అజేయం


Mon,July 1, 2019 12:26 AM

ప్రాణ తర్పణాలిడ్సిన
ఫికర్ల కాలానికి
సుడిగుండాలీదిన
ముసుర్ల పయనానికి
చిగురాకులు తొంగిచూస్తున్న
నెనర్ల ఋతు ధర్మాలకి
కంచె నాటుకోవాలె...
పల్లెర్లను ఏరేసి
మల్లెమొగ్గల పేర్చుకుని
ఎత్తొమ్పుల తొవ్వలల్ల
మాటు, కాటుల మత్పరిచ్చి
పానాది దాటాలె...
రైతు కాలు పెట్టినచోట
జల సవ్వడికి
కలం నోట పలికిన
రూఢీ మాటకు
నోరెత్తే గొంతులకి కళ్ళుతెరిచే
రువ్వడి పాటకు
పునాది గట్టిగ పడాలె...
ఊరు తిరిగొచ్చిన పాలమూరును
పల్లవిస్తున్న పనీపాటల ఉషారును
విశ్వకీర్తనమౌతున్న నడత గతులను
కాపు కాసుకోవాలె...
అన్నేళ్లు ఏమొరిగిందో
డాబులేలే దగాలేలే
కొన్నేళ్ల కేమొచ్చిందో
సంపదలే సంతోషాలే
యిమరస చేసుకోవాలె...
చరిత్రలో చేరుతున్న కొత్త అధ్యాయ పాయలకు
పురాస్మృతుల అడుగుజాడల
అడుగులు తీస్తున్న పాదాలకు
వివక్షాల కక్షలకు, దాయాదుల పోరులకు
తెరదీసి, పబ్బం గడపనందుకు
గర్వంగ తలెత్తుకోవాలె...
కళలు పదారింతలై
కలల మజిలీలు పాలపుంతలై
మట్టికిచ్చిన ఒట్టు
నొక్కువడని చెల్లింపులై
గిట్లనే నడువాలె...
కనుబొమ్మలు జతపరచి
రెండు చేతుల చప్పట్లు చరచి
మోఖాసురులు పరారయ్యేలా
భూగోళం గిర్రున తిప్పాలె...

- దాసరాజు రామారావు, 96182 24503

117
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles