కాలాన్ని జయించిన కాళేశ్వరం


Mon,June 24, 2019 01:17 AM

kaleswaram-v-subbaiah
తరతరాల కన్నీళ్ళే
ఉత్తుంగ తరంగాలై ఉప్పొంగుతున్నవి
నీళ్ళున్న దగ్గరే
నాగరికతలేర్పడడం నిన్నటి మాట
మనుషుల దగ్గరికే నీళ్ళు రావడం నేటి
తెలంగాణ మాట
ఎండిన బావులు,వాగులు, కాలువలు
దోనలు, బుగ్గలు, చెలిమలు మళ్ళీ
నీళ్ళాడాలి
పరుగు పరుగున పరవళ్ళతో
సకల పంటలతో పరవశించాలి
తెలంగాణ ఎత్తున ఉన్నది ఎకసక్యాలు
నీళ్ళు దిగువకెట్ల పోతవని ధిక్కారాలు
పొద్దెక్కని అవమానాలు అణచివేతలు
బహువిధ మోసాలు...
గొంతెత్తుతే గుండెపిసికిండ్రు
వాటాలు హక్కులు చినిగిన కాగితాలు
ఎన్కౌంటర్లు కురిసినచోటే
ఎత్తిపోతలు పరుగెడ్తున్నవి
చెరువులు స్వయం పోషకాలు
చెరువులు ఆత్మగౌరవాలు
అలల నాదమై ప్రతిధ్వనించాలి
జనం పెరిగినట్లుగా జలం పెరుగాలి
జలం నిలువాలి జనం నవ్వాలి
కృష్ణా గోదావరలు
గుండె తడులు
దశబ్దాల వలస గోసలు
అర్దరాత్రి పత్తికాయల్లా బద్దలు
కాలాన్ని గడపడం కాదు
కాలాన్ని నదిమీద నిలబెట్టిన మహాసంకల్పం
కండ్లముందట కాళేశ్వరం జలేశ్వరం..
- వనపట్ల సుబ్బయ్య
94927 65358

146
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles