అనుసృజనలో అడుగుజాడలు


Mon,March 19, 2018 01:01 AM

తెలుగు సాహిత్యంలో సుదీర్ఘ కవితాయానం చేసి, ప్రజానుకూల సాహిత్య సృజనలో తనదైన ముద్ర వేసి న కవి నిఖిలేశ్వర్. తను ఎనభయవ పడిని చేరుకున్నా వడి తగ్గని కవితా కృషీవలుడు. ఇటీవలనే ఆయన 50 ఏండ్ల కవితా సేద్యపు సంకలనం వెలువడింది. ఆయ న తెలుగులోనే కాక, ఇంగ్లీషు, హిందీ భాషలలోనూ నేరుగా సాహిత్య సృష్టి చేశారు. అంతేగాక ఆ భాషల నుంచి కవితలను తెలుగులోనికి అనువదించారు. వీటి నుంచి ఎన్నిక చేసిన 63కవితల సమాహారంగా అనుసృజన సంకలనం ఆవిష్కరించారు. అందులో తాను మొట్టమొదట 1959లో అనువదించిన రష్యన్ కవిత నుంచి 1917లో అనుసృజించిన టర్కిష్ కవిత వరకు దేశ విదేశ కవితలు సంకలించారు. విశాల విశ్వ కాన్వాసుపై ఇంతకాలం పాటు వచ్చిన కవితను ఒక్కచోట చదువగలుగటం చాలా ఆసక్తికరంగా వుంటుంది.నిఖిలేశ్వర్ పునఃసృష్టించిన ఈ కవితలను చదువుతుంటే, పరాయి కవిత్వాన్ని గాక, తెలుగు కవిత్వాన్ని చదువుతున్నట్టు ఉంటుంది. అది నిఖిలేశ్వర్ సాధించి న విజయం. ఆయా భాషల నైసర్గికత, జాతీయత కూడా ప్రతిబింబించింది. ఈ సంకలనంలోని కవితలు ఒక అంతర్జాతీయ దృక్పథాన్ని కూడా కలిగిస్తాయి. అలా ఈ అనువాదాలు భిన్న సంస్కృతుల మధ్య వారధులుగా నిలుస్తాయి.
nikileshr
హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో చదివిన కవితల్లో తనను బాగా ఆకట్టుకున్న వాటిని ఆయన అనువదించారు. అలాగే ఆకాశవాణి వారి సౌజన్యంతో, వారికోసం కొన్ని అనువాదం చేశారు. ఎన్నిక చేసిన ఇతర భాషల ఉత్తమ కవితలు కొన్ని ఉన్నాయి. అందువల్ల ఈ సంకలనంలో విస్తృతమైన వస్తు వైవిధ్యం వుంది. దాంతోపాటు నిఖిలేశ్వర్ అభిరుచి మేరకు ఎన్నిక చేసిన కవితలు కావటంతో ఒక తాత్విక ఏక సూత్రత, ఒక శైలీ సంవిధానం, విధానం కూడా కనిపిస్తాయి.
అనువాదకుడు కవి అయితే అతని శైలీ సంవిధానం అనువాదాలను వెంటాడుతూనే వుంటుందని స్వయంగా నిఖిలేశ్వర్ భావించారు. ఇది కొన్ని అనువాదాలకు అదనపు బలంగా తోడ్పడితే, కనీసం కొన్ని చోట్లయినా ఒక బలహీనతగా పరిధి విధిస్తుంది. ఈ అనుసృజనలో కవితలు జాగ్రత్తగా చదివితే ఆయా దేశాల, ప్రాంతాల మూలకవుల సంవిధానం కూడా స్పష్టాస్పష్టంగా కనిపిస్తుంది. నిఖిలేశ్వర్ తన తెలుగు కవితల్లో (సొంత రచనలు) వాడని పదాలు, పద బంధాలు, సమాసాలు, ఉపమాన ఉపమేయాలు, భావ చిత్రాలు, శైలీ విన్యాసాలు ఈ సంకలనంలో విరివిగానే కనిపిస్తాయి.

నేనే గాంధారి కళ్ళ గంతల్లో
నేనే ద్రౌపది ఆగ్నేయ సంకల్పంలో
నేనే కవిత్వంలోని శోణిత కటాక్షాన్ని..
(వనమాలీ విశ్వాస్)


ఎన్నుకొన్న కవితాంశాలను చూస్తే కవిగా, వ్యక్తిగా నిఖిలేశ్వర్ నడిచివచ్చిన మార్గం కూడా రేఖామాత్రం గా కనిపిస్తుంది. 1959లో చేసిన బోరిస్ సాస్టర్ నాక్ అనువాదంలో వినిపించిన స్వేచ్ఛ-వెలుగు నా వెనుక గూఢచిత సంచలనం అనే భావం కమ్యూనిస్టు వ్యవస్థలో పౌర స్వేచ్ఛ వుండదు అనే ప్రచారానికి లోబడిన దశ. 1969లో చేసిన జగదీష్ చతుర్వేది కవితానువా దం నగ్న ఆధారాలపై, కుష్టు గాయంతో, బాధతో అరుస్తోంది మానవత, సంస్కృతి వాంతి చేసుకొంది కుప్పలుగా పేడ పురుగుల్ని వంటివి ఆయన దిగంబర కవితాదశను సూచిస్తుంది. 1970లో ఎం.టి.ఖాన్ కవి త వర్తమానాన్ని పెరికి విప్లవ భవిష్యత్తును స్థాపించు తూర్పు అడవుల మూలాలలోంచి మాట్లాడుతున్న బాణం. ఎర్రగా, ఉద్రేకంగా వెయ్యి టి.ఎన్.టి శక్తితో బలంగా పేలమని పిలుపునిచ్చిన విప్లవ అతివాద దశ కు నిదర్శనం.1974లో గోడ మీది రాత (పంజాబీ నుంచి అనువాదం) జీవితం-స్వేచ్ఛ-విప్లవం గురిం చి ఆలోచిస్తూ నా స్వరం వ్యాపిస్తున్నది రోదసిలోకి. మంటల నాలుకలా కనిపించని పక్షి పాటలా అని విప్లవం జన సమ్మతంగా ఒక విస్తృతిలో సాగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రజాతంత్ర విప్లవదశను సూచిస్తోంది. 1978లోని ఫిలిప్ఫైన్స్, కవితానువాదం కవిలాంటివాడు గెరిల్లా. 1985లో వచ్చిన మేమంటే ఏమిటో నీకు తెలుసుకోవాలని వుంటే కవితలు మేమంటే విప్లవం అని ఒక ఆత్మ కథాత్మక ప్రకటన చేస్తాయి. పాబ్లో నెరుడా కవితానువాదం (1971లో) వారి గోడలను కడుతున్నది మా చక్కెర, వారి నగరాలను నిర్మిస్తున్నది చిలీ నిబైట్, విశ్వవిద్యాలయాలకు ఇస్తున్నది పెరాగ్వే, బ్రెజిల్ కాఫీ, కొలంబియా పచ్చరాళ్ళు..ఇలా మూడవ ప్రపంచ దేశాలన్నీంటా వ్యాపిం చిన సామ్రాజ్యవాద దోపిడీని గుర్తించిన తీరు భావాంబర విప్లవం నుంచి భౌగోళిక వాస్తవాలను నడచివొచ్చిన దశకు అద్దం పడుతున్నది. అమర్‌జత్ చందానీ పంజాబీ కవితను 1988లో చేసిన మామిడిచెట్టు అనువాదం, 1990లో వచ్చిన హత్య జరిగాక, 2007 లోని జైల్లో వున్న ఉద్యమకారుల కోసం, నాజిమ్ హిక్నెత్ టర్కిష్ కవితానువాదం, నిఖిలేశ్వర్ ప్రజాతంత్ర హక్కుల కోసం ఉద్యమిస్తున్న దశకు సంకేతం.

కుచాలు తప్ప ఇక్కడ కనపడవు మాతృమూర్తి పాలిండ్లు. డబ్బుతో అన్నీ కొనెయ్యగలమనే కృత్రిమ అంతరంగాలు తప్ప ఆప్యాయంగా పల్కరించే పెదాలు ఉండవు అంటూ సెనెగల్ మాజీ అధ్యక్షుని ఆవేదన పంచుకున్నా (2005), నా కూతురు ప్రపంచపటం లో తనకిష్టమైన రంగులు నింపటం నేర్చుకుంది. నా వేలు విడిచి నడవడం నేర్చుకుంది అన్న పాకిస్థానీ కవయిత్రి ఆత్మవిశ్వాసాన్ని అనువదించినా (2015), మీ వెనుకే వున్నది ఉత్సాహ ఉద్వేగాల సహోదరత్వం.. నీలి ఆకాశంలా అని, స్వతంత్ర ద్వారాలు దగ్గర నిం డైన కొమ్మల్లా విస్తరించిన టర్కిష్ కవులతో కరచాలనం చేసినా (2017).. ఈ అనుసృజన కవిత్వం దిగంబరం నుంచి అరుణాంబరం వరకు విస్తరించి నిఖిలేశ్వర్ కవితా తాత్వికతకు కరకంకణంలా భాసిస్తున్నది.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైకెత్తుతోంది తన కాగడాను, చావు దగ్గరి కొవ్వొత్తిలా.. అంటూ.. నీ కొవ్వొత్తుల్ని మరీ పైకి లేపి చరిత్రలో నడువు అని పిలుపుని స్తున్నాడు నిఖిలేశ్వర్. సాహితీ సృజనలోనూ, అనుసృజనలోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్న కవి నిఖి లేశ్వర్ ఆనుసరణీయుడు, ఆదర్శప్రాయుడు.
- డాక్టర్ యస్.జతిన్‌కుమార్, 98498 06281

570
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles