మన తెలంగాణ


Mon,June 3, 2019 01:22 AM

జై తెలంగాణ జై జై తెలంగాణ
కల్లా కపటం తెల్వని జనసాంద్రపు మా తెలంగాణ
సత్యశీల సహజీవనం సాగించెడి మా తెలంగాణ
రెండు జూన్, ఆరు వసంతాలావిర్భావపు
మా తెలంగాణ
రైతుకు మేలొనెర్చే పరిపాలనొసగే మా తెలంగాణ
జై జై తెలంగాణ.. స్వతంత్ర తెలంగాణా!

కాలేశ్వర మేడిగడ్డ ప్రాజెక్టులే మాకు వరం
ఎత్తపోతల పాఱుకం ఏడేడు తరాల సుఖజీవనం
రైతుబంధు తెలుగు పాలన సుఫల సస్యశామలం
స్వతంత్ర తెలంగాణకు సకల వసతిల సౌకర్యం
జై జై తెలంగాణ.. స్వరాజ్య తెలంగాణా!

సహజ కవి పోతన సాహితి కవుల నిలయం
తెలుగు తల్లి యక్షగాన జావతాల జానపదం
నేతన్నల నైపుణ్యం హస్తకళల కళాకౌశలం
విశ్వమత సహనశీల తెలంగాణ సుసంస్కృతం
జై జై తెలంగాణ.. ప్రగతి ప్రతిభ తెలంగాణా!
- ఉప్పలోజు బ్రహ్మచారి
98489 17680

137
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles