మిరుగు పండ్గ!


Mon,June 10, 2019 01:21 AM

rain-jukanti
ఆన దేవుడు ఆగకుండ అస్తడని
మెరుగు వానల మబ్బుల కొలది తెస్తడని
మిరుగు పండ్గ ఇల్లిల్లు చేస్తున్నరు

అవ్వ ఇంగు బెల్లం కల్వంల దంచి దంచి
ఉండలు గట్టి ఇంటోల్లకు
సోపతిగ ఇరుగు పొరుగోల్లకు పంచిపెట్టి
మొగులుకేసి ఆశగా సూస్తున్నది ఊరు మీదికి మబ్బు దిగాలని !

తియ్యగ ఇంగుబెల్లం తిన్నాకా
తియ్యటి ఆన సిన్కులు పడకుండ ఆగుతయా !
భూమిని తడుపనే తడుపుతై
మన్ను దాగిన ఇత్తనాలను తడుముతై !

మిరుగు నాడు ఆనవడితే
కాలం మంచిగుంటదని
తాత ముత్తాతల మాట బండ మీది శాసనమే !

ఇంకా నోట్ల ఇంగు బెల్లం కరుగనే లేదు
ఆన చిన్కులు మొదలైనై
ఆకిలంతా తడిసినోళ్లతోని మిరుగు పండుగైంది !!

- కందాళై రాఘవాచార్య
99086 12007

175
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles