సింగిడి లోకం..


Mon,June 3, 2019 01:24 AM

singidi
రమణీయ రవికిరణ శోభితంబయినట్టి
ఆ మోము కనినంత
ఆ బాలగోపాల హృదయమొప్పొంగ
వచ్చిందే వచ్చిందే వేల ఆశలతోడ
కోటి కాంతుల వీణ.. నా తెలంగాణ.

దాశరథీ పునర్నవమై, కాళోజీ గొడవతో
జయ్ శంకర్ విరచితమై.. ఆమరుల ఆశయమై
పరుగు పరుగన ఉరికె..
ప్రగతి పథ సాధనమై ప్రతి గడపలోకి..
అవ్వకూ-బిడ్డకూ, అక్కకూ-చెల్లకూ..
అన్నకూ-తమ్ముడికి, అందాల పొదరింటి తెలగాణకీ
వచ్చిందే వచ్చిందే వేల ఆశల తోడ
కోటి కాంతుల వీణ.. నా తెలంగాణ..

గోదారి గంగమ్మ, కృష్ణమ్మ సెలయేళ్ళు
దారితప్పిన బీళ్ళసొద పారదోలంగ
పాలిచ్చే తల్లులై మురిపాలు పంచంగా
వచ్చిందే వచ్చిందే వేల ఆశల తోడ
కోటి కాంతుల వీణ.. నా తెలంగాణ..

కాలుడీ కనికరమో.. ఈశ్వరుడి వేళయో
కాళేశ్వర తీర్థాన.. కైలాస గంగోలె
కదిలింది గోదారి తెలగాణకీ.. నా తెలంగాణకీ
రందొద్దు.. రగడొద్దు.. రండోయ్ పండుగ చేద్దాం.

హలములే మురవంగా..
కరములే మొక్కంగా..
పొలములే నవ్వంగా..
సారథై అండగా.. కేసీఆర్ ఉండగా
రైతుబంధు తెచ్చింది.. రైతు రాజ్యము
తెలంగాణ అయ్యింది సింగిడి లోకము.

water
అన్నిటినీ అధిగమిస్తూ..
అందరినీ హత్తుకుంటూ..
అభివృద్ధికి ముందరెళ్తు..
ప్రగతికి పచ్చలహారంబేస్తూ...
భరతజాతి నిర్ధేశకులమై..
సాగుతోన్న తెలంగాణ.. నిత్య పారిజాతమూ
కోటి అలల గీతమూ.. ఉషోదయపు పరిమళమూ..
ఆనందపు నందనమూ..
అద్భుతపు సోయగము..
- మధు బండి, 96037 96570

161
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles