తొలినాటి కవిత్వం ప్రత్యూష


Mon,April 2, 2018 01:29 AM

image
సాహిత్యం అంటే హితాన్ని కూర్చేది అని అర్థం. హితేన సహితం సాహిత్యం అనడం కద్దు. సాహిత్యంలో మౌఖిక, లిఖిత సాహిత్యం రెండురకాలు గా చెప్పుకోవచ్చు. లిఖిత సాహిత్యాన్ని 19వ శతాబ్దికి పూర్వం పద్యరూపంలోనే గ్రంథాలలో, ప్రబంధాలలో మనకు కనిపిస్తుంది. కానీ పాశ్చాత్య ప్రభావంతో ఆధునిక కవిత్వం బహురూపాలుగా విలసిల్లుతున్నది. అది కవిత, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్రలు మొదలగు రూపాల్లో నేడు మనకు దర్శనమిస్తున్నది. అయితే సాహిత్య ప్రక్రియ ఏదైనా అది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. అప్పుడే ఆ సాహిత్యానికి సార్థకత. గతకాలపు సాహిత్య రచనను బేరీజు వేస్తే నాటి సమాజ స్థితిగతు లు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తా యి. వీటిని అంచనా వేయడానికి తోడ్పడుతాయి. అందుకే నాటి సాహిత్య విమర్శకులు సాహిత్యాన్ని యుగ విభజన చేశారు. తెలంగాణ సాహిత్యంలో వేటూరి ప్రభాకరశాస్త్రి, ఖండవల్లి లక్ష్మిరంజ నం, బిరుదురాజు రామరాజు, సురవరం ప్రతాపరెడ్డి, శేషాద్రి రమణ మొదలగువారిని స్మరించుకోవాలి.

ఆధునిక కవిత్వం 1875లో మొదలైంది. ఆధునికకాలంలో 19వ శతాబ్ది నుంచి మొదలైనదే ఆధునిక కవిత్వం. మన దేశంలో ఈ కాలంలో బ్రిటిషువారి ఏలుబడిలో పాశ్చాత్య సంస్కృతితో మిళితమై హిందూ సంస్కృతి కొత్తపోకడలు తొక్కింది. సినారె తన ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనే సిద్ధాంత గ్రంథంలో ఆధునిక కవిత్వాన్ని కండకావ్య, ఆత్మాశ్రయరీతి వస్తునవ్యత, భావనవ్యత, శైలి నవ్యత, కవిత రచనల్లో నవ్యత మొదలగు వాటిని పేర్కొన్నారు. 1798-1832 మధ్య పాశ్చాత్య ప్రభావంతో కాల్పనికవాదం ప్రవేశించింది. దీంతో తెలుగులో భావకవిత్వం, ప్రణయ కవిత్వం విలసిల్లాయి. ఇంగ్లీషులో 19వ శతాబ్దం ప్రారంభంలో వచ్చిన రొమాంటిక్ పోయెట్రి దీనికి ప్రేర ణగా చెప్పుకోవచ్చు. అభ్యుదయం అనే పదానికి అర్థం ప్రగతి, పురోగమనం అనవచ్చు. 1933-34 తెలుగులో అభ్యుదయ కవి త్వం మొదలైంది. నిజానికి జీవితాన్ని విమర్శించేది, పరామర్శించే ది సాహిత్యం. ఏ సాహిత్య రూపమైనా కావచ్చు జీవితాన్ని తప్పనిసరిగా వ్యాఖ్యానించాలి, భాష్యం చెప్పాలి. రచయితలు దళితు లు, పీడితుల పక్షం వహిస్తారని ప్రకటించాడు ప్రేవ్‌ుచంద్. దాశర థి,అగ్నిధార, సోమసుందర్ వజ్రాయుధం, అనిసెట్టి అగ్నివీణ, కుందుర్తి తెలంగాణ లాంటివి ప్రజాపక్ష సాహిత్యానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు.

ఇలాంటి ప్రజాపక్ష సాహిత్యానికి పతాకగా చెప్పుకోదగినది.. 28 మంది కవుల కవితా సంపుటి ప్రత్యూష. కవి తా సంపుటిలో తెలంగాణ ఉద్యమకవితగా, గేయంగా ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ది. ఈ గేయకవిత నేటికీ ప్రజల నాల్కలపై నడయాడుతూనే ఉన్నది. దాశరథి గారి గేయం ఆ చల్లని సముద్ర గర్భం పాట విననివారు ఉండరం టే అతిశయోక్తికాదు. ప్రశ్నార్థకం శీర్షికన ప్రత్యూ ష కవితా సంపుటిలోనిది గడియారం రామకృష్ణశర్మ హైదరాబాద్ రాజ్య ఔన్నత్యాన్ని తన సీస పద్యాలతో కీర్తించారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి తన పద్యాల్లో తెలంగాణ కవుల గణతను కొనియాడారు. దేవులపల్లి రామనుజరావుగారి పూలచెట్లు పద్యకవిత ఆధునిక కవితారీతికి అద్దం పడుతుం ది. కాళోజీ కవిత హృదయ వేదన నేటికి సజీవ చిత్రికమైన కవిత, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు.. తన భావావేశ అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది.

ప్రత్యూష కవితా సంపుటిలో 28 మంది కవులు తమదైన శైలి లో పద్య, వచన, గేయ కవితలను ఆలపించారు. అడ్లూరి అయో ధ్య రామయ్య (1922) దీపావళి, కాళోజీ నారాయణరావు- కాళోజీ కథలు, నా భారతదేశ యాత్ర, కండకావ్యాలు, కేశపంతు ల నృసింహశాస్త్రి (1919) త్యాగధనుడు, ఖండవల్లి లక్ష్మిరంజన ం-తెనుగుదుక్కి, ఆంధ్ర సాహిత్యచరిత్ర, గడియారం రామకృష్ణశర్మ (1919) చంద్రహాస పద్యకావ్యం, అలంపూరు శిథిల ము, చాటుపద్యాలు, తైలంగ సంస్కృతి లాంటివి తెలంగాణ జన జీవితాన్ని గొప్పగా చిత్రించాయి. దాశరథి అభ్యుదయ కవుల్లోను, విప్లవ రచయితల్లోనూ తలమానికం అనిపించుకున్నాడు. అగ్నిధా ర, రుద్రవీణ ఇతని రచనలు. దేవులపల్లి రామానుజారావు (1916) ఏకవీర, ధవళా శ్రీనివాసరావు (1919) ఖండకావ్యా లు, పర్సా జానకీదేవి (1923) మహిళాభ్యున్నతి కోసం పాటుప డి రచనలు చేశారు. పల్ల దుర్గయ్య కవిత్వాన్ని కళగా ఉపాసించు తూ మాతృభాషను కొల్చుటే జీవితాదర్శంగా కృషిచేశారు. పిల్లలమర్రి వెంకటహనుమంతురా వు, పులిజాల హనుమంతరావు, పొట్లపల్లి రామారావు, బూర్గుల రంగనాథరావు, బెల్లంకొండ చంద్రమౌలి శాస్త్రి, బహుగ్రంథకర్త బాగి నారాయణమూర్తి, మూటుపురి వెంకటేశ్వరావు, వానమామలై వరదాచార్యులు, మణిమాల, పుర్పుటేరు రాఘవాచార్యులు, వెల్దుర్తి మాణిక్యరావు, సన్నిధానం శ్రీధరశర్మ, సిరిప్రగడ భార్గవరావు తదితరులు చేసిన సాహితీసేవ ఎనలేనిది. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక స్థాపకుడిగా తెలంగాణ భాషాసాహిత్యాలకు చేసిన సేవ వెలకట్టలేనిది. ప్రత్యూష సంపుటి కవులు ఒక్కొకరిగా వారి సాహితీ విశిష్టతలను వివరించాలంటే ఈ వ్యాస పరిధి చాలదు. ఈ కవులు మరుగునపడిపోకుండా తెలంగాణ ప్రచురణకర్తలు ప్రత్యూష కవితా సంపుటిని పునర్ముద్రించి మనముందుంచినందుకు వారి కృషికి అభినందనలు.
- భూతం ముత్యాలు, 70139 96709

550
Tags

More News

VIRAL NEWS