సంచారజాతుల సమగ్ర సమాచారం


Sun,August 12, 2018 11:35 PM

సామాజిక మూలాలను అర్థం చేసుకొని బాధల నుంచి విముక్తిచేసే దారులను వెతుకటమే రచయితలు చేయాల్సిన పని. ఆ పనిని జూలూరు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. ఇలా క్షేత్రస్థాయికి పోయి రచనలు చేయటం భవిష్యత్‌కు ఒక దారి చూపినట్లవుతుంది. రచయితల రచనలకు స్పందించే గుణం రాజ్యానికుండాలి.
juluri-gouri-shankar
తెలంగాణ పునర్నిర్మాణంలో అట్డడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసల్ని పొందుతున్నా యి. సంక్షేమం పునాదిగా అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం ఒక వినూత్న ప్రయత్నం. ఈ మహత్తర కార్యక్రమంలో అనేక ప్రభుత్వ శాఖలు భాగస్వాములుగా పాల్గొని తెలంగాణ సామాజిక, ఆర్థిక పురోగతికి తోడ్పడుతున్నాయనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ స్వయంగా పలు సామాజిక వర్గాల మేధావులు,ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి అణగారిన, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పథక రచన చేశాడు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర నిర్మాణం పకడ్బందీగా జరుగాలంటే తెలంగాణ సమాజంలో 90 శాతం వెనుకబడిన వర్గాల అభ్యున్న తి ఆవశ్యకమని గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగానే నిర్దిష్టమైన సంక్షే మ కార్యక్రమాల్ని 113 బీసీ కులా ల ప్రగతి కోసం రూపొందించబడినాయి. అందులో ముఖ్యంగా నిరాదరణకు, విస్మరణకు గురైన సంచారజాతుల వారి ని అగ్రశ్రేణిలో నిలిపేందుకు బీసీ కమిషన్, ఎంబీ సీ కార్పొరేషన్ ఏర్పాటుచేయడం కొనియాడదగింది.

బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ క్షేత్రస్థాయి పర్యటన జరిపి సేకరించిన సమాచారం ఆధారంగా రచించిన ఈ బీసీ కులాలు సంచారజాతులు పుస్తకం ప్రత్యేకమైనది. సాధారణంగా పుస్తకాలు, వ్యాస సంకలనాలు మేధావుల ఆలోచనావిధానాల్ని, అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తాయి. కానీ అందు కు భిన్నంగా సమాజంలో ఉత్పత్తి కులాల జీవన విధానం, వారిశ్రమశక్తి విశిష్టత, జ్ఞానసముపార్జన ప్రక్రియలో నిర్జీవమైన సంచారజాతుల పాత్ర ఎలాంటిదో ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించబడింది. క్షేత్రస్థాయి అధ్యయనం పునాదిగా ఈ పుస్తక రచన జరిగింది. దీనిలో గవర్నమెంట్ రిపోర్ట్సు, రికార్డ్సులో పొందుపరిచిన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సంక్షేమ పథకాల రూపకల్పన చేయడానికి సముచితమైన సలహాలు, సూచనలు చేయడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ లో బీసీకులాలు, సంచారజాతులకు సంబంధించినంత వర కు సమగ్రపరిశోధన, రచనలు జరుగులేదు. అనంతరామన్ కమిషన్, మురళీధర్‌రావు కమిషన్ రిపోర్టులలో బీసీలలోని సంచారజాతుల గురించిన సమాచారం లేదు. ఇంతవరకు ప్రచురితమైన పుస్తకాల్లో సంచారజాతుల స్థితిగతులు, వారిప్రత్యేకత సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక విధానాలపై సమగ్రంగా చర్చించలేదు.

గౌరీశంకర్ రచించిన ఈ పుస్తకం బాగా వెనుకబడిన బీసీ కులాలు, సంచారజాతుల కు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి విలువైన సమాచారాన్ని అందించింది. ఏసీ రూవ్‌ులో కూర్చొని అవగాహనా పత్రం రచించడంకంటే వాస్తవ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూసి రికార్డు చేయాలి అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకంలోని వ్యాసా లు ఆయన వ్యక్తిగతంగా బీసీల జీవితాల్నీ లోతుగా పరిశోధించిన అంశాన్ని తెలియజేస్తాయి. వడ్డెర, దర్జీ, మేదరి, పూసల మ్మ, మంగలి, విశ్వబ్రాహ్మణులు, వడ్రంగులు, బైల్‌కమ్మరుల జీవనస్థితిగతుల్ని కళ్లకు కట్టినట్లు చిత్రించడం ఈ పుస్తకం ప్రత్యేకత. తెలంగాణ సంచారజాతుల జోగి సంచిలోకి తొంగి చూసి, వారి సద్దిమూటను విప్పిచూసి,వారి ఆవేదనను, నిస్సహాయతను అర్థంచేసుకొని, వారి జీవితాల్లో వెలుగును నింపాలనే ఉద్దేశంతో క్షేత్రపరిశోధన జరిపి రచించిన ఈ పుస్తకం ఎంతో విలువైనది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంక్షేమ పథకాలను వాస్తవిక దృష్టితో పరిశీలించి, అమలుచేయడానికి ఈ వ్యాసాలు సాధనంగా ఉపయోగపడతాయి. బీసీ కమిషన్ సభ్యుడిగా అధికార హోదాలోనే కాకుండా ఒక సునిశితమైన సామాజిక పరిశోధకుడిగా జూలూరు రచించిన ఈ పుస్తకం బీసీల జీవనవిధానాన్ని తెలుసుకోవటానికి ఉపకరిస్తుంది.

సామాజిక మూలాలను అర్థం చేసుకొని బాధల నుంచి విముక్తిచేసే దారులను వెతుకటమే రచయితలు చేయాల్సిన పని. ఆ పనిని జూలూరు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. ఇలా క్షేత్రస్థాయికి పోయి రచనలు చేయటం భవిష్యత్‌కు ఒక దారి చూపినట్లవుతుంది. రచయితల రచనల కు స్పందించే గుణం రాజ్యానికుండాలి. కేసీఆర్‌కు పుస్తకాలు చదివే ముఖ్యమంత్రిగా పేరుంది. బీసీ కులాలు సంచారజాతులు అన్న జూలూరు పుస్తకాన్ని ఆవిష్కరించి సంచార, అర్థసంచార, భిక్షాటన కులాలను గుర్తించి వారిని బీసీ కులజాబితాలో చేర్చాలని ఆదేశించటంలో ఆ పుస్తకావిష్కరణ ఒక చారిత్రక సందర్భంగా మారింది. అది సంచారకులాలు, అర్థ సంచారకులాలకు మరువలేని రోజుగా చరిత్రలో నిలిచిపోయింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా సంచారజాతుల వారికి కనీ స కులగుర్తింపు లేక అగచాట్లకు విముక్తి లభించింది. సంచార కులాలకు అన్ని రంగాల్లో స్థానం కల్పించేందుకు వారిని బీసీ కులాల్లో చేర్చే పని మొదలైంది. ఇది నూతన అధ్యాయానికి తలుపులు తెరుస్తుంది.
- ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ 95734 05551

747
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles