బడుగు కలాలను గుర్తించని పెద్దలు


Sun,July 1, 2018 11:38 PM

దేశంలో 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, అట్టడుగు కులాలు, సంచార జాతులకు సంబంధించిన సాహిత్యం లేకుండా దేశ సాహిత్యం ఎట్లా సమగ్రతను సాధించగలుగుతుంది. సంపద పంపకంలో ఈ వర్గాలకు ఎలాంటి నష్టం జరిగిందో సాహి త్య లోకంలో కూడా బహుజన కవులకు అంతే స్థాయిలో తీవ్ర నష్టం జరిగింది. 90 శాతం మంది ప్రజల సంస్కృతి, కళలు, సాహిత్యాన్ని విస్మరించి 10 శాతం మంది ఆధిపత్య వర్గాల సాహిత్యమే అధికారికంగా చెలామణి కావటం ఆశ్చర్యకరం.

తెలుగు సమాజంలో సామాజిక ఉద్యమాలు సాహి త్యం అన్నదాన్ని బహుజనులు లేకుండా చూడలేం. దళిత బహుజన మైనార్టీలంతా తెలుగు సమాజంలో అన్నిరకాల ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాడారు. సాహిత్య సృష్టి చేశారు. సాంస్కృతిక దండోరాను మోగించారు. నిజాం రాష్ట్రాంధ్ర మహాసభల నుంచి మొదలైన బండియెనక బండి కట్టి/ పదహారు బండ్లు కట్టి/ ఏ బండ్లో వస్తవు కొడుకో నైజాం సర్కరోడా అన్న గీతం నుంచి దళిత బహుజన స్వరాలు కంఠం విప్పాయి. నిజాం వ్యతిరేక పోరాటంలో, బాంఛన్ దొర బతుకుల్ని ధిక్కరిస్తూ కొనసాగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో తిరుగబడ్డ తెలంగాణ చరిత్రంతా దళిత బహుజన వర్గాలదే. ఆ కాలంలో ఎంతో సామాజిక స్ఫూర్తితో పోరాట సాహిత్యం వచ్చింది. మూగగొంతుక ల తిరుగుబాటు స్వరం ఆ పోరాట కాలంలో పాటగా, నవలగా, కథ గా, కథానికగా, బుర్ర కథగా పలురూపాల్లో సృష్టించబడింది. ఈ పోరాటం అట్టడుగువర్గాల పేదలకు సంబంధించిన భూమి పోరా టం మాత్రమే కాకుండా అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటంగా కొనసాగింది.

ఈ నేల మీద ఎగిసిన తొలి ప్రజా సాయుధ ఉద్యమాన్ని సామాజిక కోణంలో చూడవల్సి ఉన్నది. అయితే ఆ సాయుధ పోరాటాని కి అతి కీలకంగా నిలిచిన వర్గమంతా దళిత, బహుజన, గిరిజన, ఆదివాసీలే. దీన్ని సాయుధ పోరాటంగానే చూశారు కానీ బహుజనుల ఆత్మగౌరవ సామాజిక ఉద్యమంగా చూడటానికి ఇష్టపడలేదు. తిరుమలి తిరుగబడ్డ తెలంగాణ అన్న సిద్ధాంత గ్రంథంలో మాత్రం ఈ పోరాటమంతా అట్టడుగువర్గాల నల్లదేహాలదేనని నిరూపించా రు. ఈ పోరాటాన్ని కొసాగించిందంతా బహుజనులేనని తిరుమలి తన సిద్ధాంత గ్రంథంలో ప్రతిష్ఠించారు. దాని తర్వాత 1969లో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో వచ్చిన సాహిత్యం ఉంది. తెలుగు సమాజంలో దూసుకువచ్చిన అభ్యుదయ రచయిత ల సంఘం (అరసం), విప్లవ రచయితల సంఘం (విరసం) కొంత అలజడిని సృష్టించాయి. విప్లవాగ్నులను పుట్టించాయి. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని మాత్రం ప్రత్యేకంగా అవి గుర్తించలేదు. ఈ కులాల గుర్తింపును ప్రతిష్ఠించలేదు. ఈ దేశంలో జరుగాల్సిన సామాజిక ఉద్యమాలకు ప్రాణమైన దళిత, గిరిజన, ఆదివా సీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని గుర్తించలేదు.

కారంచేడు సంఘటనతో తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమా లు మొదలయ్యాయి. ఆ నేపథ్యంలోనే దళిత సాహిత్యం వచ్చింది. దళిత సాహిత్యం విస్తృత నదిలాగా ఉప్పొంగింది. చిక్కనవుతున్న పాట సంకలనంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కవులు సంయుక్తంగా దళిత సాహిత్యాన్ని ఆవాహన చేస్తూ సాహిత్య సృష్టి చేశారు. ఈ నేప థ్యం నుంచి వచ్చిన దళిత సాహిత్యం నుంచి మాదిగ దండోరా ఒక పాయగా సాహిత్యంలో జెండా ఎగురవేసింది. స్త్రీ వాద సాహిత్యం వచ్చింది. దళిత స్త్రీ వాద సాహిత్యం వచ్చింది. ముస్లింలు మైనార్టీ సాహిత్యాన్ని సృష్టించారు. ఎస్టీలు, ఆదివాసీల నుంచి గిరిజన ఆదివాసీ సాహిత్యం వచ్చింది. వీటన్నింటికి సంబంధించి సామాజిక ఉద్యమాలు వచ్చాయి. బీసీలకు సంబంధించిన ఉద్యమాలు వచ్చా యి. అప్పటివరకు సాహిత్యంలో ఉన్న పాత ధోరణులన్నింటిని పక్క కునెట్టి పారేసి, కొత్త నీటిజల పుట్టినట్లుగానే దళిత బహుజన సాహి త్యం వచ్చింది.

పేదలంతా ఒక్కటే, బాధలన్నీ ఒక్కటికాదు అన్న స్ఫూర్తితో బాధల్లో ఉన్న తారతమ్యాలను కూడా లెక్కగట్టి బహుజన దళితవా ద సాహిత్యం వచ్చింది. ఇవన్నీ విప్లవోద్యమం, విరసం దశాబ్దం తర్వాత వచ్చిన సాహిత్య ఉద్యమాలుగా చూడాలి. అంటే ఈ సమాజంలో ఉన్న ప్రధాన వాదాన్ని, ప్రధాన జీవన స్రవంతికి సంబంధించిన విషయాలను విస్మరించి అగ్ర వర్గ, వర్ణాలు తమ ఆధిపత్య సంస్కృతిని, సాహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీన్ని దళిత బహుజన కలాలు ప్రశ్నించాయి. అసలు సామాజిక ఉద్యమాలంటే అవి మా కోసం జరిగేవి, బహుజనుల కోసం జరుగాల్సినవని ఈ సామాజిక ఉద్యమాల సాహిత్యం కుండ బద్దలుకొట్టినట్టు చెప్పింది. బహుజన ఉద్యమ తాత్త్వికత వచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రధాన భూమిక అయిన బీసీల సాహిత్యం ఈ అన్నివాదాల్లో కీలకంగా ఉన్నది. కానీ బీసీ వాదంగా వాళ్లు తమను తాము ప్రత్యేకంగా చూసుకోలేదు. అన్నీ సాహిత్య ఉద్యమాలకు బీసీ లే ఇరుసులుగా నిలిచారు. అసలు వీళ్లు లేకుండా తెలుగు సాహిత్య మే లేదు. బహుజన తాత్త్వికత వచ్చిన తర్వాత మొదలైన పలు ప్రశ్నల నుంచి బీసీ కవిత్వం, బీసీ సాహిత్యం ప్రత్యేకంగా వచ్చింది. అదిప్పుడు సమాజంలో ఉన్న ప్రధాన జీవన స్రవంతికి చెందిన బీసీ వాదం వచ్చింది. దీన్నాపటం ఎవరితరం కాదు. బీసీల్లో ఎందరో రచయితలు, కవులు, కళాకారులు, మేధావులున్నారు. దళిత, బహుజన తాత్త్విక చింతనతో బీసీ మేధావులు, సాహితీవేత్తలు ఎందరో ఉన్నారు. బీసీల ఎజెండానే ఈ దేశం ఎజెండా. బీసీలు లేకుండా ఏ ఉద్యమం లేదు. ఏ సాహిత్య ఉద్యమం లేదు. అందరినీ ఐక్యంగా ఉంచటానికి బీసీలు ఒక పునాదిగా, ఒక ఇరుసుగా ఉన్నారు. అందరికీ మధ్యవర్తిలాగా ఉన్నారు. పెద్దన్నల్లాగా ఉన్నారు. కానీ తమది బీసీ సాహిత్య ఉద్యమమని వాళ్లు ప్రతిష్ఠించుకోలేదు. కానీ భవిష్యత్తులో బీసీలదే మహోద్యమం. బీసీ సాహిత్యం కుప్పలు తెప్పలుగా ఉన్నది. బీసీ సాహిత్యాన్ని ఒక ప్రధాన ఉద్యమంగా ఇప్పటివరకు ఏ ఆధిపత్య సాహిత్యం గుర్తించలేదు. కానీ బీసీలదే తెలుగుసాహిత్యంలో ప్రధాన సాహిత్య స్రవంతి.

తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో ఎగిసిన సాహిత్యమంతా దళిత బహుజన మైనార్టీవర్గాల కవుల కలాలనుంచే సృష్టించబడింది. తెలంగాణ అస్తిత్వ సాహిత్య ఉద్యమం గొప్ప సామాజిక ఉద్యమం. ఈ సామాజిక ఉద్యమం ప్రపంచ అస్తిత్వ సామాజిక ఉద్యమాలకు జెండాను, ఎజెండాను అందించింది.

ప్రతి కాలానికి రక్త ప్రసరణ మేమే, జీవనాడులు మేమే. గతంలోని వేల ఏండ్ల కాలాన్ని నిలబెట్టింది మా బహుజనుల చేతులే. కానీ ఆ బహుజనుల రక్తనాళాలుగా నిలువాల్సిన సాహిత్యం, బహుజన సమాజ కవుల సాహిత్యం ఈ సమాజమంతా నిండి ఉండాలి. దానికెవరు అడ్డుపడ్డారు. ఇప్పటికీ తెలివిగా బహుజన వర్గాల మెయిన్ స్ట్రీవ్‌ుగా నిలువాల్సిన సాహిత్యాన్ని పక్కదారి పట్టించి ఎట్లా మాట్లాడగులుగుతున్నారు? దీన్ని ఏ ఆధిపత్యం తొక్కిపెడుతుంది. ఇప్పటిదాకా బహుజనులపై సహానుభూతి వ్యక్తంచేసి విప్లవకవులు గా చెలామణి అవుతున్నారు. దీన్ని ఎవరు తొక్కి పెట్టారు? సమాజ కవులను విస్మరించి ఇప్పటిదాకా ఏ ఆధిపత్యవర్గాల సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ వచ్చారన్నది తీస్తే సాహిత్యరంగంలో మెజార్టీ ప్రజల కలాలను ఎంతగా తొక్కివేశారో తెలుస్తుంది. ఈ లెక్కచూడకుండా తెలుగు సాహిత్యాన్ని అంచనా వేయలేం. దాన్ని తేల్చకపోతే తెలుగు సాహిత్యానికి విస్తృతే లేదు.

ఈ దేశంలో ఉత్పత్తి సంబంధాలపై కొన్ని ఆధిపత్యవర్గాల పట్టు న్నది. దీన్ని ఈ దేశ మార్క్సిస్టులు అంతగా పట్టించుకోలేదు. కానీ, మార్క్సిజం ద్వారా ఆధిపత్యవర్గాల కులాల పునాదులు పెకిలించవచ్చునని మాత్రం బహుజనులు పోరాటాల్లోకి దూకి త్యాగాలు చేశా రు. చివరకు త్యాగాలన్నీ బహుజనులవి కాగా పోరాటాల ఫలితాల భోగాలన్నీ ఆధిపత్య కులాలే అనుభవించాయి. మార్క్స్ చెప్పిన వర్గాల మధ్య సిద్ధాంత పోరాటంలో కళ ఒక ముఖ్యమైన ఆయుధమన్నది నిజం. కానీ ఇక్కడ వర్గం కులంగా ఉన్నప్పుడు దాన్ని చూడవలసిన కోణం ఏమిటీ?

బుద్ధుని ప్రబోధాల నుంచి సమాజ మూలాలను వెతుక్కోవాలి, ఆ పాఠాలు నేర్చుకోవాలి. బహుజన హితాయ, బహుజన సుఖా య అన్న దృక్పథాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. మహాత్మాజ్యోతిభాపూలూ, బాబాసాహెబ్ అంబేద్కర్‌లు చూపిన దారిలో నే ఈ దేశంలో బహుజనుల ఆలోచనలు పదునెక్కాలి. మనకున్న సమస్తకళలు, సమస్త సాహిత్యం అవి బహుజనుల కోసం సృష్టించబడి, బహుజనుల కోసం ఉపయోగపడాలి. ఈ ప్రధాన జీవన స్రవంతిని వదిలివేసి సాహిత్యం ప్రయాణం ఎంతచేసినా మన సాహిత్యం సమగ్రం కాదు. అందరి సాహిత్యమే సమాజ సాహిత్యం అవుతుంది. ఆ కోణంలో చేసిన రచనలే సమాజ రచనలవుతాయి. వాళ్లే సమాజ కవులవుతారు.

దేశంలో 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, అట్టడుగు కులాలు, సంచార జాతులకు సంబంధించిన సాహిత్యం లేకుండా దేశ సాహిత్యం ఎట్లా సమగ్రతను సాధించగలుగుతుంది. సంపద పంపకంలో ఈ వర్గాలకు ఎలాంటి నష్టం జరిగిందో సాహి త్య లోకంలో కూడా బహుజన కవులకు అంతే స్థాయిలో తీవ్ర నష్టం జరిగింది. 90 శాతం మంది ప్రజల సంస్కృతి, కళలు, సాహిత్యాన్ని విస్మరించి 10 శాతం మంది ఆధిపత్యవర్గాల సాహిత్యమే అధికారికంగా చెలామణి కావటం ఆశ్చర్యకరం. ఇది గతానికి ఆగ్రహంతో వేస్తున్న ప్రశ్న మాత్రమే కాదు, వర్తమానంలో ఏం చేయాలోనన్న దానికొక దారి వేసుకోవాలి. ఇందుకు గతం మెడలు విరచవలసివస్తే విరచకతప్పదు. వర్తమానాన్ని ఈ 90 శాతం చెమట చేతులకిచ్చి భవిష్యత్తును అంటరాని వసంతాలుగా విరబూయించాలి.
సరిగ్గా మూడు వందల ఏండ్ల కిందట ఆధిపత్య వర్గాలను ధిక్కరిస్తూ పోతులూరి వీరబ్రహ్మం ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రతిష్ఠి స్తూ సామాజిక ఉద్యమకారునిగా, కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా సామాజిక మూలాల ప్రచారకునిగా వచ్చారు. తెలుగు సంప్రదాయ సాహిత్యకారులు, అభ్యుదయాల గురించి వాదించేవారు కూడా పోతులూరిని ప్రతిష్ఠించలేదు. వేమనను, పోతులూరిని పక్కనబెట్టి తెలుగు సాహిత్యంలో సామాజిక ఉద్యమాలను మాట్లాడుతారు. పోతులూరిని విశ్వకర్మ కులస్థులకే పరిమితం చేయటం మరిపెద్ద కుట్ర.
- జూలూరు గౌరీశంకర్, 94401 69896

577
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles