గ్రామీణతకు పట్టం కట్టిన కూరెళ్ళ


Mon,July 2, 2018 01:44 AM

Dr-Kurella-Vittalacharya
కవి నిత్య చైతన్యశీలి. ప్రతి విషయాన్నీ పట్టించుకుంటా డు, పరిశీలనకు పెడుతాడు. ఇంకా చెప్పాలంటే స్థిరపడి న దుష్ట భావనల మీద తిరుగుబాటు చేస్తాడు. సాధారణ సమయాల్లో ఎలా ఉన్నా పరీక్షా సమయాలలో, అటో ఇటో తేల్చుకో వలసి వచ్చిన సందర్భాలోతో మాన్యులను ధిక్కరించడానికి సామా న్యుల్లో చేరిపోతాడు. I am the poet of carpentess, or the brass workers, of the day labousess, I am the poet of the low అని సగర్వంగా ప్రకటించుకున్నాడు ప్రముఖ బెం గాలీ కవి ప్రేమేంద్ర మిత్ర. సరిగ్గా ఆయనతో పోల్చదగ్గ కవి డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య. అంతసూటిగా ప్రకటించకపోయినా కూరెళ్ళ కవిత్వమంతా సామాన్యుల పక్షమే వహించింది. సామాన్యుల తరపున కవిత్వపోరాటం చేయడానికి భక్తిని రక్షణ కవచంగా వాడుకుంటారు. కూరెళ్ళ విఠలేశ్వర శతకం నుంచి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వరకు ప్రతి కవితలో దైవచింతనతో పాటు సామాజిక అన్యాయాల మీద ఎదురుదాడి కనిపిస్తుంది.

కవిగా ప్రతిష్ఠ పొందిన తర్వాత ఒక వాదం స్వీకరించ డం భాషలకతీతంగా సాహిత్యలోకంలో చూస్తున్న పోకడ. కాని కూరెళ్ళ సాహిత్యానికీ సమాజానికీ అభేదము కల్పించగలిగాడు. బాల్యానికీ, విశ్రాంత జీవనానికీ సాహిత్యం ద్వారా గొప్ప సమన్వయాన్ని సాధిం చగలిగాడు. 1950లలో పద్యం రాసి 2010లో వచన కవితను వెలువరించగలిగాడు. వస్తువు ప్రక్రియను నిర్దేశిస్తుందని కూరెళ్ళ కవిత్వ పరిణామాన్ని చూస్తే అర్థమవుతుంది.

ప్రణాళికాబద్ధంగా రాసిన కావ్యంలానే సందర్భానుసారం చెప్పిన కవిత్వం కూరెళ్ళ కీర్తి కిరీటానికి మెరుపులద్దింది. సాధారణ విషయా న్ని అసాధారణంగా చెప్పడం, తక్షణ చమత్కారాన్ని సాధించ డం కూరెళ్ళ ప్రత్యేకత. ఉపాధ్యాయుల ఔన్నత్యం మీద కవిత చెప్ప డం ఎంత సులభమో, చెప్పి మెప్పించడం అంత కష్టం. అందుకే అక్కడ తెలివిగా వ్యాజసుతినందుకొని గొప్పగా మెప్పించారు. ఈ పద్యం చూడండి..

పలుకులే రాని పాపకు పలకలిచ్చి/ అలక లేకుండ తీయని చిలుక లిచ్చి/ పలుకులను చెప్పు పండితుండు/ పనికి రాడాయె కీడు ఈ పంతులయ్య
1983లో అప్పటి విద్యామంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రామన్నపేటకు వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయులపై చిరాకుపడు తూ ఎవరయ్యా మీరు? అని చులకనగా మాట్లాడినప్పుడు డాక్టర్ కూరెళ్ళ ఇచ్చిన మనోహరమైన జవాబు చూడండి.

మేమెవరమోకాదు మీ బిడ్డల చదువు చదివించు ఆచార్యజనముమాది మేమెవరమోకాదు మీ ప్రణాళికలకు రూపము నిచ్చు అధ్యాపకులము మేమెవరమోకాదు మీ ఊరనూరనుకొలువుండు పండిత కులముమాదిమేమెవరమోకాదు మీ ప్రజాసామ్రాజ్య పాలనలో పెద్ద బలము మాది గాంధీజీ గుర్వుబాల గంగాధరుండు స్టాలిను ప్రశంసల గొనిన సర్వేపల్లి వారుపాధ్యాయులే వారి వారసులమె మేము, మంచినే మాదు ప్రేమించుమతముడాక్టర్ కూరెళ్ళ 8వ తరగతిలో ఉండగా బాల కవిగా 1954లో రాసిన వర్ష బీభత్సం కవిత ఆయనలో నిద్రాణమైన కవితావేశానికి తార్కాణం. ఉరుము మెరుపులు నొకసారి ఉద్భవించెనన్న గీతం పద్యంపై ఆనాడే కూరెళ్ళకున్న పట్టును మనకు పట్టి ఇస్తుంది.ఒక్క వైపున పిల్లలు, నొక్కవైపు తల్లులొకవైపు ముల్లెలు, దారుణమ్ము గాశవమ్ము లొకరికి నక్కొరులు గాక బ్రతికి చచ్చిరి, చచ్చిరి బ్రతికి చితికి ఉరుము మెరుపులు నొకసారె ఉద్భవించె సుడిగాలి మేఘముల్ గప్పుకొనియె సురవిధారగ వర్షంబు కురియుచుండె అల్ల తెలగాణ రఘునాధ పల్లియందు ఇది కూరెళ్ళ తక్షణ స్పందనకు బాల్యంలోనేగల కవిత్వ స్ఫూర్తికి ఉదాహరణ. 1958లో విఫలమైన ఒక పేరివిజన్ కమిటీని హేళన చేస్తూ..తొమ్మిదవ వెల రానిదే తొందరంచు మనది పే కమిటి ఎనిమిది మాసములకే ప్రసవమయ్యెను శిశువుకు ప్రాణిలేదు మళ్ళి నీళ్ళాడవలసిన మాయ వచ్చె అని రాశారు.రవీంద్రభారతిలో డాక్టర్ సి.నారాయణరెడ్డి, సహజకవి మల్లెమా ల, ఉండేల మాలకొండారెడ్డి, రావూరి భరద్వాజ, సాహిత్య బ్రహ్మ వి.వి.ఎల్.నరసింహారెడ్డి మొదలగు సుప్రసిద్ధ సాహితీమూర్తుల సమక్షంలో విశ్వజ్యోతి పురస్కార ప్రదానం సందర్భంగా తమ గురువు సినారెపై డాక్టర్ కూరెళ్ళ ఆశువుగా చెప్పిన పద్యం ఆయన సాహిత్యాభిమానానికి, గురమాన్నతకు కొలమానం.

ఆయన మా తెనుంగుసిరి, ఆయన మా తెలగాణ బిడ్డ, నా రాయణ రెడ్డి మాన్య కవిరాజు రసార్ద్రుడు, జ్ఞానపీఠి, ఆత్మీయగురుండు, మాతెలుగు తేజము మాయెడ ఎల్ల
ప్యాయతతోడ నుండెడి మహాకవినే ప్రణమిల్లిమొక్కదన్ ఆశు కవిత్వం చెప్పగలుగడం, పద్యకవిత్వపు అనర్గళధార చాలా మందిలో ఉంటుంది. శుద్ధకవులకూ తెలుగు సమాజంలో కొరత ఉం డదు. కొందరు సంస్థల నిర్మాణంపట్ల ఆసక్తి చూపుతారు. పైన చెప్పిన ఏ ఒక్క రంగంలో కాసిన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చినా వాళ్లలో వినమ్రత మాయమవుతుంది. దీనికి పూర్తి విపర్యయంగా ఉండగలుగడమే కూరెళ్ళ గారి విశిష్టత.డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య పుట్టింది, పెరిగింది, చదివింది, చదివించిందీ గ్రామాల్లోనే. ఆయన తన జీవిత గమ్యాన్ని ఏర్పాటుచేసుకున్నది కూడా ఒక మామూలు పల్లెటూరు. మండల కేంద్రం కూడా కాని వెల్లంకిలో. అది ఆయన సొంత ఊరు. నివసించేది పూర్వీకుల నుంచి వచ్చిన పెంకుటింటో.్ల అదిప్పుడు ఆయన ఇల్లు అనడం కంటే కూరెళ్ళ గ్రంథాలయం అనడం సబబు. అంతగా తన ఊరిని ప్రేమిస్తాడీ కవి.కవి, రచయిత, పరిశోధకుడు, ఉద్యమకారుడు, సారస్వత సంస్థల వ్యవస్థాపకుడు, గ్రంథాలయోద్యమకారుడు అయిన కూరెళ్ళ పల్లెలో ఉండటం ద్వారానే ఆయన చెప్పదలుచుకున్నది సమాజానికి చెప్పా డు.పల్లియలోనే పుట్టితిని పల్లియమే నను పెంచే, పల్లియే ఇన్లును వాకిలిన్ కలిమినిచ్చే బతుక్కు మెరుంగుపెట్టి, ఆ పల్లియే అమ్మ ఆవనుచు పల్కులు పలకగ నేరిపించే, నా పల్లియె నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వరా!ఇంత దృఢచిత్తం గలగడానికి కారణం ఆయన నిసర్గ జీవన నేపథ్యమే.డాక్టర్ కూరెళ్ళ 1938 జులై 9న వెల్లంకిలో జన్మించాడు. తల్లిదండ్రులు కూరెళ్ళ లక్ష్మమ్మ-వెంకటరాజయ్య. తెలుగు సాహిత్యంలో చేసిన పరిశోధనకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ అం దుకున్నారు. వివిధ స్థాయిల్లో ఉపాధ్యాయ, అధ్యాపక వృత్తి నిర్వహి స్తూ తెలుగు సాహిత్యానికి గణనీయమైన సేవ చేశారు. విఠలేశ్వర శతకం. స్మృత్యంజలి, కాన్ఫిడెన్షియల్ రిపోర్టు, గోవిలాపం, తెలంగాణోద్యమ కవితలు ఎన్నదగిన రచనలు. రెండు డజన్ల వరకు గ్రంథా లు రచించిన కూరెళ్ళ వందలాది మంది శిష్యులను కవులు, రచయితలుగా తీర్చిదిద్దారు. ఆయన రచనలపై కీ.శే. డాక్టర్ నాగపురి శ్రీనివాసులు, రెబ్బ మల్లికార్జున్ పరిశోధనలు నిర్వహించారు. డాక్టర్ కూరెళ్ళ జీవితాన్నే ఇతివృత్తాలుగా స్వీకరించి ఏడుగురు కవులు కావ్యాలు రాశారు. అలనాటి వినమ్రధిక్కార స్వరంతో పోతనను గుర్తుకుతెచ్చే కూరెళ్ళను ఉద్దేశించి ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన ఈ కింది వాక్యాలు ప్రత్యక్షర సత్యాలు.

భగవత్ సృష్టి చాలా విచిత్రమైనది. మానవులు సుఖాల్లో పుట్టి, సుఖాల్లోనే మగ్గేవారు. కష్టాల్లోనే పుట్టి, కష్టాల్లోనే మగ్గేవారు చాలామంది కనబడుతారు. సుఖజీవులకు కష్టం విషయం, కష్టజీవులకు సుఖం విషయం తెలియదు. సుఖ దుఃఖాలు సమంగా భావించి కష్టపడే సుఖజీవులు సుఖించే కష్టజీవులు అరుదుగా ఉంటారు. అట్టి అరుదైన వ్యక్తులు ఒక ఆదర్శం కోసం, ఒక ఆశయం కోసం, ఒక ధ్యేయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ఇతరులను ఆనందింపజేస్తూ ఉంటారు. అట్టి అరుదైన వ్యక్తుల్లో మన కూరెళ్ళ విఠలాచార్య ఒకరు.
- డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, 89788 69183
(డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్యకు ఈ నెల 9 నాటికి
ఎనభై వసంతాలు నిండుతున్న సందర్భంగా..)

652
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles