తొలి వెలుగురేకలు తంగెడుపూలు!


Mon,June 25, 2018 01:47 AM

రెప్పల మాటున పడుకున్న నిప్పును లేపకండి!/ తలలెత్తే ఆగ్రహానికి తలుపులు తీయకండి!.. అంటూ, నాటి (1969) నివురుగప్పిన నిప్పులాంటి తెలంగాణ ఉద్యమ లక్ష్యాన్ని ప్రతీకాత్మకంగా చెప్పారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో మిత్రులతో కలిసి తెలంగాణం పేరుతో రెండు కవిత్వ బులేటిన్లను ప్రచురించారు. దీనివల్ల భువనగిరిలో అరెస్టు అయి, నల్లగొండ జైలులో నెల రోజులపాటు నిర్బంధంలో ఉన్నారు. బాల్యంలోనే (పద్యాలలో) శశి అనే శతకం, బాలగేయాలు రాశారు. గోపి గారు వచనకవిత్వం వైపు మరలడానికి, సినారె కవిత్వప్రభావమే కారణం.
Acharya_Gopi
స్వస్థాన వేష భాషాధికమైన స్థానీయ సంస్కృతిని అభిమానించే, ఆత్మగౌరవ ప్రకటనగా భావించే గోపి దృక్కోణ తొలి ప్రతిఫలనం తంగెడుపూలు. సినారె గారు బాల్యంలోనే కవిత్వం రాయాలనీ, మంచికవిగా పేరు ప్రతిష్ఠ లు పొందాలనీ, సత్కారాలు అందుకోవాలనీ కోరుకున్నారు. అలాగే వారి శిష్యులైన గోపి గారు కూడా ఇంజినీరింగు కాలేజీలో సీటు వచ్చినా బీఏ, ఎంఏ లు చదివి సినారె లాగే కవిత్వం రాయాలని ఆశించారు. తిరిగి పట్టుబట్టి బీఏ లో చేరారు. అక్కడి నుంచే వారి కవిత్వ ప్రస్థానం ప్రారంభమైంది.
ఒక విలువైన గమ్యం కోసం/ఎప్పటికీ నేను నిటారుగా నిలబడతాను ముందుకు వెడతాను! అని చెప్పిన ఆశావాది గోపి. ఆ ఆశావాదమే, ప్రగతిశీల మానవతా వాదమే ఆయన కవితాత్మ. మొత్తం గా చూడడం నేర్చుకో/నీ నవ్వు సడన్‌గా ఆగిందంటే / కనిపించని చెయ్యేదో నొక్కుతుంది చూసుకో! అన్నారు. కొన్ని వ్యవస్థలలోని విషవృక్షపు మూలాలు, పైకి కనిపించవు అనీ వాటిని కనుగొన్నప్పుడే పరిష్కార మార్గాలు తెలుస్తాయనీ సూచించారు. మొత్తంగా చూడ టం నేర్చుకోవడం అంటే, ఆర్థిక సంబంధాలు సమస్త వ్యవస్థలనూ నిర్దేశిస్తున్న క్రమాన్ని తెలుసుకోమని చెప్పడమే!

మారు మూలల చీకట్ల మీద/సూర్యకాంతులు కురియనీ!/ అప్పుడు నీ చైతన్యం కొత్తలోకాన్ని స్ఫురిస్తుంది!.. మానవత్వం పెరిగినప్పుడు మనిషి చైతన్యం విస్తరిస్తుందనీ, ఆశలను వెలిగించే వేకువ శిశువు లేలేత కిరణాలు దర్శనమిస్తాయనీ చెప్పారు. ఏనాటికైనా ఆకులన్నీ ఏకమవుతాయి! / పట్టాలపై గుట్టలుగా పురుకొని / పట్టపగ్గాలు లేని రైలును పట్టుకొని ఆపుతాయి!.. అంటూ పీడకుల పీడితుల మధ్య ఘర్షణను సూచిస్తూ, ఏనాటికైనా పీడితుల పోరాటం విజయం సాధిస్తుందని ధ్వనించే ఈ వాక్యాలు ఎప్పటికీ ప్రాసంగికత కలిగినవే. పట్టపగ్గాలు అనే మాట ద్వారా, పొగరుబోతు పశువు అనే ఉపమానం పరోక్షంగా స్ఫురింపజేయబడింది. ప్లాటుఫారం మీద రాలిపడ్డ/ఎండుటాకుల జాలి గలగలలు! అనేవి ఈ కవిత ఆరంభవాక్యాలు. ఈ కవిత ఆద్యంతాల మధ్యన ఉన్న సమన్వ యం, ఎండుటాకులు అనే సార్థకమైన శీర్షికను గమనిస్తే, ఆనాటికే గోపిగారికి వచనకవితా నిర్మాణ శిల్పదృష్టి ఉన్నట్లు తెలుస్తుంది.

పిట్టలు అనే కవితలో పిట్టలన్నీ చెట్ల కింద చేరి/ చితుకులన్నీ ఏరి నిప్పంటించాయి! / చెట్ల కింద నిలువునా మంటలు! / చెట్ల కళ్ళల్లో ఊపిరి నిండా సెగలు, పొగలు! అన్నారు. చెట్టును బూర్జువా వ్యవస్థకు, పిట్టలను పీడితులకు సంకేతించారు. వర్గచైతన్యం వ్యాప్తి చెం దు తున్న దశలో, విరసం ఆవిర్భావ నేపథ్యంలో రాసిన ప్రతీకాత్మక కవిత పిట్టలు. కత్తికీ మిత్తికీ కలహం రావాలి!/కత్తి కొత్త సిద్ధాంతాన్ని వెలిగించే వత్తిగా మారాలి! మొదలైన వర్ణనలలో, నాటి సాయుధపోరాట భావ ఛాయలను గమనించవచ్చు.
ఈ సంపుటిలో ప్రత్యేకంగా పేర్కొనవలసిన కవిత గోడలు. మాకు గోడలు లేవు!/గోడలను కూలగొట్టడమే మా పని! (వ్యత్యాసం కవిత) అనే శ్రీశ్రీ మాటలకు పొడిగింపే గోపిగారి గోడలు కవిత. గోడలు మొదలుకొని, ఈ కవితలో ప్రస్తావించబడిన అంశాలన్నీ ప్రతీకాత్మకమైనవే. గోడను ఖాతరు చేయని వాడొకడు/గోడను దూకేస్తాడు సాహసంగా!/గోడను ఢీకొని గాయపడుతాడు ఇంకొకడు!/పెచ్చులూడే భాగాలముందు/సిమెంటుతో సిద్ధంగా ఉంటా రు తాపీ శాస్త్రులు!..అనే మాటలు స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పటికీ (ఇప్పటికీ) గోడలను కాపాడాలని ప్రయత్నించే వారికి సంకేతా లు. దొంగచూపులు, గుతలు! అటూ ఇటూ చూసి, ఓ కంత గుండా అవతలికి!/ గోడవతలి వాళ్ళంటే కోపం! / గోడకవతలే మరి వాళ్ళ ప్రాణం!.. ఆర్థికంగా కాస్త బలపడగానే, బడుగు వర్గాల వారుకూ డా, కొందరు అగ్రవర్ణాల వారి దుర్గుణాలను అలవరచుకోవడం, ఒకప్పటి తమ తోటి బలహీన వర్గాల పోరాటాలనూ, ప్రయోజనాలనూ ఉపేక్షించడం, కొందరు అగ్రవర్ణాల వారిలాగే వివక్షను పాటించడం.. మొదలైన అంశాలను ప్రతీకాత్మకంగా వ్యక్తీకరిస్తున్నాయి. కుల, ఉపకుల, మత భేదాలు సమసిపోక పోవడానికి, కొందరి స్వార్థ అవకాశవాదం కూడ కారణమేనని ఈ కవిత వ్యక్తం చేస్తుం ది. ఈ కవిత 1974లో రాసినది అయినప్పటికీ, నేటి సామాజిక స్థితి గతులకూ అక్షరాల అన్వయిస్తుంది.

కవిత్వ పర్యవసానం చైతన్యమని, దాని దృక్పథం అభ్యుదయమని నమ్మి, నిశ్శబ్దం అంటే మృత్యువు అని, మంచికో చెడ్డకో, చప్పుడు గొప్పదని విశ్వసించి వర్తమాన స్తబ్దతా వల్మీకాన్ని బద్దలు కొట్టేందుకు గోపి కవిత్వం రాస్తున్నారు! అని 1980లోనే టి.యల్. కాంతారావుగారన్నారు. (కొత్తకలాలు, 1990, పుట. 172)కలలు కలతతో కన్నీరు కారుస్తాయి!, చెట్ల కింద చితుకులు చిటపటమని పళ్ళు కొరుకుతాయి!.. లాంటి ప్రాణి లక్షణారోపణలు, వేసవిలో వేసారిపోతున్న లోకం పెదవులపై/దరహాసాలు మొలిపించింది వాన చాన!, తడి ఇసుకలో/చిన్నారి నవ్వుల్ని పారబోసుకుంటున్నారు పిల్లలు!, కర్టెన్లు కదలిస్తూ వచ్చి / చల్లని వేళ్ళతో ఒళ్లంతా నిమురుతుంది గాలి!.. లాంటి ఉత్ప్రేక్షలూ ఆహ్లాదపరుస్తాయి.
తెలుగువారి బతుకమ్మల కమ్మని మొగాల/వెలుగు నింపు పూలు! /కాపు కన్నెల ముద్దుగొలుపు ముద్దకొప్పుల్లో/ కాపురముం డే పూలు!.. అంటూ తెలంగాణలో ఆడపడుచుల పెద్ద సంబరమైన బతుకమ్మకు, తెలంగాణ కష్టజీవుల సంస్కృతికి తంగెడుపూలతో విడదీయరాని బంధాన్ని సూచించారు. మనసున్న పూలు, మమతలున్న పూలు, వలపు బాసలు నేర్చిన పూలు, పేద పూలు, పేదల పూలు! అంటూ అన్చులలోకి నెట్టివేయబడిన శ్రామిక సంస్కృతికి ప్రతీకలుగా పేర్కొన్నారు. అప్రధానీకరింపబడిన, మనసులు మమతలు ఉన్న పూలు అని స్పష్టం చేశారు. తంగేడుపూలు అంటే ఒప్పుకోను!/పొంగిన విచారాన్ని దిగమింగిన పూలు!.. వలస పాలకుల అణచివేత వల్ల అనుభవించిన ఆవేదననంతా గుంభనంగా వ్యక్తీకరించిన వాక్యాలివి.

(తంగేడు పద ఉచ్చారణను అనుసరించి, ఇది రెండు పదాల కలయిక. అవి, తంగ+ఏడు. ఈ ఉచ్చారణతో కూడిన అర్థవంతమైన పదాలు తమిళభాషలో ఉన్నాయనీ, దాని ప్రకారం తంగం అంటే బంగారం అని, యేడు పూ రెమ్మ అని అర్థం అని కొందరు పరిశోధకులు అంటున్నారు.)రెప్పల మాటున పడుకున్న నిప్పును లేపకండి!/ తలలెత్తే ఆగ్రహానికి తలుపులు తీయకండి!.. అంటూ, నాటి (1969) నివురుగప్పిన నిప్పులాంటి తెలంగాణ ఉద్యమ లక్ష్యాన్ని ప్రతీకాత్మకంగా చెప్పారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో మిత్రులతో కలిసి తెలంగా ణం పేరుతో రెండు కవిత్వ బులెటిన్లను ప్రచురించారు. దీనివల్ల భువనగిరిలో అరెస్టు అయి, నల్లగొండ జైలులో నెల రోజులపాటు నిర్బంధంలో ఉన్నారు. బాల్యంలోనే (పద్యాలలో) శశి అనే శతకం, బాలగేయాలు రాశారు. గోపి గారు వచనకవిత్వం వైపు మరలడానికి, సినారె కవిత్వప్రభావమే కారణం.

గోపి గారు తన షష్ట్యబ్ది పూర్తి సందర్భంగా 2010లో వెలువడిన తమ కవితాసంపుటాలను, మూడు సమగ్ర సంపుటులుగా ప్రచురించారు. ఆ సంపుటాలలో ఆయా కవితల రచనలకు మూలాలను, ప్రేరణలను, పాదసూచికలలో వివరించారు. ఆ వివరణలను బట్టి, తంగెడుపూలలోని చాలా కవితలు, తమ వ్యక్తిగత అనుభవాలనుం చి ఉద్భవించినవేనని తెలుస్తుంది. కాని, వ్యక్తిగత అనుభవాలను సాధారణీకరించే లక్షణాన్ని, తన తొలి కవితాసంపుటిలోనే అలవర్చుకున్నారు. ఈ సంపుటిలో ఆవేశం కంటే ఆలోచనకు, ఉద్వేగంకంటే అనుభూతికి, సందేశాత్మకత కంటే వర్ణనాత్మకతకు ప్రాధాన్యమిచ్చిన కవిగా గోపి కనిపిస్తారు. ఈ లక్షణాలే, నేటికీ వారి కవిత్వం లో అనుస్యూతంగా కొనసాగుతున్నాయని అనిపిస్తుంది.

రకరకాల పూలలో కొంత నిర్లక్ష్యానికీ, ఉపేక్షకూ గురి అయినవి తంగెడుపూలు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక ఆత్మగౌరవ పతాకగా నిలిచింది బతుకమ్మ పండుగ. ఈ క్రమంలో తంగెడుపువ్వు ప్రధాన సాంస్కృతిక స్రవంతిలో ప్రముఖ స్థానం సంతరించుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తంగెడుపువ్వును రాష్ట్ర పుష్పంగా ప్రకటించడం హర్షదాయకం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా తంగెడుపూలు వస్తువుగా కవిసమ్మేళనం నిర్వహించడం, తంగేడువనం (2015) పేరుతో కవితా సంకలనం ప్రచురించడం విశేషం.గోపి గారి తంగెడుపూలు కవితా సంపుటికి ముందుమాట రాసిన కుందుర్తి ఈ కవికి మంచి భవిష్యత్తు ఉందని నాకు నమ్మకం కలిగిందిఅని అన్నారు. కుందుర్తి గారి నమ్మకాన్ని వెయ్యి రెట్లు సఫలంచేసి చూపించారు గోపి.
సంక్షుభిత కాలసందర్భంలో 1965 నుంచి రాస్తున్న కవులు చాలా మంది కొద్దికాలం సమకాలీన తీవ్రతతో రాసి తర్వాత మానేశారు. మరి కొంతమంది భావాలు మార్చుకొని రాస్తున్నారు. ఇం కొందరు ఆ రోజుల్లో సామాజికతను ఆరాధించినవారు అనుభూతి వాదంలోనో, మరి దేంట్లోనో తమ సొంత ముద్రల్ని వెతుక్కున్నా రు. అయితే, ఆనాటి నుంచి ఈనాటి వరకు తమ సామాజిక ప్రగతిశీల భావాల్ని వదిలి పెట్టకుండా, అతిశయాలకు పోకుండా, కవిత్వంలోనే తమను తాము వెతుక్కునే క్రమంలో.. క్రమ క్రమంగా పరిణ తి చెందుతూ వచ్చి, తమదైన ఒక మార్గాన్ని సుస్థిరం చేసుకున్న కవులున్నారు. వీరి పరిణామానికి జీవచైతన్యమే కారణం. వీరు జీవితానికీ, కవిత్వానికీ, సమాజానికీ కట్టుకున్న వంతెనలోని సమగ్ర నిర్మాణమే కారణం.అటువంటి అతి కొద్దిమంది కవుల్లో తన విశిష్ట మార్గాన్ని నిలబెట్టుకున్న కవి ఎన్.గోపి! అని అద్దేపల్లి రామమోహనరావు గారు (గోపి సాహిత్య దర్శనం, 1998, పుట. 1) ఇరవై ఏళ్ల క్రితం చెప్పిన మాటలు నేటికీ అక్షర సత్యాలు. గోపి గారిది నిత్య చైతన్య కవితా జీవధార!
- పెన్నా శివరామకృష్ణ, 94404 37200 (నేడు డాక్టర్ ఎన్.గోపి జన్మదినం..)

1481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles