అనుభూతుల సంగమస్థలి


Sun,June 3, 2018 10:49 PM

రైలు ప్రయాణమంటే జ్ఞాపకాల్లోకి ప్రయాణించటమనే ఎరుకను అందంగా పొదిగే కథలివి. దక్షిణ మధ్య రైల్వే స్వర్ణోత్సవం సందర్భంగా వెలువరించిన రైలుకథలు సంకలనం రైలు ప్రయాణమంటే మనుషులను కలుసుకోవటం, ఆ తర్వాత అనుభూతులను రైలు కూతలా తలుచుకోవటమంటూ మన గుండె తలుపులను తడుతాయి.
rail-kathalu
ప్రయాణాల్లో రైలు ప్రయాణమిచ్చే తృప్తి, మిగిల్చే జ్ఞాపకా లు సాటి లేనివి. బాల్యంలో రైలును చూడటమో అపురూప దృశ్యం. ఇక ప్రయాణం చేయటమంటే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం కొం చెం పెద్దయ్యాక ఒంటరి ప్రయాణాలు, దూర ప్రయాణాలు అలవాటవుతాయి. ఈ క్రమంలో ఎంతోమంది తారసిల్లుతారు. ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకుంటాం. అవన్నీ మనసులో మెదులుతూ ఉంటాయి. ఆ అనుభూతులను రచయితలు కథలుగా అలంకరించి మన జ్ఞాపకాలకు అక్షర పరిమళమద్దుతారు. ఇది సంకలనాల శకం. వార్షి క సంకలనాలతో మొదలై జిల్లా సంకలనాలు, కొత్త పాత రచయితల సంకలనాలు, అపురూ ప కథలు, అపూర్వ కథలు విభిన్న అంశా ల సంకలనాలు... ఓహ్ .. ఒకటేమిటి... ఇలా కథ అనేక పాయలుగా విస్తరిస్తున్న కాలమి ది. ఆ కోవలో భాగంగానే రైలు ప్రయాణపు అనుభవాలను, అనుభూతులను కథలు కథలు గా చదువుకున్న మనందరికీ ఆ అనుభూతులను-కథా సంగ మంగా మార్చి రైలుకథలుగా సంకలనం చేశారు కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహ న్, సాధనాల వెంకటస్వా మి సంపాదకత్వం వహించా రు. వీరికి వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించారు గౌరవ సంపాదకర్త, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎమ్. ఉమా శంకర కుమార్. ఈ రైలు కథలన్నీ మన ప్రయాణాలను మనకు గుర్తుచేస్తాయి.

అసలు రైలు ప్రయాణమే అనుభూతుల పర్వం. అన్ రిజర్వ్‌డ్ బోగీలో పొందే అనుభవానికి ఫస్ట్ బోగీ ప్రయాణానికి అసలు పోలికే ఉండదు. స్లీపర్ ప్రయాణంలో మనుషుల మధ్య ఏర్పడే అనుబంధం ఏసీ బోగీలో ఉండకపోవచ్చు. సెలబ్రిటీల ను చూపే ఫస్ట్ ఏసీ ప్రయాణం వారిలోని మరో కోణాన్ని ఆవిష్కరించవచ్చు. రైలు ప్రయాణాలెప్పుడూ జీవిత శకలాలను ఏరుకోమంటాయి. అందుకే ఆ ప్రయాణాల అనుభవాలను కథలుగా మలచేటప్పుడు కొంత సంయమనం అవసరం. ఏ మా త్రం తేడా వచ్చినా అనుభూతి ఆవిరై సెగ మాత్రమే తగిలే అవకాశం ఉంటుంది. అందుకే కస్తూరి మురళీ కృష్ణ బృందం రైలు నేపథ్యంలో మాత్రమే వచ్చిన కథ అని పెట్టుకోకుండా ఆ అనుభవం తాలూకు వెచ్చదనమో, కన్నీటిచుక్కో, పఠితులకు అందాలన్న నియమం పెట్టుకుని మరీ రైలు కథలను గాలించా రు. అందుకే కేవలం అన్నీ రైలు అనుభూతులే అయినప్పుడు మొనాటనీ బాధించదా అని ప్రశ్నించేవారు తప్పక చదవవలసిన కథలివి. వైవిధ్యంగా రైలు ప్రయాణపు జీవితాన్ని, రైల్వే ఉద్యోగులు ఎదుర్కొనే ఆటుపోటుల్ని ఈ కథలు దృశ్యమానం చేస్తాయి. పాఠకుని మనసు రైలింజనై పరిగెడుతుంది. చాలా వడపోతల తర్వాత 39 కథల ను ఎంచుకున్నారు సంకలనకర్తలు. కొన్ని కథలు ప్రయాణంలో ముగుస్తా యి. కొన్ని కథలు ప్రయాణంలో మొదలవుతాయి. ప్రయాణాలలోని దోపిడీ ని, దౌష్ట్యాన్ని, మనుషుల చపలత్వాన్ని చూపుతాయి. ఈ కథలలోని గొప్పద నం వాటి భిన్నత్వంలోనూ, భిన్న కలాలలోనూ ఉంది. యర్రంసెట్టి సాయి గార్డ్ గోపాలం కథ 1966లో ప్రచురితమైతే, బొందం నాగేశ్వరరావు రైలు కథ 2017లో ప్రచురింపబడింది. శైలిపరంగా, వస్తుపరంగా ఒక కథకు మరో కథకు పోలిక ఉండదు. ప్రతీ కథ దేనికదే ప్రత్యేకమైనది.

పొత్తూరి విజయలక్ష్మి గారి నాణేనికి మరోవైపు రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే ఉద్యోగుల కష్టాన్ని కళ్ళకు కట్టిస్తుంది, వారి బాధలతో సహా. ఘండికోట బ్రహ్మాజీరావుగారి తాబేలు కథ ఇంకొంచెం ముందుకు వెళ్లి రైలు ప్రమాదం సహాయక చర్యలలో మూగజీవుల వ్యథను కూడా రచయిత రికార్డు చేయటం కనిపిస్తుంది. సలీం ప్రయాణం కథ జనరల్ బోగీలో ప్రయాణించే వారి కష్టాలను అధికారులు అర్థం చేసుకోవాలన్న ఆవేదనతో మనలను కదిలిస్తుంది. మధురాంతకం మహేంద్ర ఇంధ నం కథ అడవి ప్రాంతంలో ఉండే స్టేషన్ నేపథ్యంలో సాగే కథ. మనిషి ఉనికిని ప్రశ్నించే తాత్త్వికతతో సాగుతుంది. కోడిపిల్లకు టికెట్ లేదని లంచం డిమాండ్ చేసిన టికెట్ కలెక్టర్‌ను నిలదీసి ఎదుర్కొనే ఈ పల్లెటూరి మహిళా కథ భారత మహిళా నీకు జోహార్లు గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు రచన మనలను అబ్బురపరుస్తుంది. అలాంటిదే నల్ల భూమయ్య దొర కథ. రైలు నడిపే సమయంలో రైల్ డ్రైవర్ (లోకో డ్రైవర్) అనుభవిం చే టెన్షన్ చెబుతుంది. ఆకెళ్ల శివప్రసాద్ దొరకునా ఇటువంటి సేవ కథ. రైల్ డ్రైవర్లు జీవితంలో ఎన్ని మిస్సవుతారో చెప్పే కథ.

ఉద్యోగ జీవితంలో భాగంగా రోజూ ప్రయాణాలు చేసేవా రు రైలు ప్రయాణంలో ఆత్మీయులైపోతారు. అలాంటి కథ ముకుంద రామారావు గారి ఉద్యోగం ప్రయాణం కథ. ఖరగ్‌పూర్ నుంచి కలకత్తా వెళ్లే బెంగాలీ బాబుల జీవితాల పరదా చాటున ఉండే ప్రేమాభిమానాల దొంతర కథ. బాల్యంలో రైలు పట్టాల చుట్టూ తిరిగే జీవితాలు పెద్దయిన తర్వాత ఆ జ్ఞాపకాలను వెతుక్కుంటూ సాగించే అన్వేషణ జగన్నాథశర్మ గారి పట్టా మీద నాణెం జయలక్ష్మి గారి నిరీక్షణ కథలు. ఒక గొప్ప వేణువాద్య కళాకారుడు పొట్ట పోసుకోవటం కోసం ఫ్లూట్ వాయించే పదేండ్ల కుర్రాడి విద్యను ప్రేమించి, ఆ కుర్రాడితో జుగల్బందీకి దిగుతాడు. బందీ అయిన రైలు పరవశించిన వేణుగానంలా జార్చిన కథే జుగల్బందీ. కృష్ణమోహన్ గాంధీ గారి రచన. అంబల్ల జనార్ధన్‌గారి సన్యాసిరావు సబర్బన్ రైలు సీరియస్‌గా మొదలై, హాస్యాన్ని పండించే కథ. ఇం కా ఈ కథల్లో అమ్ముకునే వారిపై, సిబ్బంది దౌర్జన్యాలు, సిబ్బందిని ఆదుకునేవారు, అమ్ముకునే వారు, ఎంతోమంది సాక్షాత్కరిస్తారు. మనలను తరింపజేస్తారు.

రైలు ప్రయాణమంటే జ్ఞాపకాల్లోకి ప్రయాణించటమనే ఎరుకను అందంగా పొదిగే కథలివి. దక్షిణ మధ్య రైల్వే స్వర్ణోత్సవం సందర్భంగా వెలువరించిన రైలుకథలు సంకలనం రైలు ప్రయాణమంటే మనుషులను కలుసుకోవటం, ఆ తర్వాత అనుభూతులను రైలు కూతలా తలుచుకోవటమంటూ మన గుండె తలుపులను తడుతాయి.
- సి.యస్.రాంబాబు, 94904 01005

469
Tags

More News

VIRAL NEWS