కథలు-వర్గీకరణ, ఒక స్పృహ


Mon,June 25, 2018 01:46 AM

తెలుగు సాహిత్యంలో కథలకు ఓ ప్రత్యేక స్థానమున్నది. మనిషికి భాష తెలిసిన నాడే కథలు పుట్టేయనవచ్చు. తెలుగు కథా సాహిత్యం ఏ ఇతర భాషల కథా సాహిత్యం కన్నా ఏ మాత్రం తీసిపోనిది. 1910వ సంవత్సరంలో గురజాడ అప్పారావు రాసిన దిద్దుబాటు కథ ఆధునిక కథగా సాహితీవేత్తలు నిర్ణయించారు. పద్మరాజు గారి గాలివాన కథ అంతర్జాతీయ బహుమతి పొంది మన తెలుగు కథా సాహిత్యం గొప్పదనాన్ని దేశ దేశాలకు చాటి చెప్పింది. స్వాతంత్య్రావతరణ తరువాత తెలుగు కథా సాహిత్య రంగంలో ఓ నూతన శకం ప్రారంభమైంది.

కథ చెప్పే ప్రక్రియలో కనీసం ఇద్దరుంటారు. చెప్పేవాడు, వినేవాడు. ఎవరికి ఆసక్తిపోయినా కథ కం చికి పోతుంది. రాసే కథ అలా కాదు, ఒకసారి రాస్తే పత్రిక ద్వారా లక్షల ప్రతుల ద్వారా అందరికీ చేరుతుంది. చెప్పే కథలో విన్న కథ మళ్ళీ చెప్పడం అం దరికీ ఒకేతీరు రాదు. నాణ్యత లోపించవచ్చు. కొత్తవి కల్పించి ఆసక్తికరంగా చెప్పవచ్చు. రాసే కథకు ఈ రెండు అవకాశాలు లేవు. పాఠకుల్లో రకరకాల స్థాయిల వారుంటారు. ఏ పాఠకులను దృష్టిలో పెట్టుకు ని రాస్తున్నారో దాన్ని అనుసరించి చెప్పే పద్ధతి లేదా శిల్పం మారుతుంది. సాధారణంగా మానవ సంబంధాల్ని, వారి భావాల్ని, స్వభావాల్ని, సం స్కృతిని, జీవితాల్ని, లోకాన్ని మరింత అర్థం చేసుకోవాలనుకునే పాఠకులు కథల్ని చదువుతుంటారు. అందువల్ల ప్రజలంతా పాఠకులే.

జీవిత కోణాల్ని చిత్రించడానికి కథ చక్కగా పనికి వస్తుంది. జీవితంలోని ఒక తాత్విక కోణాన్ని, దానికి సంబంధించిన మానసిక విశ్లేషణను, సామాజిక, ఆర్థిక విశ్లేషణను, మానవ సంబంధాల విశ్లేషణను చిత్రించడానికి కథ ప్రక్రియ ఉపయోగపడుతుంది. జీవితంలోని ఒక్కొక్క కోణానికి ఒక పాత్రను ప్రతినిధిగా, ప్రతీకగా మలిచి చిత్రించవచ్చు. కథ లు అనేక రకాలు. చెప్పే వారిని అనుసరించి, రాసేవారిని బట్టి, చదివే వారిని అనుసరించి, వస్తువులను బట్టి, ఆయా రచయితల ప్రాంతాన్ని బట్టి, దృక్పథాలను బట్టి కథలను వర్గీకరిస్తారు. సాహిత్యంలో మరో వర్గీకరణ కూడా చేస్తుంటారు. అది శైలి, శిల్పాన్ని బట్టి, అభివ్యక్తిని బట్టి, ప్రయోగాలను బట్టి చేసే వర్గీకరణ. 1.ప్రతీకాత్మక కథలు 2.మ్యాజిక్ రియలిజమ్ 3.నేచరిలిజమ్ 4.సైన్స్ కథలు 5.కొసమెరుపు కథలు 6. వర్ణనాత్మక కథలు 7.సంభాషణాత్మక కథలు 8.ఉత్తరాలతో కథలు 9. జానపదశైలి కథలు 10.చైతన్య స్రవంతి కథలు 11.సాదా సీదా కథలు.

నవలలను కూడా అనేక రకాలుగా వర్గీకరిస్తారు. అయితే రచయితలు ఈ వర్గీకరణ కోసం రాయరు. వాళ్ళు రాసిన తర్వాత ఏదో ఒక వర్గీకరణలో చేర్చుతుంటారు. ఆయా దృక్పథాలతో, ప్రాంతీయ ముద్రతో రాసినపుడు వాటిని స్త్రీ వాద కథలనీ, దళిత కథలని, తెలంగాణ కథలని వర్గీకరిస్తుంటారు. కొందరు ఒక సబ్జెక్టు మీద ప్రత్యేకంగా కృషి చేస్తుంటారు. ఒకే వస్తువును తీస్కొని దాని అనేక కోణాలను కథలుగా రాస్తుంటారు. బాల్యం గురించి అలా అనేక కథలు రాస్తుంటారు. అమ్మ గురించి, నాన్న గురించి, ఊరు గురించి, నగరం గురించి, సైనికులు, బాలకార్మికులు, జైలు ఖైదీలు, అంగవికలుల గురించి, ఉద్యమాల గురించి ప్రత్యేకంగా కథలు, నవలలు రాస్తుంటారు. అవి ఒక విషయం గురించి ఎక్కువ రాసినప్పుడు వాటిని ఒకే సంపుటిగా తెస్తుంటారు. అనేకమంది ఒకే సబ్జెక్టుపై రాసిన కథలను, కవితలను ఒక సంకలనంగా తెస్తుంటారు. ఎక్కువ కథలు అలాంటివి రాసినపుడు వారిని ఆ కథల నిపుణులు అని ప్రత్యేకంగా పేర్కొంటారు. ఉదాహరణకు పిల్లల కథలు, ఉద్యమ కథ లు, స్త్రీల కథలు, సామాజిక పరిణామాల కథల మొదలైనవి.

భావాలను బట్టి కథలను వర్గీకరిస్తుంటారు. స్త్రీ , దళితవాద కథలు, అభ్యుదయ కథలు, విప్లవ కథలు. ప్రాంతాలను బట్టి కూడా కథలను వర్గీకరిస్తుంటారు. తెలంగాణ కథలు, ఉత్తరాంధ్ర కథలు ఇలా.
రాసిందంతా సాహిత్యం కానట్లే, రాసిందంతా సామాజిక స్పృహతో రాసినట్లు కాదు. మరి సామాజిక స్పృహ అంటే ఏమిటి? బాల నాగమ్మ కథ, కాశీమజిలీ కథలు, భట్టి విక్రమార్క కథలు, తెనాలి రామలింగడి కథలు, చందమామ కథలు, పంచతంత్రం కథలు వీటిల్లో స్పృహ వున్నట్లా లేనట్లా? ఒకవేళ లేదనుకుంటే లేనంత మాత్రాన నష్టం కాదని పై కథలు రుజువుచేసి పారేస్తాయి. స్పృహ లేదు అంటే తెలివి లేదు అని వాడకంలో అర్థం. సామాజిక స్పృహ అంటే సమాజం అనేది ఒకటుందని, సమాజాన్ని గూర్చిన తెలివి, జ్ఞానం కలిగి ఉండటం. ఇది సాధారణార్థం. సామాజిక స్పృహ అంటే ఇప్పుడు అది కాదు, మార్క్సిజం ప్రకారం సమాజాన్ని గూర్చిన అవగాహన ఉందా లేదా అని. సమాజ వర్గ స్వరూపం, స్వభావం తెలిసి రాస్తున్నాడా తెలియకుండా రాస్తున్నాడా అని. శ్రామిక వర్గం ప్రయోజనాల కోసమా, మధ్యతరగతి ప్రజల కోసమా, ధనిక వర్గం కోసమా -ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నాడు అనే ది రచయితలకు ఈనాడు పరీక్షగా మారింది.

కొందరు అభ్యుదయ రచయితలు ఉద్యమాల గురించి అనే క కథలు, నవలలు రాశారు. కొందరు జీవితంలోని అనేక కోణాలను తీసుకొని మానవతా దృక్పథంతో సామాజిక పరిణామాలను కథల్లో, నవలల్లో చిత్రించారు. కొందరు కొన్ని సబ్జెక్టులకే పరిమితమై విస్తారంగా కథలు రాశారు. కథా సాహిత్యం విస్తరిస్తున్నది. కానీ రచయితలు తమ జీవిత కాలంలో రాయాల్సినన్ని కథలు రాయడం లేదు. తక్కువ కథలు రాస్తున్నారు. కథలో కథకుడు నోరు జారకూడదంటారు. అయితే కథకుడు నోరు విప్పకపోతే కథ ఎలా సాగుతుంది. కనక నోరు విప్పాలి. కథ చెప్పా లి. అంటే వినయంగా కథ చెప్తూ వెళ్ళాలి. మనం చెప్పదల్చుకున్నది పాత్రల సంభాషణల ద్వారా, ఆలోచనల ద్వారా, సన్నివేశాల ద్వారా చెప్పగలిగే పాత్రల్ని ఎన్నుకోవాలి.

తెలుగు సాహిత్యంలో కథలకు ఓ ప్రత్యేక స్థానమున్నది. మనిషికి భాష తెలిసిన నాడే కథలు పుట్టేయనవచ్చు. తెలుగు కథా సాహిత్యం ఏ ఇతర భాషల కథా సాహిత్యం కన్నా ఏ మాత్రం తీసిపోనిది. 1910వ సంవత్సరంలో గురజాడ అప్పారావు రాసిన దిద్దుబాటు కథ ఆధునిక కథగా సాహితీవేత్తలు నిర్ణయించారు. పద్మరాజు గారి గాలివాన కథ అంతర్జాతీయ బహుమతి పొంది మన తెలుగు కథా సాహిత్యం గొప్పదనాన్ని దేశ దేశాలకు చాటి చెప్పింది. స్వాతంత్య్రావతరణ తరువాత తెలుగు కథా సాహిత్య రంగంలో ఓ నూతన శకం ప్రారంభమైంది. కొత్త కొత్త ఇతివృత్తాలతో కథారచనకు శ్రీకారం చుట్టబడింది. తెలంగాణ నుంచి పోరాట కథానికను సుసంపన్నం చేసిన వారిలో అల్లం రాజయ్యతో పాటు సాహు, బి.యస్.రాములు, రఘోత్తమరెడ్డి, చెరబండరాజు, నందిని సిధారెడ్డి, పి.చంద్ లాంటి వాళ్ళెంతో మంది ఉన్నారు. నవల, నాటకం, కవిత, కావ్యం, మొదలైన సాహితీ ప్రక్రియలేవీ ప్రవేశింప వీలు లేని మారుమూల చీకటి కోణాలను సైతం స్పృశించి తెలుగునాట తెలుగువారి జీవితంలోని హెచ్చు తగ్గులను, వారి రాగద్వేషాలను, చిత్రీకరిస్తున్నది కథ. దేశంలో ఎటువంటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిణామాలు పొడసూపినా అవి సామాన్య జన జీవనంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో దానికి దర్పణం పడుతూ ఎన్నో ఉత్తమకథలు సృష్టించబడుతున్నాయి.
- డాక్టర్ గన్నవరం వెంకటేశ్వర్లు, 95503 84498

1045
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles