కత్తిమొన మీద వెలిగిన కొవ్వొత్తి


Mon,May 21, 2018 01:19 AM

సైదారి కవితలో కనిపించే స్త్రీ అమూర్తమైన ప్రేమికురాలు కాదు, భావకవులు భేల అసలే కాదు, చలంగారు చిత్రించిన అణగారిన ఆమె కూడా కాదు. గొప్ప ధైర్యం ఉన్న స్త్రీ మూర్తి, మహాశక్తిమంతురాలైన మహిళ. ధీరోదాత్తమైన తెలంగాణ మహిళ.
Saida-chary
ఆయుష్సు రాసే తాన నాలుగు దినాలు అడిగి తెచ్చుకుంటిని.రెండు ఎదురు చూపులో గడిచిపోయినవి.
రెండు ప్రేయసిని వేడుకోవడంలో గతించినవి..
- బహుదుర్ షా జాఫర్ (తెలుగు సా.జరె)

తెలుగు సాహిత్యంలోనే కాదు తెలంగాణ కేంద్రంగా తలెత్తిన ఉద్యమేతర కవిత్వానికి 1987-97వ దశాబ్దం కీలకమైనది. సాధారణంగా 1970-80వ దశకాన్ని కల్లోల దశాబ్దంగా పిలువడం ఉన్నది. దానిని ఆ విధంగా నిర్వచించింది ఎవరోకాదు మహాకవి శ్రీశ్రీ. కానీ 87-97 మధ్యకాలాన పోటెత్తిన కవితాశ క్తుల పెనుకేకల కదన కాహళిని పరిశీలిస్తే ఈ దశాబ్దమే అస లుసిసలు కల్లోల దశాబ్దంగా భావించాలి. ఇది సాహిత్యరంగంలోనే కాదు సామాజికంగా కూడా.స్త్రీ వాదులే కాదు, దళిత బహుజనులు, మైనార్టీలు తెలంగాణ రైతుబిడ్డలు వంటి అణగారిన కష్టజీవుల నుంచి అడుగడుగునా కొత్త కవితాశక్తులు కొలువుదీరిన కాలమది. సిద్ధాంతాలు, నిబద్ధత వంటి సంకెళ్ల మధ్య ఆకాశపు దారులెంట అగ మ్యంగా వెళ్లిపోతున్న తెలుగు కవితను జీవితపు సత్యాల పునాదుల్లోకి మళ్లించిన చారిత్రిక యుగోదయమది. వాదాల ఛత్రచ్ఛాయల్లో రూపుదిద్దుకున్న కవితా సంరంభంలో నాడే తెలంగాణ నుంచి కొన్ని కొత్త గొంతులు హైదరాబాద్ కవన బలివితర్థి మీదికి ఫెటిల్లిన వెలుగుచూశాయి.

ఆంధ్రా నుంచి దిగుమతైన ప్రమాణాలను, నకిలీ అభివ్యక్తి రీతులపై తిరుగుబాటును ప్రకటించిన కవియోధులు వీరు. శ్రీశ్రీ తర్వాత తెలుగు సాహిత్యంలో ప్రాభవం నెరిపిన శివారెడ్డి కవితా వస్తువుకు, రూపాన్ని తిరస్కరించిన కవులు వీరు. అనేక అప వాదులు, అనేక అగచాట్లమధ్య 1997 నుంచి రాజుకున్న తెలంగాణ సాహిత్యోద్యమానికి దారులువేసిన కలం జీవులు వీరు. వీరిలో విశిష్టమైన కవి అయిల సైదాచారి. తమ సమాకాలీన కవి తా ప్రపంచాన్ని కాదని కొత్త వస్తువుతో, కొత్త అభివ్యక్తి రూపాల తో విభ్రమ గొలిపే ప్రతీకలతో వచ్చే కవులను అవాంట్ గార్డ్ పోయెట్స్‌గా పిలువడం ఇంగ్లీషు, ఫ్రెంచ్ పోయెట్రీలో ఒక రివా జు. వీరుకూడా అంతే. సైదాచారి కూడా అంతే.

వినూత్నమైన అభివ్యక్తితో విభ్రమ కొలిపే ప్రతీకలతో అంతకు మునుపు గుసగుసలకే పరిమితమైన సంగతులను కవితా వస్తువుగా తీర్చిదిద్ది ఎవరూ రాయనేరని, మరెవరూ ఇష్టపడని, రాయలేని అభివ్యక్తి ఆయనది. నిజానికి 1990ల తొలిపాదాల్లో నే తెలుగు కవితా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. సూర్యాపేట కంచరబజారులో కనుదెరిచిన ఈ కవిది ఒక వృత్తికార్మికుని కుటుంబం. నిజం చెప్పాలంటే వారి పూర్వికులది ఇత్తడి కళకు కాణాచి అయిన పెంబర్తి. చిన్నప్పటి నుంచే కష్టంచేస్తూ సంగీతపు లాలసలో, కవితోపాసనతో బతికీడుస్తూ అనేక కలల మధ్య, ఆదర్శాల వెలుగులో చదువుకోవడానికి ఈ అభాగ్యనగరిలో అడుగుపె ట్టాడు. సామాజికంగా దిగువ మధ్యతరగతి. రాత్రిపూట బిందెలు చేస్తూ, బియ్యం సంచులు మోస్తూ చదువుకున్నవాడు. అగ్రికల్చర్ బిఎస్సీ చదివిన సైదాచారి ముడుంబై సీతారామాచార్యుల దగ్గర శిక్షణ పొందిన సంగీతకారుడు. చదు వు, ఉద్యోగంతో ఉన్నత మధ్య తరగతికి చేరిన చారి తనను వెం టాడే గతజీవితపు అవశేషాలు, వాటిని విదుల్చుకోలేని అశక్తత, కనిపెంచిన తల్లిదండ్రులను ఆదుకోలేని నిస్సహాయత వంటి వైరుధ్యాల వల్ల పుట్టుకొచ్చిన ఘర్షణకు అక్షరరూపం ఇచ్చిన అపురూపమైన అక్షరబాటసారి.

1980ల నుంచి నిత్య నిర్బంధాల మధ్య, అణిచివేతల మధ్య ఎన్‌కౌంటర్ల మధ్య భాగ్యనగరిలో అడుగుపెట్టిన లక్షలాదిమంది తెలంగాణ దళిత, బహుజన రెతుబిడ్డల క్షోభకు అక్షరరూపమిచ్చిన వాడు. ఈ భాగ్యనగరం మహానగరంగా మారే క్రమాన స్త్రీ పురుషుల లైంగికతలో చోటుచేసుకున్న ఘర్షణ కూడా ఆయన కవితలో ప్రధాన భాగం. నిజం చెప్పాలంటే భావకవుల తర్వాత స్త్రీ కేంద్రంగా కవిత రాసిన ముగ్గురు తెలుగు కవుల్లో సైదాచారి ఒకరు. మరో ఇద్దరు పాలమూరుకు చెందిన కేతేపల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడకు చెందిన వజీర్ రహ్మన్. సైదాచారి వలె వారిద్దరు కూడా జీవితం నడిమధ్యలో కవితారచనకు సలాం చెప్పి కాలం చేయడం వైచిత్రి. అయితే సైదారి కవితలో కనిపించే స్త్రీ అమూర్తమైన ప్రేమికురాలు కాదు. భావకవుల బేల అసలే కాదు. చలంగారు చిత్రించిన అణగారిన ఆమె కూడా కాదు. గొప్ప ధైర్యం ఉన్న స్త్రీ మూర్తి, మహాశక్తిమంతురాలైన మహిళ. ధీరోదాత్తమైన తెలంగాణ మహిళ. ఈ లక్షణం తెలంగాణ తత్త్వకవితలో ఉన్నదే.

సైదాచారి లేడన్న విషయం తెలిసి ఫేస్‌బుక్ తెరిచాను. ఆయ న అకాలమృతికి సానుభూతులు కురిపిస్తూ పోస్టింగ్‌లు చూసి బాధపడూతూ నో హి విల్ రిమైన్ ఫరెవర్ అంటూ నేను పోస్టిం గ్ పెట్టాను. ఉర్దూ సాహిత్యంలో ఆపాగా పేరెన్నికగన్న ఇస్త్తత్ చుగ్తాయి గుర్తుకువచ్చింది. వాళ్లన్నయ్య ప్రఖ్యాత ఉర్దూ రచయి త అజీయ్ బేగ్ చనిపోయినప్పుడు ఆయన చెల్లెళ్లందరూ పడిప డి ఏడ్వడాన్ని చూసింది. వారిని ఓదారుస్తూ.. అన్నయ్య ఎన్నటికీ చావడు బతికే ఉంటాడు అని ఇస్మత్ అన్నదట. అదొక చెల్లె మ్మ అన్నయ్యకు ఇచ్చిన కితాబు కాదది. ఒక గొప్ప సాహితీవేత్త కు మరో గొప్పరచయిత ఇచ్చిన ప్రశంస. సైదాచారికి కూడా అంతే. చావులేదు, బతికే ఉంటాడు. ఆ అమరకవికి నా కన్నీటి నివాళి.
- సామిడి జగన్‌రెడ్డి, 85006 32551

580
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles