మళ్ళీ మన బాల చెలిమి


Mon,June 18, 2018 01:26 AM

ప్రపంచ తెలుగు మహాసభల్లో బాల సాహిత్యానికి ఒక రో జు, బాలలకు మరో రోజు ప్రత్యేకంగా కేటాయించడం ఒక కొత్త దిశకు నాంది అని చెప్పవచ్చు. ఆ ఉత్సాహమే మళ్లీ ఈ బాల చెలిమి. పిల్లల సినిమా, అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం మొదలుకొని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ద్వారా ప్రతి శనివారం ఒక సమావేశం చొప్పు న రాష్ట్ర ఆవిర్భావం వరకు వందలాది చర్చా కార్యక్రమాలు నిర్వహించిన ఎం.వేదకుమార్ ఈ పత్రికకు సంపాదకుడు కావడం శుభ సూచకం.

చాలా రోజుల కింది ముచ్చట. చందమామ పత్రి క తెలియని తెలుగువారు ఉండరనటం అతిశ యోక్తి కాదు. దాదాపు యాభై ఏండ్లు తెలుగు వారినే గాక దాదాపు అన్ని భారతీయ భాషల బాల బాలికలను, అన్ని వయస్సుల వారిని అలరించిన పత్రిక చందమామ. ఎం.వేదకుమార్ ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మా కార్యాలయానికి సాహితీవేత్త డాక్టర్.వి.ఆర్. శర్మతో కలిసి వచ్చి శుభవార్త చెప్పారు. మళ్ళీ బాల చెలిమి మన తెలుగు పిల్లల కోసం రానున్నదన్నది ఆ వార్త. పిల్లలకు, తల్లిదండ్రు ల కు, వాళ్ళకంటే శ్రద్ధగా చదివే మనలాంటివాళ్లకు ఇంతకు మిం చిన శుభవార్త ఏముంటుంది.

ప్రపంచంలో దాదాపు 18 కోట్ల మంది మాట్లాడే భాష మన దని, రెండువేల ఏండ్ల నాడే తెలుగులో రచన జరిగిందని, ఏవో చెప్పుకునే మనం పత్రికల విషయంలో, అందులోనూ బాలల పత్రికల విషయంలో ఎక్కడున్నామో చూసుకుంటే మనల్ని మనమే క్షమించుకోలేని పరిస్థితి. అయితే ఉద్యోగరీత్యా ఇతర భారతీయ భాషల్లో పనిచేస్తున్న క్రమంలో ఇతర భాషల్లో వస్తు న్న రంగురంగుల పిల్లల పత్రికలు, అన్నింటికిమించి ఆయా ప్రభుత్వాలు, సంస్థల నుంచి ఆయా పత్రికలకు లభిస్తు న్న అం డదండలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా హిందీ, బెంగా లీ, మలయాళం, కన్నడ, ఒడియా, ఇంగ్లీష్‌లలో విరి వి గా పిల్ల ల పత్రికలు వస్తున్నాయి. హిందీలోని విజ్ఞాన్ ప్రగతి, చంపక్, బాల్ భారతి, బెంగాలీ పత్రికల వేలాది ప్రతు లు వెలువడటం మనకు తెలిసిందే. ఇక తెలుగులో వచ్చే పత్రికల విషయానికి వస్తే.. బాలమిత్ర, బుజ్జాయి, బాలతేజం, బాల బాట, శ్రీవాణి పలుకు, మొలక, నాని, బాలల బొమ్మరిల్లు వంటి కొన్ని పత్రి కలు మాత్రమే ఉన్నాయి.

నిజానికి ఈ ప్రస్తావనంతా తేవడానికి కారణం 1990లో వెలువడి, ఆగిపోయిన బాల చెలిమి మళ్లీ వస్తోందన్న సంతో షం. గతంలో చందమామతో పాటు ఎన్నో పత్రికలు వచ్చా యి, పోయాయి. ఈ నేపథ్యంలో బాల చెలిమి గురించి ప్రత్యే కించి మాట్లాడటానికి చాలా కారణాలున్నాయి. చాలా పత్రిక లకు మనం విజ్ఞాన, వినోద, వైజ్ఞానిక పత్రిక వంటి పేర్లను చూస్తుంటాం. కానీ బాల చెలిమి ట్యాగ్‌లైన్‌లో పిల్లల వికాస పత్రిక అని ఉంటుంది. ఇదే ఈ పత్రిక పట్ల మనసుపడేలా చేసింది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించబడినప్పటికీ, నిఖార్సయిన తెలుగు పిల్లల పత్రిక అయినప్పుటికీ, తెలంగాణ నేల మీదినుంచి ఆ సోయితో వెలువడింది. 90వ దశకంలో నిబద్ధత కలిగిన బృందం, అంతకుమించిన చిత్తశుద్ధి కలిగిన యాజమాన్యం చేతిలో రూపుదిద్దుకున్నది.

పిల్లల మానసిక స్థితి గతులు, వాళ్లవాళ్ల స్థాయినిబట్టి దీనిలో రచనలు చోటు చేసుకో వడం చూడవచ్చు. సాధారణంగా చంపక్, విజ్ఞాన్ ప్రగతి వంటి ఒకటి రెండు మినహాయిస్తే పిల్లల పత్రికలన్నీ దాదాపు వాళ్లకు వినోదాన్ని కలిగించే అంశాలపైనే శ్రద్ధ పెట్టాయి. కానీ బాల చెలి మి ప్రారంభమే విభిన్నంగా ఉన్నది. ప్రారంభ సంచిక సంపాద కీయంలో వేదకుమార్ మాటలను చూస్తే తెలుస్తున్నది. చదువుకోవడానికి పాఠ్యపుస్తకాలు మినహా ఇతర బాల సాహి త్యం అందుబాటులో లేని విద్యార్థుల్లో లోకజ్ఞానం పెంచి, రోజు రోజుకు విస్తరిస్తున్న ప్రపంచ జ్ఞానాన్ని మారుమూల ప్రాంతా ల్లోని విద్యార్థులకూ ఎప్పటికప్పుడు అందించి వారిని ఎవరికి తీసిపోనివిధంగా తయారుచేస్తుంది బాల చెలిమి. ఇది ఏ ఉద్దే శంతో ప్రారంభించబడినదో ఈ మాటలవల్ల తెలుస్తున్నది.

పిల్లల పత్రికలు, అందులోనూ మనకాలంలో ఒక అద్భుత మైన చందమామ వంటి వాటిని పూర్తిగా ఎంజాయ్ చేసిన తరం మనది. అందులోని ఫాంటసీ కథలు, దయ్యాలు, భూతా లు మనల్ని ఏ మేరకు ఆకర్శించాయనేది పక్కకుపెడితే అవి ఇప్పటికీ గుర్తుకున్నాయి. మానసిక శాస్త్రవేత్తలు, పిల్లల సాహి త్య, మానసిక నిపుణులు, పిల్లల కోసం పనిచేస్తున్నవారితో సుదీర్ఘచర్చలు జరిపిన సంపాదకుడు ఇందులో పిల్లల్లో మూఢ నమ్మకాలు, దయ్యాలు, భూతాల వంటి వాటి గురించి ప్రాధా న్యం ఇవ్వకపోవడం, వైజ్ఞానికాంశాలు, హేతువును పెంచే అం శాలపై దృష్టిపెట్టడం గమనించవచ్చు.

రష్యా పతనంతో అక్కడి ప్రగతి, రాదుగ ప్రచురణాలయాల పుస్తకాలు తెలుగులో ఆగిపోయాయని చెప్పొచ్చు. నొప్పి డాక్ట ర్, ఏడు తోకల ఎలుక వంటి ఎన్నో కథలు మనం చదివాం. ఆ కొరతను గుర్తించిన బాల చెలిమి సంపాదకవర్గం అక్టోబర్ 1990లో వెలువడిన ప్రారంభ సంచికలోనే మొదటి కథగా లియో టాల్‌స్టాయ్ కథ ఆధారంగా వచ్చిన కథను ప్రచురించిం ది. సాధారణంగా పిల్లల పత్రికల్లో మనం అనువాద కథలను చూడం. కానీ బాల చెలిమి ఆ పని చేసింది. కథలు, గేయాలకు అన్ని పత్రికల్లాగానే స్థానం కల్పించిన ఈ పత్రిక కేవలం వాటి తోనే సరిపుచ్చుకోలేదు. ప్రతి అంశం పట్ల శ్రద్ధ వహించింది.

పెద్దల మాట చద్దన్నం మూట. వాళ్ల అనుభవాలు మనకు ఆగామి కాలంలో దారిచూపే దీపాలు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లు ఎదిగివచ్చిన క్రమం, ఈ పెద్దల బాల్యం మన బాలలకు అందించే ఉద్దేశంతో ప్రారంభించిన శీర్షిక నేను నా బాల్యం. ప్రారంభ సంచికలో నటరాజ రామకృష్ణ గారి స్వగ తం ఈ శీర్షికన అచ్చయింది. అది పిల్లలే సంపాదకులుగా, పిల్ల ల కోసం ఈ పత్రికలో అంతర్గతంగా వచ్చిన బాల చెలిమి పిల్లల సమాచార ప్రతిక. ఇది పూర్తిగా పిల్లల కోసం, పిల్లల రచ నల కోసం కేటాయించబడిన పేజీల సమాహారం. నాకు తెలిసి ఏ పత్రికలో ఇలా లేదేమో. ఇది బాల చెలిమి చెసిన చెమక్కు.

ఊహకు అందని విషయం ఇందులో చూడవచ్చు. అది బాల చెలిమి క్లబ్ నిర్వహణ. పిల్లలు కలం స్నేహం ద్వారా ఒకరికొకరు పరిచయం కావడం, ఎక్కడివారో మరెక్కడో ఉన్న వారితో ఉత్తరాల ద్వారా స్నేహం చేసేందుకు ఇది ఉప యోగప డింది. పిల్లలది నిశితమైన పరిశీలన, అంతకుమించిన జ్ఞానం. అది దృష్టిలో ఉంచుకొని కవర్ పేజీలపైన కంప్యూటర్‌ను 90వ దశకంలో ముద్రించి పరిచయం చేయడమేగాక ప్రతి సంచికలో ఒక పక్షిని లేదా జంతువును పూర్తిస్థాయిలో పరిచయం చేయ డం చూడవచ్చు.
సంపాదకీయాల గురించి కూడా ప్రత్యేకంగా పేర్కొనాలి. ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని పిల్లలకు అర్థమయ్యేరీతిలో చెప్ప డం విశేషం. సాధారణంగా బాలల పత్రికలు పేరున్న బాల సాహిత్యకారులకు ఎక్కువగా అవకాశం కల్పిస్తుంటాయి. ఇప్పు డు ఆ అలవాటు తగ్గింది. కానీ తొలితరం బాల సాహిత్యకారు లంతా ప్రసిద్ధ సాహితీవేత్తలే. అనుభవాల కార్ఖానాలే. బాల చెలిమి కోసం బాల సాహిత్యకారులతో పాటు అపార అనుభ వజ్ఞులైన ఎస్.ఎం.ప్రాణ్‌రావ్, ప్రొఫెసర్ హరగోపాల్, హరి పురుషోత్తమరావు వంటివారు ప్రత్యేకించి రాయడం విశేషం. పిల్లల కోసం ప్రముఖ కవి దేవిప్రియ జ్ఞాన పదం పేర రాయ డం విశేషం.

ప్రపంచ తెలుగు మహాసభల్లో బాల సాహిత్యానికి ఒకరో జు, బాలలకు మరో రోజు ప్రత్యేకంగా కేటాయించడం ఒక కొత్త దిశకు నాంది అని చెప్పవచ్చు. ఆ ఉత్సాహమే మళ్లీ ఈ బాల చెలిమి. పిల్లల సినిమా, అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్స వం మొదలుకొని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ద్వారా ప్రతి శనివారం ఒక సమావేశం చొప్పు న రాష్ట్ర ఆవిర్భావం వరకు వందలాది చర్చా కార్యక్రమాలు నిర్వహించిన ఎం.వేదకుమార్ ఈ పత్రికకు సంపాదకుడు కావ డం శుభ సూచకం. దీనికితోడు పిల్లల సాహిత్యంపై సాధికారిక చర్చ జరుగాలన్న దిశగా ఈ ఏప్రిల్ 2 న, ప్రపంచ బాలల పుస్త క దినోత్సవం నాడు బాల చెలిమి ముచ్చట్లు పేర మరో కార్య క్రమానికి శ్రీకారంజరిగింది. బాల చెలిమి, బాల చెలిమి ముచ్చ ట్లు, సదస్సులు, చర్చలు మళ్లీ తెలుగునాట అందులోనూ హైద రాబాద్‌లో తిరిగి ప్రారంభం కావడం బాల మిత్రులకు ఆనం దం కలిగించే విషయం. జయహో బాల సాహిత్యం.
- డాక్టర్ పత్తిపాక మోహన్
98112 39219

533
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles