జలభూతం


Mon,May 27, 2019 01:09 AM

k-sriramulu
మబ్బు నుండి కారినా
మట్టిలోంచి ఊరినా
బిందువులో సింధువు!
సింధువులో బిందువు!

ప్రాణాధారమో
పంచభూతాల్లో ఒకటో
భూగోళంలో
మూడువంతులాక్రమించినా
నీటి అవతారం-
కంటిగోళంలోంచి
పుట్టిన
కన్నీటి చుక్కకన్నా చిన్నదే!

ఇటు నుంచి అటూ
అటు నుంచి ఇటూ
పులిలా గర్జిస్తూ
ఆకాశం కీకారణ్యంలో
బీభత్సం చేస్తూ
నభోమండలం నుండి
భూమండలందాకా
ఏకధాటిగా కురుస్తున్న
వర్షధార-
మా అమ్మ స్తన్యధారకన్నా చిన్నదే!
పర్వతంలో పుట్టి

కాలువలు కాలువలై
పరుగెత్తుతున్న ప్రవాహమై
ఉధృతంగా పారుతున్న నదియై
కంటిచూపునకు
అందని మహాసంద్రమైనా
నీటికూడలి-
మా రైతన్న కండ నుండి
పుట్టిన చెమటచినుకు
కన్నా చిన్నదే!

కంటిచుక్క
స్తన్యధారజి
చెమట చినుకు
ఇవన్నీ
నీ నుండి
పుట్టినా జలమా!
నీ కన్నా అవి చాలాగొప్పవి!

మనిషికన్నాజి
మనసు గొప్పదన్నట్టు-

నీదేమో మూర్తిమత్వం!
అవేమో కీర్తిమంతం!!

- కందుకూరి శ్రీరాములు
9440119245

164
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles