ముసలి అద్దం


Mon,June 10, 2019 01:21 AM

mirror
పెద్ద మనుమరాలు
ఎండకాలం సెలవుల్లో
మా ఇంటికి వచ్చింది

పొద్దున అద్దంలో ముఖం చూసుకుంటూ
అమ్మా! అద్దం ముసలిదైంది
సరిగా కనిపించడంలేదు..
పెద్దమ్మాయికి ఫిర్యాదు చేసింది.

నడిపి మనుమరాలు
అమ్మమ్మా ! కొత్త అద్దం
దుకాణానికి పోయి కొనుక్కచ్చుకుందాం..
గావురాలు పోతూ చెప్పింది.

రెండేళ్ల చిన్న మనుమరాలు
ఇద్దరక్కల మాటలు విని
అద్దం గుంజుకొని
గోడకు విసిరి కొట్టింది.

ముక్కలైన అద్దంవైపు చూస్తూ
చేసేదంతా చేసి
ఎవరేమంటారోనని ఏడుస్తుంది.

పెయ్యి వృద్ధాప్య సూచనలు చేస్తున్నా
ఒప్పుకోలేక మసలిపోతున్న మనసును చూసి
పగిలిన దర్పణం
బేతాళునిలా పకపకా నవ్వింది..!

- జూకంటి జగన్నాథం

149
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles