సంభాషణ..


Sun,July 1, 2018 11:23 PM

Naa-sambhaashana
మన సంభాషణేదీ మొదలుకాలేదు ఏ ప్రియమైన మాట మన మధ్య ఒదిగిపోనూలేదు నువ్వో తీరం.. నేనో తీరమైసమాంతరంగా నడుచుకుంటూ వచ్చాంకెరటాలమై తీరానికెప్పుడు తిరిగిపోలేదు.. అగాథాల అనాదికాలం ఆదిమ విశ్వపు అంచుల్నించి వచ్చాం.. మనమేమీ మాట్లాడుకున్నామో..మన ఊసులేమిటో.. బాసలేమిటో గుర్తేలేదు..ఎండిపోయిన పెదవంచులు ఆకలితో కాలిపోయిన కడుపులు మనమో దగ్ధమైన రాత్రి మన సంభాషణ ఒక కాలిపోయిన వెన్నెల.. పురా కాలపు మాటల చిలుకలు నిశ్శబ్ద మోహాల నిశీ రాత్రులు..అనంత మంత్రదీక్షల ఆదిమ మార్మికత మన సంభాషణ.. తుంచి తుంచి అడగలేని రహస్య రక్తస్పర్శ మన సంభాషణ ఆ మొదటి మోహ నిశ్శబ్దపు శిలాశాసనం ఏ పురాతత్వవేత్త శోధించని నా రాతిగోడల హృదయం దిగంతానికేగి కాలపు ఒడిలో రాలిపోయిన పుప్పొడిసద్దుమణగని స్మరణ.. తడిలేని కాలనాళికపై గీసిన పిచ్చిగీతల సంస్మరణనా సంభాషణ..
- కాంటేకర్ శ్రీకాంత్, 80086 68285

367
Tags

More News

VIRAL NEWS