అంటరాని మామిళ్లు


Mon,June 10, 2019 01:21 AM

mamillu
రాలిన పండు
మనిషిని కూల్చింది
ఆకలి చెట్టుకింద శవమైంది

అతడిది ఒక్కమరణమేనా
కుటుంబమంతా నేలమీద రాలిన చిగురు మామిళ్లే కదా..!

ఉరి ఎవరిది
బొండిగ పిసికే చేతులెవ్వరివి
కులంమీద గురి ఎవరిది
దరి దొరకని బతుకెవ్వరిది..?

గ్రామం వెలివేస్తుంది
పంచాయితీ నిలదీస్తుంది
గాయాల సలపరింత గానమై
గళమెత్తేదెన్నడు
నోరెత్తనీయని చూపుని
ముక్కలుచేసే కాలమెన్నడు
యుగాల అపశ్రుతుల బంధనాలు
బద్దలు కొట్టే స్వరయాత్రకు మొదలెన్నడు
నీడలానడిచే అంటరానితనం
మెడలో మాల అయ్యేదెన్నడు

- వేముగంటి మురళి
83091 78109

186
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles