చీకటిని చేతుల్లో దాచుకున్న సింగిడి


Mon,August 6, 2018 01:38 AM

వీణ కవిత్వంలో తన జీవితా నుభవమే ప్రధానమై కొనసాగుతుంది. అరుగు, చెరువు, గొంగడి, నెమలీక, బడిలేదు లాంటి కవితలన్నీ తన ప్రత్యక్షానుభవం నుంచి, జీవితం నుంచి వచ్చినవే. జీవితాన్ని కళాత్మకంగా దర్శించడం ఆమెకు తెలుసు.
SCAN
చాలా కవితా సంకలనాలు చేతికొస్తుంటాయి. అట్లాగే పుస్తకాల మీద సభల్లో మాట్లాడే సందర్భం కూడా చాలానే వస్తుంటుంది. కాని తక్కువ సందర్భాలలో ఒక పుస్తకం మీద పులకరింతతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లా డిన అంశాలను మరింత ప్రభావవంతంగా సాహిత్యాభిలాషులతో పంచుకోవాలనిపిస్తుంది. ఈ కోరిక చాలా బలంగా కలిగించిన పుస్త కం దేవన పల్లి వీణా వాణి కవితా సంకలనం నిక్వణ.వీణావాణి వుత్తి రీత్యా అటవీ శాఖ అధికారి. ఆ ఉద్యోగంలో ఉన్న అమ్మాయి ఇంత కవితా మార్దవం కలిగి ఉండటమే ఒక ఆశ్చర్యపోవ లసిన అంశం. అయితే ఆమె అటవీ దర్శనం నిత్య హరితమయం కాబట్టి కవిత్వంలో కూడా ఇదే ప్రతిఫలనం ఉందనుకోవాలి. ఈమె కవితా సంకలనమే ఒక విశేష ఆసక్తి కలిగించే విధంగా ఉంది. కవితా నిర్మాణంలో కవిత దీర్ఘ రూపం తీసుకోలేదు. అట్లాగని మరీ కురుచ గా కూడా చేయలేదు. కవిత దీర్ఘ రూపం తీసుకోవడం వల్ల సంభాష నాత్మకత, దానితో పాటు అకవిత్వమూ చోటు చేసుకొనే ప్రమాదం ఉంటుంది. విస్తృతమైన తాత్వికతను, తన జీవిత ములాలను ఈమె తన నాతి దీర్ఘమైన నిర్మాణంతో ముగించడం ఆశ్చర్యం కలిగిస్తుం ది. కవిత్వాన్ని అకారణంగా సుదీర్ఘం చేసి వివరణాత్మకంగా వస్తువు ను వ్యాసీకరించే పెద్ద కవులు మనకు చాలా మందే ఉన్నారు. వీణ తన తొలి కవితా సంపుటిలోనే ఈ వరుసలో చేరకుండా తన ప్రత్యే కతను నిలుపుకున్నది. ఒలిచినప్పుడు బయట పడే అరటి పండులా ఆమె ప్రతీకలను కొంచెం కొంచెం ఒలుస్తూ పోతే, వీణ దొరుకుతుం ది.కవిత్వ మర్మం తెలిసి పోతుంది. దేవనపల్లి కవిత్వం సరళంగా ఉం టుంది.సరళత చాటున నిగూఢమైన జీవితానుభవం దాగుంటుంది.

ఆకుల్ని చిదుముతాను/చిగురై ఎగురుతుందికొమ్మల్ని కత్తిరిస్తాను/వేర్లను విస్తరిస్తుంది.
అది మన బతుకంతా/పెనవేసుకున్న జీవితం..
చెట్టును గురించి సంస్కృత కవులు చెప్పిన శ్లోకాలెన్నో వున్నాయి. వాటిని సమకాలీన జీవన సూత్రాలతో మూల్యాంకనం చేసింది పై కవితలో.
అలాగే ఈమె నాన్న అనే కవిత చూడండి.. ఎంత సార్వత్రికత, సార్వజనీనత దాగుందో...
కురిసిన పెంకుటిల్లు/ముసురుకు వణికిన
చేతుల్ని ఛత్రం చేసి/ కాచుకున్నావు మమ్మల్ని
చూసి చూడనట్లు /కళ్ళతోని అదిలిస్తేనే కదా
ఈ నాటికి ఒద్దికగా కుదురుకున్న/వ్రుక్షాలమైంది...
ఈ కవిత చదివితే.. ఎల్లా వీలర్ విల్కోక్స్ అనే అమెరికా కవయిత్రి రాసిన ఫాదర్ పోయెమ్ గుర్తు కొస్తుంది. దైవం లాంటి కరుణ చూపే వాన్ని తండ్రి అంటుంది ఆమె. తెలుగు సాహిత్యంలో అమ్మ కవిత్వం విస్తృతంగానే వచ్చింది కాని నాన్న కవిత్వం తక్కువే. ఘంటసాల నిర్మల లాంటి వాళ్ళు ఈ ఖాళీ పూరిస్తున్నారు. వీణ కూడా ఈ పని హృదయవంతంగా చేసింది.

వీణ కరీంనగర్ (ఇప్పటి పెద్దపల్లి)జిల్లా జూలపల్లి గ్రామంలో పుట్టారు. జూలపల్లిలో కవిత్వానికి వలసినంత ముడిసరుకు బోలెడం త. తీయటి మంచినీటి వాగు, దానొడ్డుకే తీయ మామిడిపళ్ళ తోట, దాని పక్కనే తాటివనం, తరువాత స్మశానం, దానంచుకే ఆకుపచ్చని పొలాలు.. ఎన్ని సోయగాలో ఆ ఉరిలో. అన్ని పల్లెటూర్లకు మల్లె పెద్ద బడి, చిన్న బడి, హనుమంతుని గుడి, పెత్తం దార్ల దౌర్జన్యాలు, పోరా టాలు, అన్నల రహస్య సమావేశాలు, అమాయక గ్రామీణ జనుల మాటల్లో ఎన్నో కవితా విన్యాసాలు, హరికథలు, భజనలు భాగోతా లు.. పల్లె సంస్కృతిక జీవనం పుష్కలంగా ఉంది. అందుకే నేమో కోడూరి రవి, టాకూర్ భిక్షపతి సింగ్ లాంటి కవులు, గౌడ రామ స్వామి (యక్షగాన కర్త) గుడిపాటి నంబారెడ్డి (పద్యకవి) లాంటి కవులు అక్కడ పుట్టారు. చమన్ సింగ్ కూడా అక్కడివాడే.

వీణ సహజమైన జీవన విధానమే ఆమె కవితా సంవిధానం. ఆమె ను తొలిచే జ్ఞాపకాలే ఆమె అక్షరాలు. వర్గ కవులు, స్త్రీవాద కవులు, చివరికి దళిత కవుల లాగా, ఒక అప్రత్యక్ష శత్రువుపై నింపాదిగా హుంకరించడం ఈమె కవిత్వంలో అసలు కనిపించదు. తన జీవితా నుభవమే ప్రధానమై కొనసాగుతుంది. అరుగు, చెరువు, గొంగడి, నెమలీక, బడిలేదు లాంటి కవితలన్నీ తన ప్రత్యక్షానుభవం నుంచి, జీవితం నుంచి వచ్చినవే. జీవితాన్ని కళాత్మకంగా దర్శించడం ఆమె కు తెలుసు. దర్శించినదాన్ని ధన్యాత్మకంగా వ్యక్తీకరించడం తెలుసు.

ఈ సంకలనంలో తలమానికంగా చెప్పుకోదగ్గవి రెండు కవితలు. ఒకటి గొంగళి, రెండు పస్త్రం. చిక్కటి చీకటిని చేతులతో దాచుకున్న సింగిడి కాదది, చితి దాకా నడచి వచ్చే తోబుట్టువు మొదటి వాక్యం లోనే చిక్కటి చీకటి చేతులతో దాచుకున్న సింగిడి అని ఒక కాల్పనిక స్పృహ ప్రదర్శించింది. చితి దాకా నడచివచ్చే తోబుట్టువు అనే వాక్యంలో గొప్ప ఆర్తి కనబడుతుంది. ప్రతి పదంలోనూ,పాదంలో నూ భావానికి తగిన తూగు కనిపిస్తుంది. గొంగడి ఎదురు తిరిగిన కాలానికి ఎదురొడ్డిన జీవదారం అంటూ జీవదారం అనే కొత్త పద బంధంతో సాగిన ఈ కవిత ఎట్లా ముగుస్తుందో చూడండి..
ఎర్ర బిడ్డల గుండెల మీద ఎగిరిన నల్ల పతాకం గొంగడే గొంగడది..వాస్తవికతను కాల్పనిక భావచిత్రాలతో తన అనుభూతిలోకి మనల్ని తీసుకెళుతుంది ఈ కవయిత్రి. అలాగే ఈమె పస్తం కవిత హృదయములాలను కదిలిస్తుంది.
దేవనపల్లి కవిత్వంలో ఒక పారమ్యత (Trance) ఉంటుంది.
సంకలనంలో తెలంగాణ సోయి ప్రత్యక్షంగా కనిపించదు. కాని చదివినా కొద్దీ ఆమె వాడిన పద జాలంలోనూ, పద బందాలలోను, తెలంగాణ అస్తిత్వం కనపడుతుంది.
ఈమె నిక్వణను భాద్యతతో ఆదరిద్దాం.
- డాక్టర్ కాంచనపల్లి, 96760 96614

1162
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles