వందేండ్ల ఓయూ జ్ఞాపకాలుగ


Mon,May 28, 2018 02:00 AM

డిచిన వందేండ్లలో లక్షలాది మంది విద్యావేత్తలను దేశానికందించి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రత్యేకత చాటుకున్న ఉస్మానియా యూనివర్సిటీ చరి త్ర ఘనమైనది. ప్రపంచంలో ఏ ఇతర యూనివర్సి టీకి లేని ప్రత్యేకత ఉస్మానియాకు ఉన్నదని చెప్పవచ్చు. అదేమం టే ఒక ప్రాంతంలోని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ వైవిధ్యాలను, బహుళత్వాలను ప్రతిబింబించిన అరుదైన విద్యాసంస్థ ఓయూ. యూరప్, అమెరికా దేశాలలోని ప్రముఖ యూనివర్సిటీలు ఏకత్వానికి ప్రతీకలుగా చెప్పుకోబడినాయి. ఉదాహరణకు హార్వర్డ్ యూనివర్సిటీ బోస్టన్ బ్రాహ్మణుల కేంద్రంగా పిలువబడింది. అదేవిధంగా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లలోని పలు యూనివర్సిటీలు ఉన్నతవర్గాల ప్రాతినిధ్య సంస్థలుగా కొనసాగాయి. బ్రిటిష్ ఇండియాలో ప్రసిద్ధి చెందిన కలకత్తా, మద్రాస్, బొంబాయి, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు కూడా అగ్రవర్ణాల ఆధిపత్యంలో కొనసాగినాయి. వాటికి భిన్నంగా ప్రాంతీయ భాష ఉర్దూ లో దేశంలోనే మొట్టమొదటి ఉన్నత విద్యాసంస్థగా ఉస్మానియా యూనివర్సిటీ గుర్తించబడింది. నిజాం ప్రభువులు రాజకీయంగా బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరించినప్పటికీ, విద్యా, సాంస్కృతిక రంగంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 1917లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉర్దూమీడియం యూనివర్సిటీని ఏర్పాటుచేశా డు. హైదరాబాద్ సంస్థానంలో మెకాలే విద్యావిధానానికి ప్రత్యామ్నాయంగా ఉర్దూ బోధనాభాషగా ప్రవేశపెట్టడానికి కొన్ని ప్రత్యేక, సామాజిక, సాంస్కృతిక, మత సంప్రదాయాలు దోహ దం చేశాయి.
book3
నిజాం రాజ్యాన్ని బహుమతాల, జాతుల, భాషా సంస్కృతుల సమ్మేళనమని చెప్పవచ్చు. ఆర్థికపరంగా, వ్యవసాయ, భూ సం బంధాల్లో జమీందారీ, జాగీర్దారీ భూస్వామ్య వ్యవస్థలున్నాయి. మొత్తంగా చూసినట్లయితే మొగలాయి దక్కన్ సాంస్కృతిక వారసత్వాన్ని సొంతం చేసుకున్న నిజాం రాజు దేశీయ భాషను బోధన భాషగా ఎంచుకోవడం చారిత్రక విశేషం. డేవిడ్ సంపాదకత్వంలో వెలువడిన గ్రంథం వందేళ్ల ఓయూ (జ్ఞాపకాలు అనుభవాలు) తెలంగాణలో అత్యున్నత విద్యాశిఖరం చారిత్రక, సామాజిక పరిణామ క్రమాన్ని వివరించింది. ఇందులోని 50కి పైగా వ్యాసాలు ఉస్మానియా యూనివర్సిటీ పూర్వవిద్యార్థులు రాశారు. వీరిలో అనేక రంగాలకు చెందిన నిష్ణాతులున్నారు. అయితే వారందరి జ్ఞాపకాలు, అనుభవాలలో ఉస్మానియా యూనివర్సిటీ వారి జీవితాలను ఏరకంగా ప్రభావితం చేసిందనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుం ది. వ్యాసకర్తల్లో వయస్సు, అనుభవంలో పెద్దవారైన చుక్కారామయ్య, దేవులపల్లి ప్రభాకర్‌రావు పద్మలాంటి వారితో పాటు యువతీ, యువకులున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన అగ్రవర్ణాలతో పాటు దళిత, బహుజన వర్గాలకు చెందినవారు, భిన్న సిద్ధాంతాలు, భావజాలాలు, ఆలోచనా విధానాలు కలిగిన వారు కూడా వ్యాసకర్తల్లో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ గ్రంథంలోని వ్యాసాలు వ్యాసకర్తల ప్రాంతీయ, సామాజిక, రాజకీయ భిన్నత్వాన్ని ప్రతిబింబించాయి.

చదువు-పోరాటం-జీవితం కలగలసిన ఓయూ అనే ముం దు మాటలో కె.లలిత వందేండ్లలో ఉస్మానియా యూనివర్సిటీలో చోటుచేసుకున్న చరిత్ర, సామాజిక, రాజకీయ పరిణామాలను సోదాహరణంగా వివరించారు. ఆమె మాటల్లో విద్య-పోరాటం-జీవితం అనే సంక్లిష్ట సుత్రానికి ఓయూ పునాదిరాయి. ఈ విద్యాసంస్థలో అంతర్భాగమైన ఎన్నో రకాల పోరాటాలు, అవి సమాజానికి అందించిన లోతైన అవగాహనలు దృష్టికోణాలు, భావ విప్లవాలు దేశంలో ఏ ఇతర ఉన్నత విద్యాసంస్థ అందించ లేదన్నది అతిశయోక్తి కాదు. స్థూలంగా చెప్పాలంటే నిజాం రాజు లు మతరీత్యా ముస్లింలు అయినప్పటికి ఉన్నత విద్యను మతాతేర దృక్పథంతో తీర్చిదిద్దారనేది చారిత్రక వాస్తవం. అందువల్లనే ఉస్మానియా యూనివర్సిటీ సంప్రదాయం-ఆధునికత సమ్మేళనంగా రూపుదిద్దుకున్నది. నిజాం పాలనలో ఉన్నత విద్య ప్రభు త్వ నియంత్రణలో ఉన్నప్పటికీ యూనివర్సిటీ సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ, జాతీయవాద ఆలోచనా విధానాలను ప్రతిబింబించింది. ముఖ్యంగా 1930 దశకం చివరి భాగంలో వందేమాతరం, వామపక్ష ఉద్యమాల ప్రభావం వల్ల ఉస్మాని యా విద్యార్థులు మేధాపరమైన ఆలోచనలతో పాటు, రాజకీయ చైతన్యాన్ని సంతరించుకొని వలసవాద, నిరంకుశ, ఫ్యూడల్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తత్ఫలితంగా ఉస్మానియా విద్యార్థులు హైదరాబాద్ రాజ్యంలో నూతన ప్రజాస్వామ్య, సెక్యులర్ సంస్కృతికి పునాదులు వేశారు. 1940-50 దశకాల్లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం, ముల్కీ అస్తిత్వ, ఆత్మగౌరవ ఉద్యమాల్లో కీలకపాత్ర వహించిన ఘనత ఉస్మానియన్స్‌దే. ధిక్కార చైతన్యం, ప్రశ్నించే తత్వం ఉస్మానియా వారసత్వంగా స్వాతంత్య్రానంతర తెలంగాణ యువతరం కొనసాగించింది. సీమాంధ్ర వలసవాదాన్ని, ఆధిపత్య రాజకీయాల్ని నిరసిం చి 1969-70 జై తెలంగాణ ఉద్యమాన్ని, నక్సల్బరీ స్ఫూర్తితో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను నిర్వహించిన ఘనత ఉస్మానియా విద్యార్థులదే. తొలి, మలిదశ ప్రాంతీయ అస్తిత్వ, ఆత్మగౌరవ ఉద్యమాల్లో కీలకపాత్ర వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటానికి ఉస్మానియా విద్యార్థులు చేసిన కృషి, త్యాగం మరువరానిదని ఈ గ్రంథంలో పొందుపరిచిన వ్యాసాలు విపులంగా వివరించినాయి.

డేవిడ్ సంపాదకత్వంలో వెలువడిన ఈ గ్రంథంలోని వ్యాసాలు తెలంగాణ వ్యక్తిత్వాన్ని, విశిష్టతను, సామాజిక, రాజకీయరంగంలో సంభవించిన మార్పుల్ని వ్యాసకర్తలు తమ స్వీయానుభవం ఆధారంగా విశ్లేషించటం మరో విశిష్టత. డేవిడ్ మాటల్లో తన వందేళ్ల ప్రస్థానంలో అనేక చారిత్రక ఉద్యమాలను లిఖించిన ఓయూ, తనను చూసి తానే గర్విస్తూ సంబురాల్లో మునిగి తేలుతున్న వేళ.. తన ఒడిలో అక్షరాలు దిద్దుకొని, ఉద్యమ ఉగ్గుపాలు తాగిన నాలుగు తరాల విద్యార్థులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ అనుభవాల్లో, అనుభూతుల్లో మీరూ మునిగి తేలండి. డ్బ్భై, ఎనభై దశకాల విద్యార్థి ఉద్యమ చైతన్యకెరటాల కాంతుల్ని వీక్షించండి.
- ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ
95734 05551


వందేళ్ల ఓయూ (జ్ఞాపకాలు-అనుభవాలు) ఆవిష్కరణ సభ

ఓయూ రీసెర్చ్ స్కాలర్ సంపాదకత్వంలో రూపుదిద్దుకు న్న వందేళ్ల ఓయూ (జ్ఞాపకాలు-అనుభవాలు) ఆవిష్కరణ సభ 2018 మే 28న ఉదయం 10.30 గంటలకు ఓయూలోని మెయిన్ లైబ్రరీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్ సెమినార్ హాల్‌లో జరుగుతుంది. ప్రొఫెసర్ ఎం.చెన్న బసవయ్య నిర్వహణలో జరిగే ఈ సభలో ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, డాక్టర్ అన్సారీ ప్రసంగిస్తారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిథి గా, ప్రొఫెసర్ ఎన్.రామచంద్రం గౌరవ అతిథిగా హాజరవుతారు. ప్రొఫెసర్ రమా మేల్కొటి పుస్తకావిష్కరణ చేస్తారు.
- ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్
- తెలంగాణ ఆత్మగౌరవ వేదిక, హైదరాబాద్

646
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles