రమే కాదు. సాహిత్య ధోరణులు, ఉద్యమాలు, సంస్కరణలు మొదలైన ఎన్నో అంశాలతో కూడిన సమగ్రం. ఏ ఒక్క రచయితో కృషి చేస్తే సరిపోదని భావించి, సాహిత్యంలోని వివిధ అంశాలలో లబ్ధ ప్రతిష్ఠులైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలనుంచి మొదలుకొని, సాహితీ రం గంలో కృషి చేస్తున్న ఔత్సాహిక రచయితలకు భాగస్వామ్యాన్నిచ్చాం.
- డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
-గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ

1692
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles