గడప దాటబోతోంటే నట్టింటి గూర్చి..


Mon,July 23, 2018 01:16 AM

ఒకటిమాత్రం నిజం నిజం గారూ, సాహిత్యంతో సహజీవనం చేయనివారు, సదా స్నేహం కుదరనివారు, నిత్యం సాహితీస్మరణ లేనివారు మీలాగ రాయటం అసాధ్యమనిపిస్తుంది. ఋషుల ఆశ్రమ వాటికలకు లేడికూనలు వచ్చినట్లు మీ కవితల్లోకి పాదాలు, పదాలు బలే వచ్చి చేరటం మహ బావుంది.
SCAN
కొందరికి పదాలు దృశ్య చిత్రాలవుతాయి. మరికొంద రికి దృశ్యాలు పదాలో, పదచిత్రాలో అవుతాయి. అలా తోచడం వింతకాదు.. గొప్ప దర్శనం కదా!
ఆయనేమో కుంచెతో.. ఈయనేమో అక్షరంతో.. అలాగని ఇద్దరూ కలిసిందిలేదుగానీ ఇరువురు రాసింది మాత్రం గుయెర్నికా యే! ఆయనదేమో చిత్ర విచిత్రం.. ఈయనదేమో అలాంటి దృశ్యాలను నింపిన పదచిత్రఖచితమైన కవితాసంకలనం.

ఔను నిజం శ్రీరామ్మూర్తిగారి కవితలన్నీ చదివేసరికి ఇక నాకెం దుకులెమ్మని నాతో సహా ఎవరూ అనుకోలేరని నా వరకు చెప్పగల ను. నిజానికి కవితలు శ్రీరామ్మూర్తిగారి కళ్లు మన కళ్లు తెరిపించిన వైనం అది. తెరచుకున్న కవి కన్నులు గదా మన కళ్ళనీ తెరిపించేవీ?! కళ్ళే మరి పరస్పరం కలిస్తే అన్నిటికీ అన్వయం ఏర్పడేది. ఇదే దాదా పు ప్రతి కవితా గొప్ప చూపున్న కన్నే. మరి చూసిన దృశ్యమో.. నిర్ని ద్రగా ఆలోచించేట్టు చేసేవీ.. మీరే చెప్పండి ఇంకెలా తోచనిస్తాయి ఈ కవితలు- మీకయినా, నాకయినా. నా వంటి పాఠకులు పెద్ద పెట్టున క్రిటిక్కులు కానేరకపోవడం మూలాని విమర్శ, విశ్లేషణల అంచుల నిలిచి, వాటి పేరిట కవి పెడరెక్కలు విరిచి నొసటన తుపాకీ పెట్టవలసిన ప్రొఫెషన్ పోజ్ అవసరం ఉండదు. అదేదో అలాగెలాగో లేదని అంగీకరించమనే తుది హెచ్చరికలుండవు. వుండేదల్లా కాస్తం త మనసుపెట్టి అంతరంగ సంభాషణ నిర్వహించగల కవితారూపం, గుణం కవి తన వ్యక్తిగత పూచీకత్తుగా ఇస్తే చాలు. మనసు తలుపు ఇట్టే తెరుచుకుంటుంది. న దస్తక్ జరూరీ, న ఆవాజ్ దేనా...? ఐతే బొత్తిగా కవిత్వాన్ని, దాని దినుసునీ మనం తెలుసుకోకుండా, చదవ కుండానే వట్టినే కవిని మునగచెట్టు లేత కొమ్మపైకి ఎక్కించి ఆనంది స్తే సరిపోతుందా? లేదా అర్థం చేసుకునే ఓపిక లేకనో కవితా సంకల నాలను డస్ట్‌బిన్లోకి గిరాటెయ్యడం ధర్మమా? సదసద్విమర్శ కవికి, సిసలైన పాఠకుడికి సహజ కుండలాలే అని నేను నమ్ముతా. అవి లేని పాఠకుడు నిష్పూచీగా, నిరామయంగా కవితా సంకలనం ఒకటి పుచ్చుకుని పడక కుర్చీలో బైఠాయిస్తే కవిత తనంతట తాను అతగాడి మెడకు అల్లుకుపోదు.

ఇక్కడే శ్రీరామ్మూర్తిగారి కవితలు తగు జాగ్రత్త పడ్డాయి. వసంతా న్ని, వడగాలిని పట్టించుకోనట్టుండే పాఠకుడనే కాగితపు (మర) గుజ్జు మనిషిని పలకరింపవు, ఇలాగని ఈ కవితలేవీ అదో లోకపు వెలుగు తెరల వెనక మిస్టిక్‌లా నిలచి పలకరించే బాపతు కావు. సమాజంలోని పబ్లిసిటీ సహిత హాట్ సబ్జెక్టులు ఏవో ఎంచుకుని ఆయా సమస్యల ముందు నిరసన కొవ్వొత్తులు పట్టి పెరేడ్ చేయవస లే. దవడ వాయించి లెక్కలు తేల్చమన్నట్టే వుంటాయివి. ఆ వెంట కొన్ని కవితలు వాట్ మస్ట్ బి డన్? అంటాయి. మరిన్ని అయితే మనం ముఖం చాటేసి తప్పుకోకుం డా కరుణ ముఖ్యమని చెబుతూ చీక టి వేకువలో మెలకువ తెప్పిస్తాయి.

ఈ సంకలనంలో మరెన్నెన్నో కవితలు శ్రీశ్రీ, తిలకిల నిజవారసు లుగా ప్రశ్నించినా, పెడసరంగా మాట్లాడినా, చురుక్కుమనిపించినా, చురుచురా చూసినా అవన్నీ ఏపాటి తొణికిసలేని గట్టి కవిత్వ విశుద్ద రూపాలే.. అన్నీ కవిత్వ పటుత్వ ప్రతిబింబాలే. కుప్పలకొద్దీ సరికొత్త అద్భుత పదబంధాలే. సంధించిన బాణాల్లాగే.. మన అరచేత విరి సిన పూలే.. చింతమానుకు కట్టిన ఉయ్యాలేగదా అనుకుంటే మేఘా ల అంచులు తాకే ఊపునిచ్చే కవితల పాదాలు ఎన్నెన్నో! వడివడిగా చదివి స్థిమిత పడనిచ్చే ప్రసక్తే లేదు. వీటిలో పొట్టలో పరువుకత్తి దూసుకుపోవటం, చీకటి మూకలు నిటారు నిక్కచ్చితనం గాలం జల హాసం అవర్గ స్వర్గం ఇలా ఎన్నని, ఎలాగని ఉదహరించేది?! మీరు కవితలలోని గడప దాటబోతోంటే నట్టింటి గురించి నేనెంతని చెప్ప ను చెప్పండి?! మీరు చదవండిక.

ఒకటిమాత్రం నిజం నిజం గారూ, సాహిత్యంతో సహజీవనం చేయనివారు, సదా స్నేహం కుదరనివారు, నిత్యం సాహితీస్మరణ లేనివారు మీలాగ రాయటం అసాధ్యమనిపిస్తుంది. ఋషుల ఆశ్రమ వాటికలకు లేడికూనలు వచ్చినట్లు మీ కవితల్లోకి పాదాలు, పదాలు బలే వచ్చి చేరటం మహ బావుంది. ఆ మధ్య నుంచి ఈ మధ్య వర కు మీరు శరసంధానం ఆపిన దాఖలా లేదు. నిరవధిక మనో ప్రణా ళిక సుస్పష్టంగా మీ కవితల్ని పరిపుష్టిగా, మహ ఘాటుగా నిలబెట్టిం ది. ఐతే కొన్ని కొంతకాలం క్రితం జరిగిన రాజకీయ దృశ్యాల ప్రతి స్పందనగా ప్రతిధ్వనించి పెట్టినా వాటి గురించి మరిచిపోయిన పాఠకులకు సైతం నిండు కవితాస్వరూప కాంతినే గుర్తు చేస్తాయి... కనుగప్పి వెళ్లిన అమ్మాయి కదలికలా.

ఇటీవల ఎందరో కవి మిత్రులు మొదట కొంత విరస స్వరూపం చూపించినా క్రమంగా కేవలం మనోయానం చేస్తోన్నట్టు కవితలు వెలువరిస్తోంటే, కొందరు కేవలం సామాజిక న్యాయ సంబంధంగా ఉద్యమ నినాదాల్నే కవితలన్నట్టు రాసుకుపోతోంటే మీరు మాత్రం రామ్మూర్తిగారూ పై రెండిటినీ కళారూపం దాటనీకుండా కవిత్వం ఆద్యంతం శృతిబద్ధంగా నినదించే సుదృఢ మార్గంలో చెప్పడం నాలా టి పాఠకులకు స్నేహంతో చెయి సాచినట్టనిపించింది. నాడు మీ ఎడి టోరియల్ వచనం, నాడూ, నేడూ మీ కవితలు ఆలోచనాపరులను హత్తుకొనేవే, ఆవహించి ఆవేశాన్నిచ్చేవేనండీ.. నమస్తే.
- శివాజీ

560
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles